Nindu Noorella Saavasam Serial Today February 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పిల్లలను మోటివేట్ చేసిన అమర్ - మను, చంభా షాక్
Nindu Noorella Saavasam serial Today Episode February 3rd: జంతువుల గురించి పిల్లలకు చెప్తూ మోటివేట్ చేస్తాడు అమర్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మ కోసం పాలు తీసుకురావడానికి కిచెన్‌లోకి వెళ్లుంది భాగీ. అప్పుడే బయట నుంచి అమర్ ఆశ్రమంలోకి వస్తాడు. అమర్‌ను చూసిన కరుణ వెంటనే భాగీకి కాల్ చేస్తుంది. భాగీ కాల్ లిఫ్ట్ చేయదు. మరోవైపు పాలు తీసుకుని బయటకు వస్తుంటుంది భాగీ. హాల్లోకి రాగానే బుజ్జమ్మ మాట్లాడటం కనిపిస్తుంది. వాల్ అడ్డుగా ఉండటంతో భాగీకి అమర్ కనిపించడు.
భాగీ: బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుంది.. ఎవరు వచ్చారు
అనుకుంటూ పాలు తీసుకుని డోర్ దగ్గరకు వెళ్తుంది భాగీ. ఇంతలో కరుణ పరుగెత్తుకుంటూ లోపలికి వస్తుంది.
కరుణ: గుడ్ మార్నింగ్ అమరేంద్ర సార్
అనగానే.. భాగీ షాక్ అవుతుంది. పాల గ్లాస్ కింద పడిపోతుంది. భాగీ స్పీడుగా వెనక్కి వెళ్లి కిటికీలోంచి చూస్తుంది అక్కడ బుజ్జమ్మతో అమర్ ఉంటాడు.
అమర్: ఎందుకు అంత గట్టిగా అరిచావు
కరుణ: వినబడాలి కదా..? సార్ అందుకే అలా చెప్పాను.
అమర్: ఎవరికి వినబడాలి..?
కరుణ: ( మనసులో భాగీకి) మీకే సార్
అమర్: నాకేమైనా చెవుడు అనుకున్నావా..?
కరుణ: అంటే మీ ఆర్మీ వాళ్లు కూడా ఇట్లనే గట్టిగా అరుస్తారు కదా..?
అమర్: నేను ఆర్మీ నువ్వు కాదు కదా..?
బుజ్జమ్మ: ఏంటి ఆంటీ నేను హస్కీగా మాట్లాడి మేనేజ్ చేద్దామనుకుంటే మీరు వచ్చి గట్టిగా అరిచి స్పాయిల్ చేసేశారు
కరుణ: ఏం మేనేజ్ చేద్దామనుకున్నావు బుజ్జమ్మ
బుజ్జమ్మ: అమరేంద్ర సార్ వచ్చిన విషయం మా మేడంకు తెలియదు.. మేడం బయటకు వచ్చి సార్‌ను చూసి సర్‌ఫ్రైజ్ అవుతుంది అనుకున్నాను
కరుణ: ( మనసులో) సర్‌ఫ్రైజ్ కాదే షాక్ అయ్యేది
బుజ్జమ్మ: మీరు అరిచిన అరుపుకు ఇంట్లో మేడం భయపడిపోయి పాల గ్లాసు కింద పడేసినట్టు ఉన్నారు. పదండి సార్ నేను రెడీ అయిపోయాను. మీ ఇంటికి వెళ్దాం.. అక్కడి నుంచి నేను అంజు అక్కతో కలిసి స్కూల్ కు వెళ్లిపోతాను
అమర్: అదేంటి మీ మేడంకు చెప్పవా..?
బుజ్జమ్మ: బయటి నుంచి చెప్తాను లేండి.. బై మేడం
కరుణ: బై బుజ్జమ్మ
అని చెప్పగానే.. అమర్, బుజ్జమ్మ వెళ్లిపోతారు. కరుణ లోపలికి భాగీ దగ్గరకు వెళ్తుంది.
భాగీ: ( మనసులో) నన్ను క్షమించండి ఈ అపురూపమైన క్షణాలను మీకు దక్కకుండా చేశాను. ఇక నుంచి ఏదీ మిస్ అవ్వనివ్వను
కరుణ: ఓసేయ్ ఫోన్ ఎక్కడ పెట్టినవ్.. ఆయన వస్తుండని చెప్పనీకే ఫోన్ చేసిన
భాగీ: ఆయన రాక ముందే వస్తారని బుజ్జమ్మ నాతో చెప్పిందే..!
కరుణ: మరి రక్తసంబంధం అంటే ఏమనుకున్నావు..? ఆ మాత్రం సిక్స్ సెన్స్ ఉంటుందే
భాగీ: నేనే బుజ్జమ్మను ఆ ఇంటికి పంపిద్దామనుకున్నాను.. ఆయనే వచ్చారు.. నాకు చాలా సంతోషంగా ఉందే..
కరుణ: నీకు హ్యాపీడేస్ స్టార్ట్ అయిపోయినయ్ భాగీ అతి త్వరలోనే మీరు అందరూ కలిసి పోతారని అనిపిస్తుందే..
అంటూ కరుణ చెప్పగానే.. భాగీ నవ్వుతుంది. ఇక అమర్ పిల్లలకు యానిమల్స్ గురించి ఎక్స్‌ప్లైన్ చేయడానికి ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొస్తాడు. ఆయన ఒక బాక్స్ తీసుకుని వస్తాడు. పిల్లలందరూ వచ్చాక
అమర్: మనుషుల మీద జంతువులు, పక్షులు యాక్సిడెంటల్‌గా దాడులు చేస్తాయి. ఒక్కోసారి ఇంటెన్షనల్ గా కూడా దాడి చేస్తాయి. అమ్ము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీ మీద ఒక రోజు కుక్క, ఇంకొక్క రోజు రాబంధు దాడి చేశాయి కదా..
అమ్ము: అవును డాడ్
చంభా, మనోహరి భయపడుతుంటారు. అమర్ స్టార్ చేయండి అని చెప్పగానే.. ఆ వ్యక్తి బాక్స్ తెరుస్తాడు. అందులో రంగురంగుల చిలుక ఉంటుంది. ఆ చిలుకకు ఆయన డైరెక్షన్స్ ఇవ్వగానే ఆ చిలుక నేరుగా వెళ్లి చంభా మీద దాడి చేస్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















