Nindu Noorella Saavasam Serial Today February 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అమర్ – భాగీని డిస్టర్బ్ చేసిన ఆరు
Nindu Noorella Saavasam Today Episode: భాగీని నిజం తెలిస్తే ప్రమాదం అని గ్రహించిన ఆరు డైరీ చదవకుండా చేయడంతో ఇవాల్టీ ఏపిసోడ్ ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్ వచ్చినప్పటి నుంచి బాగా అడ్జర్వ్ చేస్తున్నాను తన బిహేవియర్ అనుమానంగా ఉందని అంటాడు. దీంతో రాథోడ్ ఇన్ని రోజులకు సరైన రూట్ లో ఆలోచిస్తున్నారు సార్.. అలాగే ఆ బాబ్జీ గురించి కూడా కొంచెం గట్టిగా వెతకండి సార్ అని చెప్తాడు. వాడి కోసం ఒక టీం వెతుకుతుందని అమర్ చెప్తాడు. ఇంతలో మనోహరి కారులో స్పీడుగా వెళ్లడం చూసి ఆమె కారును ఫాలో అవుతారు. మరోవైపు భాగీ రూంలో బుక్స్ సర్దుతూ ఆరు రాసిన డైరీ చూసి తీసుకుంటుంది. అప్పుడే కిటికీ దగ్గరకు వచ్చిన ఆరు భాగీ డైరీ చదవకూడదని బయటకు రమ్మని పిలుస్తుంది. మనోహరి కారు ఒక ఇంటి ముందు ఆపి ఆ ఇంట్లోకి వెళ్తుంది.
అమర్: మనోహరి ఇక్కడ దిగిందేంటి..?
రాథోడ్: అమ్మ మనోహరి కరెక్టు టైంకు కరెక్టుగా దొరికిపోయావు. నాకు తెలిసి రణవీర్ ముంబై వెళ్లి ఉండడు. వాన్ని కలవడానికే వచ్చినట్టు ఉన్నావు. ఇప్పుడు సార్‌ను లోపలికి పంపిస్తా.. నిన్ను అడ్డంగా బుక్ చేస్తా. ( అని మనసులో అనుకుని) సార్ ఆవిడ వెళ్లిన స్పీడు చూస్తుంటే.. మనిషి కంగారుగా ఉన్నారని అర్థం అవుతుంది. నాకు తెలిసి మీ అన్ని ప్రశ్నలకు లోపల సమాధానం ఉందేమో అనిపిస్తుంది సార్
అని రాథోడ్ చెప్పగానే అమర్ డౌటుగా చూస్తుంటాడు. మరోవైపు భాగీ గార్డెన్ లోకి వెళ్తుంది.
భాగీ: అక్కా ఏంటి మాట్లాడాలి అన్నారు
ఆరు: ఆ విషయం తర్వాత ముందు చెప్పు నువ్వు డైరీలో ఏం చదివావు
భాగీ: అక్క ఫ్యామిలీ గురించి తనకు ఇష్టమైన ఆర్‌జే గురించి రాసి ఉంటే చదివాను.
ఆరు: చదివేశావా..? మొత్తం తెలిసిపోయిందా
భాగీ: ఏం చదవడం గురించి మాట్లాడుతున్నారు అక్కా
ఆరు: ఇంత కూల్‌గా అడిగింది అంటే ఏం చదవలేదని అర్థం అవుతుంది. ( అని మనసులో అనుకుని సరే మిస్సమ్మ అయినా పిల్లలన చూసుకోవడానికి ఒక ఆయాను పెట్టుకోకూడదా..? అని చెప్తుంది. నేనే ఒక ఆయాను మళ్లీ ఇంకో ఆయా ఎందుకు అక్కా అంటూ నవ్వుతూ లోపలికి వెళ్తుంది భాగీ. ఇంతలో రాథోడ్ ఫోన్ చేసి మనోహరి సార్‌కు అడ్డంగా దొరికిపోయిందని మొత్తం చెప్తాడు. భాగీ ఆ విషయాన్ని సంతోషంగా వెళ్లి ఆరుతో షేర్ చేసుకుంటుంది. మరోవైపు మనోహరిని కోపంగా చూస్తుంటాడు రణవీర్.
రణవీర్: అంతా ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యి కరెక్టుగా అంజును కోల్‌కతా తీసుకునివెళ్లే టైంకి ఎందుకు రానని చెప్పావు. ఇప్పుడు నా ఆస్తి నాకు దక్కకుండా పోవడానికి కారణం నువ్వే..
మనోహరి: రణవీర్ నీకు నా పరిస్థితి గురించి చెప్పలేను చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాను. అందుకే మన ప్లానంతా పాడవుతుందని తెలిసినా నేను నీతో పాటు రాలేకపోయాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు.. ఇంతకు కోర్టులో ఏమన్నారు..?
రణవీర్: దుర్గకు ఒంట్లో బాగాలేదని లాయర్ హాస్పిటల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేశాడు. కొంచెం టైం కావాలని ఇంకోక వాయిదా తీసుకున్నారు.
మనోహరి: హమ్మయ్య మన ఆస్థి సేఫ్ కదా..? ఎక్కడ నీ బంధువులు రాబంధుల్లా లాక్కెళ్లిపోతారని భయపడ్డాను.
రణవీర్: మన ఆస్థా
మనోహరి: మనం భార్యాభర్తలం అయినప్పుడు ఆస్థిలో కూడా నాకు సగం వాటా ఉంటుంది కదా..?
రణవీర్: నేను కూడా అదే అనుకున్నాను. అందుకే పేపర్స్ కూడా రెడీ చేయించి పెట్టుకున్నాను.. ఈ పేపర్స్ మీద సంతకం చేయ్.
పేపర్స్ మీద మనోహరి సంతకం చేస్తుంది.
మనోహరి: హమ్మయ్య నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు.
రణవీర్: ఈజీగా చాలా కష్టంగా కూడా ఒప్పుకోను మనోహరి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సంతకం చేసింది డివోర్స్ పేపర్ మీద. ఆస్థిలో వాటా కాదు. నాకు డివోర్స్ కావాలని నీకు నోటీసు అమర్ ఇంటికే వస్తుంది.
మనోహరి షాకింగ్‌గా చూస్తుంది. ఇంతలో అమర్, రాథోడ్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. వాళ్లను చూసిన మనోహరి మరింత టెన్సన్ పడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















