Nindu Noorella Saavasam Serial Today February 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: చిత్రగుప్తుడికి ఆరు వార్నింగ్ - కోల్‌కతా వెళ్లని మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: నాగమణి ఇవ్వమని చిత్రగుప్తుడు అడగ్గానే నా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇవ్వనని ఆరు వార్నింగ్ ఇస్తుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: కాళీ జైలు నుంచి అమర్ ఇంటికి వస్తాడు. రాథోడ్ చూసి ఆపితే.. ఆగకుండా లోపలికి వెళ్తూ అమర్‌ను పిలుస్తాడు. భాగీ బయటకు వచ్చి ఏమైంది మామయ్యా అని అడుగుతుంది. నేను మీతో మాట్లాడను అమర్‌తోనే మాట్లాడతాను అంటాడు. ఇంతలో రాథోడ్ గల్లా పట్టుకుని లాగితే రాథోడ్‌ను కొట్టబోతాడు కాళీ. ఇంతలో అమర్ వచ్చి కాళీని కొడతాడు.
కాళీ: నేను మీ ఎదురుగానే ఉన్నాను మీరు చంపొచ్చు అయినా ఇవాళ నేన నిజం చెప్పడానికి వచ్చాను.
భాగీ: నిజమా.. ఏంటి మామయ్యా ఆ నిజం
కాళీ: ఈ ఇంటి కోడలు, ఈయన గారి మొదటి భార్య, ఈ పిల్లల తల్లి.. ఏ పాపం ఎరుగని ఆవిడ చావు వెనకాల ఎవరున్నారో చెప్పడానికి వచ్చాను.
శివరాం: ఏంటి మా కోడలిని ఎవరు చంపారో నీకు తెలుసా..?
కాళీ: నాకే కాదు సార్.. మీకు కూడా తెలుసు.. కానీ మంచితనం అనే ముసుగులో వాళ్లు ఉండటం వల్ల మీకు తెలియడం లేదు.. ఈయనను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని ఆమెను చంపారు. సరస్వతి వార్డెన్‌కు నిజం తెలుసని కూడా ఆవిడను నాతో చంపించాలనుకున్నారు. రెండో సారి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తే.. మధ్యలో భాగీ వచ్చిందని భాగీని కూడా అప్పటి నుంచి చంపడానికి చూస్తున్నారు.
అమర్: ఎవరు? నా ఆరును చంపింది ఎవరు..? ఆ బాబ్జీ వెనక ఉండి ఎవరు చేశారు.
కాళీ: ఆ మనోహరియే ఇదంతా చేసింది
అమర్: ( కోపంగా గట్టిగా) మనోహరి
అని పిలవగానే రూంలో ఉన్న మనోహరి ఉలిక్కిపడుతుంది. అంతా మనోహరి కల కంటుంది. ఆ కాళీ గాడు నిజంగానే నిజం చెబితే అయ్యో ఎలాగైనా రేపు వాణ్ని కలిసి కన్వీన్స్ చేయాలి అనుకుంటుంది మను. చిత్రగుప్తుడు పరుగెత్తుకుంటూ ఆరు దగ్గరకు వెళ్లి నాగమణి ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. దీంతో ఆరు చిత్రగుప్తుడిని తిడుతూ.. అసలే అంజును ఆ మనోహరి, రణవీర్ కలిసి ఏం చేస్తారో అని నేను టెన్షన్ పడుతుంటే.. మధ్యలో మీ గోల ఏంటి..? నా పని పూర్తి అయ్యే వరకు ఒక మూలన కూర్చోండి.. లేదంటే యమపురికి వెళ్లిపోండి.. పని పూర్తి అయ్యాక పిలుస్తాను వచ్చి తీసుకెళ్లండి అంటుంది. దీంతో గుప్త బాధపడతాడు. ఇంట్లో కోల్‌కతా వెళ్లడానికి అంజు రెడీ అవుతుంది .పిల్లలందరూ అంజును కిందకు తీసుకొస్తారు. బయట నుంచి గమనిస్తున్న ఆరు బాధపడుతుంది.
ఆరు: అంజు చిన్న మనసుకు వాళ్ల స్వార్థం అర్థం కావడం లేదు.
రాథోడ్: అంజు పాప నువ్వు ఉండే రెండు రోజులకు ఇంత బిల్డప్ అవసరమా..?
నిర్మల: ముందు నువ్వు ఆ కళ్లజోడు తీసేయ్ లేదంటే కనబడదు. ఎక్కడైనా కింద పడతావు.
అమర్, మిస్సమ్మ కిందకు వస్తారు.
అమర్: రణవీర్ బోర్డింగ్‌కు ఇంకా ఎంత టైం ఉంది
రణవీర్: గంటన్నర ఉంది సార్..
అమర్: రాథోడ్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు.
రణవీర్: మనోహరి ఫ్లైట్‌కు టైం అవుతుంది త్వరగా రా .. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు
భాగీ: రణవీర్ గారు మీరు అలవాటులో పొరపాటుగా అందరి ముందు మీ పరిచయాన్ని బయటపెట్టేశారు. అదే మనోహరి గారు మీకు బాగా తెలిసినట్టు.. పరిచయం ఉన్నట్టు అంత క్లోజ్‌గా పిలిచారు కదా.. అది అలవాటా..? పొరపాటా..? అని అడుగుతున్నాను.
రణవీర్: అదా కోల్‌కతాలో కొంచెం పరిచయం ఉన్నా క్లోజ్‌గా పిలుస్తాం..
మనోహరి: ఏయ్ ఏం మాట్లాడుతున్నావు.. మాకు ఇంతకు ముందు పరిచయం ఉండటం ఏంటి..?
రణవీర్: మనోహరి గారు మీ లగేజీ ఎక్కడ ఫ్లైట్‌కు టైం అవుతుంది అండి.
మనోహరి: నాకు ఇవాళ రావడం కుదరదు. మీరు అంజలి వెళ్లండి నేను రేపు పొద్దునే జాయిన్ అవుతాను.
రణవీర్: ఏమైంది ఎందుకు రావడం లేదు..
మనోహరి: రేపు పొద్దునే ఒక చిన్న పని పడింది. అది చూసుకుని వచ్చేస్తాను
రణవీర్ అంజును తీసుకుని వెళ్లబోతుంటే.. భాగీ ఆపుతుంది. అంజును కూడా పంపడం కుదరదు అని చెప్తుంది. అమర్ కూడా వద్దని చెప్తాడు. దీంతో రణవీర్ ఒక్కడే కోల్కతా వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















