Nindu Noorella Saavasam Serial Today December 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అడవిలో భాగీని చంపేందుకు మనోహరి ప్లాన్ - ఆశ్చర్యపోయిన చంభా
Nindu Noorella Saavasam serial Today Episode December 4th: ఎన్ని ప్రయత్నాలు చేసినా భాగీ చనిపోవడం లేదని తానే స్వయంగా భాగీని చంపేందుకు ప్లాన్ చేస్తుంది మను

Nindu Noorella Saavasam Serial Today Episode: అడవిలో అంజు, ఆనంద్ లను వెనక నుంచి ఒక రౌడీ కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తుంటే.. వెంటనే అమర్ వచ్చి ఆపేస్తాడు. అమర్ ను చూసిన పిల్లలు హ్యపీగా ఫీలవుతారు.
అమర్: పిల్లలు భయపడకండి ఇటు వైపు వెళ్లండి. అదిగో అక్కడ చెట్లకు రెడ్ క్లాత్ కట్టుకుని ఉంటుంది వాటిని ఫాలో అవుతూ వెళితే మన కార్లు వస్తాయి. మీరు అక్కడకు వెళ్లండి. నేను మిగతా వాళ్లను సేవ్ చేసి పంపిస్తాను.
పిల్లలు వెళ్లిపోయాక అమర్ పిల్లలను పిలుస్తాడు. అమర్ సౌండ్ విని భాగీ ఆయన వచ్చారు అని ధైర్యంగా ఫీలవుతుంది. ఇక అమ్ము, ఆకాష్ లను రౌడీ పట్టుకుని చంపబోతుంటే అమర్ వెళ్లి రౌడీని కొడతాడు. పిల్లలు అమర్‌ను హగ్ చేసుకుంటారు. అమ్ము: డాడ్ ఆనంద్, అంజు కనిపించడం లేదు
అమర్: వాళ్లిద్దరిని నేను కారు దగ్గరకు పంపిచేశాను. సరే మీరు వెంటనే బయలుదేరి కార్లు ఉన్న ప్లేస్‌కు వెళ్లండి. కేర్‌ఫుల్ జాగ్రత్తగా వెళ్లండి. నేను మిగతా వాళ్లను తీసుకొస్తాను
అమ్ము: డాడ్ ఇందాక మిస్సమ్మ గట్టిగా అరిచింది. మిస్సమ్మకు ఏమైందో..?
అమర్: ఎవ్వరికీ ఏమీ కాదు నేను చూసుకుంటాను మీరు వెళ్లండి
అని చెప్పగానే.. అమ్ము, ఆకాష్ వెళ్తారు. ఇక కార్ల దగ్గరకు వెళ్తున్న అంజు, ఆనంద్ లను రౌడీ చూసి చంపడానికి వెళితే పిల్లలు అక్కడి నుంచి పారిపోతారు. అంజు, ఆనంద్ ఊబి దగ్గరకు వెళ్లగానే.. అంతకు ముందే అక్కడే ఉన్న ఆరు.. గుప్తను తన పిల్లలను కాపాడమని వేడుకుంటుంది. గుప్త గట్టిగా ఆగండి అనగానే ఆనంద్, అంజు ఆగిపోతారు. వెనక నుంచి వచ్చిన రౌడీ పరుగెత్తుకుంటూ ఆనంద్ వాళ్ల మీదకు రాగానే ఆనంద్, అంపు పక్కకు తప్పుకుంటారు. రౌడీ వెళ్లి ఊబిలో పడిపోతాడు.
అంజు: ఆనంద్ అతను ఊడిలో కూరుకుపోతున్నాడు పాపం
ఆనంద్: అవును అంజు అతను చనిపోతాడేమో..?
అంజు: అవును ఎలాగైనా అతన్ని కాపాడాలి. తనను పైకి లాగాలి
ఆనంద్: మరి అతను పైకి వచ్చాక మనల్ని చంపబోతే..
అంజు: అరేయ్ ఆనంద్ మన కళ్ల ముందు ఒక మనిషి ప్రాణం పోతుంటే అలాగే చూస్తూ ఊరుకుంటామా..? ఆపదలో ఉన్న శత్రువైనా సరే కాపాడాలి అని అమ్మ చెప్పింది కదా ముందైతే అతన్ని కాపాడదాం.. అతను పైకి రాగానే పారిపోదాం
ఆనంద్: సరే అంజు ఏదైనా తాడు లాంటిది దొరుకుతుందేమో తీసుకురా
అంజు పెద్ద కర్ర తీసుకొస్తుంది. కర్రతో రౌడీని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటారు అంజు ఆనంద్. గుప్త ఆశ్చర్యపోతాడు.
గుప్త: (మనసులో) ఆహా ఇది కదా పెంపకం అనిన ఇది కదా మానవత్వం అనినా.? నువ్వు మనుషులలో దేవతవు బాలిక. నీ పిల్లపిచ్చుకలకు మంచితనం మానవత్వం నేర్పించితివి.. తమ ప్రాణాలు తీయాలనుకున్న ప్రాణాలనే కాపాడుతున్నారు. ఇంత గొప్ప మాతృమూర్తికి నిష్కారణంగా ఆయుష్షు తీరేలా చేసి మేము మా ప్రభువులు పాపం చేసితిమి.. మమ్మల్ని క్షమించుము బాలిక
రౌడీ ఊబిలోంచి బయటకు వస్తాడు.
అంజు: అంకుల్ మీకు ఏం కాలేదు కదా..?
రౌడీ: నాకేం కాలేదు అమ్మా చిన్న పిల్లలు అయినా నేను మిమ్మల్ని చంపాలి అనుకున్నాను. కానీ మీరే నా ప్రాణాలు కాపాడారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అమ్మ
ఆనంద్: అంజు చాలా పెద్ద ప్రమాదం తప్పింది మనకు.. ఆ దేవుడే మనల్ని కాపాడాడు. కారు దగ్గరకు వెళ్దాం పద
అని వెళ్లిపోతారు. ఆరు గుప్త దగ్గరకు వెళ్తుంది.
ఆరు: చాలా థాంక్స్ గుప్త గారు మా పిల్లలను కాపాడారు..?
గుప్త: నీ పిల్ల పిచ్చుకలను కాపాడింది మేము కాదు బాలిక వారిలోని మంచితనం.. బాలిక తమ ప్రాణాలు తీయాలనుకున్న వారికే నీ పిల్ల పిచ్చుకలు ప్రాణ బిక్ష పెట్టిరి నిజంగా నీ పిల్ల పిచ్చుకలు దేవతలు
ఆరు: గుప్తగారు మిగతా వారిని వెతుకుదాం పదండి
అంటూ వెళ్లిపోతారు. మరోవైపు పులి నుంచి తప్పించుకుని పారిపోతున్న భాగీ ఊబి దగ్గరకు వెళ్తుంది. వెనకే వచ్చిన మనోహరి, చంభా ఇద్దరూ కలిసి భాగీని ఊబిలో తోసేయాలని డిసైడ్ అవుతారు. దీంతో మనోహరే వెనక నుంచి వెళ్లి భాగీని తోసేయబోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















