అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఫారెస్ట్‌ లోకి ఎంటర్‌ అయిన స్కూల్‌ బస్సు – బంగ్లా చుట్టూ బాంబులు పెట్టిన అరవింద్  

Nindu Noorella Saavasam Today Episode:  ఫారెస్ట ఆఫీసర్లకు అబద్దం చెప్పి రాకీ బస్సును లోపలికి తీసుకెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  బస్సులో గన్స్‌ పట్టుకుని పిల్లలను, ప్రిన్సిపాల్‌ను భయపెట్టిన రౌడీలు. చెక్‌పోస్టు దగ్గర ఎవరైనా నోరు జారితే బస్సులో పెట్టిన బాంబు పేలుస్తామని బెదిరిస్తారు. దీంతో పిల్లలు భయంతో వణికిపోతుంటారు. అంజు మాత్రం ధైర్యంగా రౌడీల దగ్గర ఉన్న గన్స్‌ చూస్తూ అవి ఎలా పేలుతాయోనని ఆలోచిస్తుంది.

అమ్ము: అంజు కామ్‌ గా కూర్చో.. వాళ్లను చూస్తుంటే నీకు భయంగా లేదా..?

అంజు: భయమెందుకు అమ్ము.. నేను ఎవర్ని ది గ్రేట్‌ అమరేంద్ర కూతురిని

అమ్ము: మిస్సమ్మ ముందే చెప్పింది. ఎక్స్‌ కర్షన్‌ వద్దని మనమే వినకుండా మిస్సమ్మను తిట్టి మరీ వచ్చాము.

ఆనంద్‌: అవును అక్కా.. మిస్సమ్మ మాట విని ఉంటే ఇప్పుడు మనం సేఫ్‌గా ఉండేవాళ్లం.

ఆకాష్‌: మనం మిస్సమ్మను అపార్థం చేసుకున్నాం. వచ్చినప్పుడు కనీసం చెప్పలేదు పాపం మిస్సమ్మ ఎంత బాధపడిందో..

అంజు: ఏయ్‌ ఆపండి నా ముందు మిస్సమ్మను పొగడటం నాకు ఇష్టం ఉండదని తెలియదా..?  ఇంకోసారి మిస్సమ్మను గుర్తు చేసుకుంటే బాగుండదు. ఏయ్‌ బంటి నీకా గన్‌ కావాలా..? ఒకసారి అడుగు.

బంటి: ఏయ్‌ పొట్టిదాన కామ్‌గా కూర్చో..

అంటూ భయంతో వణికిపోతుంటాడు బంటి. మరోవైపు తన అనుచరులతో  ఫారెస్టులోకి వెళ్తుంటాడు అరవింద్‌. వాళ్లకు అటవీ శాఖ వారి పాములున్నాయి జాగ్రత్త అనే బోర్డు కనిపిస్తుంది.

అనుచరుడు: అన్న అటూ చూడు ఆ బోర్డు మీద ఏం రాసిందో చూడు అన్న.

అరవింద్‌: ఏంట్రా ఆ బోర్డు చూడగానే భయపడిపోయావా..? ఆ బోర్డు చూశావా..? ఎంత పాతది అయిపోయిందో.. ఆ పాటికి పాములన్నీ ముసలివి అయిపోయి చచ్చిపోయి ఉంటాయి పదండిరా..?

అంటూ తిట్టుకుంటూ లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు కారులో వెళ్తున్న మిస్సమ్మ ఏడుస్తుంది. పిల్లలు ఎంత భయపడుతున్నారో అంటూ త్వరగా వాళ్లను పట్టుకోవాలి అని అమర్‌కు చెప్తుంది. ఫారెస్ట్‌లో పాత బంగ్లా దగ్గరకు వెళ్లిన అరవింద్‌ బంగ్లా చుట్టు బాంబులు పాతమని తన మనుషులకు చెప్తాడు.  అందరూ బంగ్లా చుట్టు బాంబులు పెడతారు. బస్సును ట్రాక్‌ చేస్తున్న అమర్‌కు లాప్‌టాప్‌ లైవ్‌ లోకేషన్‌ చూస్తుంటాడు.

అమర్‌: వాళ్లు షార్ట్‌ కట్‌లో ఫారెస్ట్‌ లోకి ఎంటర్‌ అవ్వాలని చూస్తున్నారు.

భాగీ: అయితే వెంటనే చెక్‌పోస్ట్‌ కు ఫోన్‌ చేసి బస్సును ఆపమని చెప్పండి.

అమర్‌: అవును ఇప్పుడే చేస్తాను..

అని అమర్‌ చెక్‌ పోస్టు ఆఫీసర్‌ డీటెయిల్స్‌, ఫోన్‌ నెంబర్‌ పెట్టమని తమ ఆఫీసుకు ఫోన్‌ చేస్తాడు. మరోవైపు బస్సు చెక్‌ పోస్ట్‌ దగ్గరకు వస్తుందని ఎవరైనా అల్లరి చేశారనుకోండి బాంబు పేలుస్తాను అని డ్రైవర్‌ బెదిరిస్తాడు. ఫారెస్టు  ఆఫీసర్లు బస్సును చెక్ చేస్తుంటారు. అంజు ఎన్ని సైగలు చేసినా పట్టించుకోరు. కానీ పిల్లలకు జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. బస్సు వెళ్తుంటే ప్రిన్సిపాల్‌ అఫీసరుకు సైగ చేస్తుంది. అది గమనించిన ఆఫీసరు ఈవిడ  ఎవరో తేడాగా ఉన్నట్లుంది అనుకుంటాడు. బస్సు వెళ్లిన కొద్దిసేపటికి అమర్‌ చెక్‌పోస్టు దగ్గరకు వస్తాడు. ఫారెస్ట్ ఆఫీసరుకు బస్సు గురించి ఎంక్వైరీ చేసి డ్రైవర్‌ ఫోటో చూపిస్తాడు. వెంటనే అక్కడి నుంచి అందరూ బస్సు వెళ్లిన రూట్‌లో వెళ్తారు.  బస్సును డ్రైవర్‌ ఒక దగ్గర ఆపుతాడు.

డ్రైవర్‌:  ఇక్కడితో రోడ్‌ పినిష్‌ అయిపోయింది. ఇక నడుచుకుంటూ వెళ్దాం అందరూ దిగండి.

అరవింద్‌ ఫోన్‌ చేస్తాడు.

అరవింద్‌: అరేయ్‌ రాకీ బంగ్లా చుట్టూ ల్యాండ్‌మైన్స్‌, బాంబులు ఉన్నాయి జాగ్రత్తగా రండి.

రాకీ:  ప్రిన్సిపాల్‌ గారు ఇక్కడ మొత్తం బాంబులు ఉన్నాయట.  అందరూ నా వెనకాలే నడవాలి. తేడా జరిగితే అందరం చనిపోతాం.

ప్రిన్సిపాల్: సరేనండి.. పిల్లలూ.. అందరూ ఓకే లైన్‌ లో నడవాలి.

అని చెప్పి అందరూ ఒకే లైన్‌గా నడుచుకుంటూ వెళ్తారు.  

 పిల్లలన తీసుకుని రాకీ రావడం చూసిన అరవింద్‌ మరో అనుచరుణ్ని పిలిచి వెళ్లి పిల్లలను బంగ్లా దగ్గరకు తీసుకురాపో అని చెప్తాడు. సరేనని అతను వెళ్లిపోతాడు. మరోవైపు ఆరు గుప్త గీసిన బంధంలోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ బయటకు రాలేకపోతుంది.  గుప్త వచ్చి ఆరును రెచ్చగొడతాడు. అక్కడ నీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు నువ్వు వెళ్లి కాపాడుకో అంటాడు. గుప్త గారు   మీరిదంతా కావాలని చేస్తున్నారని నాకు తెలుసు అంటుంది ఆరు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Embed widget