Nindu Noorella Saavasam Serial Today February 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఒకే గుడికి వెళ్లిన భాగీ, అమర్ – ఎమోషనల్ అయిన రాథోడ్
Nindu Noorella Saavasam serial Today Episode February 4th: అమర్ గుడికి వెళ్లే అదే గుడికి భాగీ వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ పిల్లలు నలుగురు స్కూల్‌కు వెళ్లడానికి రెడీ అవుతుంటే.. వాళ్లల్లో ఎవరిలో దైవశక్తి ప్రవేశించిందో తెలుసుకోవడానికి చంభా మంత్రదండ ప్రయోగించాలనుకుంటుంది. అందుకోసం మనోహరి, చంభా పిల్లల రూం దగ్గరక వెళ్తారు. మనోహరి డోర్ దగ్గరే ఉంటుంది. చంభా మాత్రం లోపలికి వెళ్తుంది.
చంభా: పిల్లుల స్కూల్ కు రెడీ అవుతున్నారా..?
అంజు: లేదు సర్కస్ చేస్తున్నాము
చంభా: నువ్వు భలే జోక్ చేస్తావు అంజు
అంజు: ఏంటి యాదమ్మ అది వెరైటీగా ఉంది.. ఏదీ ఒకసారి చూడనివ్వు
చంభా మంత్రదండాన్ని అంజు చేతికి ఇస్తుంది.
చంభా: అంజు పాప ఇది నా కోసం తెచ్చుకున్నాను. కింద కూర్చున్నప్పుడు పైకి లేవాలంటే ఇబ్బందిగా ఉంది కదా..? అందుకే తెచ్చుకున్నాను
ఆనంద్: ఓహో పైకి నుంచోవడానికి దీన్ని తెచ్చుకున్నారా..?
చంభా: అవును బాబు.. కావాలంటే నువ్వు కూడా దీన్ని పట్టుకుని చూడొచ్చు
ఆకాష్: ఇదేదో పాతకాలం మనుషులు వాడే ఊతకర్రలా ఉందే..?
చంభా: అలాంటిదే బాబు
ఆకాష్: మరీ ఇంత చిన్నది తెచ్చుకున్నావేంటి యాదమ్మ ఇంకెంచెం పెద్దది తెచ్చుకుంటే బాగుండేది కదా..? ఏది ఒకసారి ఇటివ్వు
ఆకాష్ చూస్తుంటాడు. డోర్ దగ్గర నుంచి అంతా చూస్తున్న మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది.
మను: ( మనసులో) ఆ ముగ్గురు కాదు అంటే కొంపదీసి అమ్మునా..? అమ్ములోనే దైవశక్తి ఉందా..? అందుకే మొన్న తనను తోయబోయి నేను కింద పడ్డానా..?
అమ్ముకు మంత్రదండం ఇవ్వు అని సైగ చేస్తుంది మనోహరి. చంభా సరే అంటుంది.
చంభా: అమ్ము ఇది ఒకసారి చూడు నాకోసం తెచ్చుకున్నాను
అమ్ము: ఆనంద్ క్యాంపస్ నుంచి ఇంకా మెసేజ్ ఏం రాలేదు. స్టడీ మెటీరియల్ గురించి క్యాంపస్ ఆఫీసులో కనుక్కోవడం బెటర్ కదా..?
అంటూ చంభా మాటలు పట్టించుకోదు. చంభా అసహన పడుతుంది.
చంభా: అమ్ము ఇలాంటిది ఎప్పుడైనా చూశావా నువ్వు
అమ్ము: ఓరేయ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. మనం స్టడీ మెటీరియల్ ముందే తెచ్చుకోవాలి కదా..?
చంభా, మనోహరి షాక్ అవుతారు..
ఆనంద్: ఎగ్జామ్స్ ఎఫ్రిల్ లో కదా అమ్ము ఇప్పటి నుంచే టెన్షన్ ఎందుకు..?
ఆకాష్: తను ముందే చదివేసి క్యాపంస్ టాపర్ అవ్వాలని అనుకుంటుందిరా
బయటి నుంచి మనోహరి అమ్ముకు ఎలాగైనా తగలేనా చేయ్ అంటూ చంభాకు సైగ చేస్తుంది. చంభా అలాగే అంటూ మెల్లగా అమ్ముకు తగిలేలా చేయబోతుంది.
అమ్ము: క్యాంపస్ టాపర్ అవుతానని డాడ్‌కు ప్రామిస్ చేశానురా..? అది నిలబెట్టుకోవాలి కదా..?
అంజు: స్కూల్ ఫస్ట్ వస్తానని నేను కూడా డాడ్‌కు చాలా సార్లు ప్రామిస్ చేశాను.. జరిగిందా..?
ఆనంద్: నీకు అమ్ముకు పోలికేంటి అంజు
ఆకాష్: నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చినా చాలే నాన్న హ్యాపీగా ఫీలవుతాడు
అప్పుడే మనోహరికి అమర్ కాల్ చేస్తాడు. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫోన్ రింగ్ టోన్ విన్న అమ్ము, యాదమ్మ మనోహరి ఆంటీ ఫోన్ సౌండ్ వినిపిస్తుంది అని అడగ్గానే.. అవును అమ్ము ఇందాకా మీరు రెడీ అయ్యారో లేదో చూసి రమ్మని నాకు చెప్పింది ఇప్పుడు తను వచ్చినట్టుంది అంటూ చంభా బయటకు వెళ్తుంది. తర్వాత అమర్, రాథోడ్ గుడికి వెళ్తారు. అక్కడ అమర్, భాగీని చూస్తాడు. రాథోడ్‌కు చెబితే భ్రమ అంటాడు. తర్వాత రాథోడ్‌కు భాగీని చూపిస్తుంది కరుణ. భాగీని చూసిన రాథోడ్ ఎమోషనల్ అవుతాడు. రాథోడ్, భాగీ మాట్లాడుకోవడం దూరం నుంచి అమర్ చూస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు





















