క్రియేటర్స్‌కి యూట్యూబ్ అందించే సిల్వల్ కోటెడ్ అవార్డును సిల్వర్ బటన్ అని పిలుస్తారు. యూట్యూబ్ ఇచ్చే సిల్వర్ బటన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే యూట్యూబర్స్ దీనికోసం కష్టపడతారు. లక్షకుపైగా సబ్స్క్రైబర్లు దాటిన వారికి ఈ అవార్డును ఇస్తారు. దీనివల్ల డబ్బు సంపాదించవచ్చు. యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ గైడ్‌లైన్స్, కాపీరైట్ పాలసీలు ఫాలో అయితే దీనిని ఇస్తారు. యూట్యూబ్‌పై స్ట్రైక్‌లు, పెనాల్టీలు లేకుండా మంచి కంటెంట్ ఉంటే ఈ బటన్ ఇస్తారు. ఈ బటన్ సంపాదించేందుకు, వీక్షకులను అట్రాక్ట్ చేసేందుకు హై క్వాలిటీ కంటెంట్‌తో ఎంగేజ్ చేయొచ్చు. ఈ బటన్ ఉంటే యాడ్స్, స్పాన్సర్ షిప్స్, ప్రమోషనల్ వీడియోలు పెరుగుతాయి. మరింత మంది వీక్షకులను అట్రాక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కొలాబ్రేషన్స్తో బిజినెస్‌ను పెంచుకోవచ్చు. సిల్వర్ బటన్ ఉన్నవాళ్లు సూపర్ చాట్, మెంబర్‌షిప్‌లు వంటి ప్రత్యేకమైన యూట్యూబ్ ఫీచర్లకు యాక్సెస్ పొందుతారు. మీ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్లు పెరుగుతారు.