Nindu Noorella Saavasam Serial Today December 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అరుంధతి ఫోటో చూసిన భాగీ – మనోహరికి వార్నింగ్ ఇచ్చిన ఘోర
Nindu Noorella Saavasam Today Episode: అరుంధతి ఫోటో చూసిన భాగీ షాక్‌తో కిందపడబోతుంటే అందరూ పట్టుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ తన ఫోటో చూస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని భయంగా ఆరు ఆలోచిస్తుంది. దీంతో ఈ భయం ముందే ఉండాల్సింది బాలిక నువ్వు అప్పుడే మా లోకానికి వచ్చి ఉంటే ఇప్పుడు ఇంత భయపడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కదా అంటాడు గుప్త.
అరుంధతి: నేను మిస్సమ్మకు కనిపిస్తానని కానీ విషయం ఇంత దూరం వస్తుందని కానీ నాకేం తెలుసు.. అన్ని తెలిసి మీరు సైలెంట్‌గా ఉన్నారు కదా ముందు మిమ్మల్ని అనాలి.. అసలు నేను మిస్సమ్మకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నానో అది మాత్రం చెప్పరు.
గుప్త: అది చెప్పాలి అంటే నీ పుట్టుకతో మొదలుపెట్టాలి
అరుంధతి: ఏంటి గుప్త గారు నా పుట్టుకతో మొదలుపెట్టాలా..? గుప్త గారు చెప్పండి నా పుట్టుకకు.. మిస్సమ్మకు నేను కనిపించడానికి ఉన్న సంబంధం ఏంటి..
గుప్త: ముందు నువ్వు సమస్యలో ఉన్నావు. ఆ బాలిక నీ చిత్రపటమును చూసినచో లేని పోని ప్రమాదములు వస్తాయి. ప్రస్తుతం ప్రమాదం తప్పినా పూర్తిగా ప్రమాదం తప్పలేదు
అంటూ గుప్త మాట మారుస్తూ అరుంధతని డైవర్ట్ చేస్తాడు. మరోవైపు మనోహరి రూంలో ఆలోచిస్తుంది. ఘోర ఫోన్ చేస్తాడు.
ఘోర: మనోహరి ఆ ఆత్మ ఆస్థికలు స్మశానంలో ఎందుకు లేవు.. ఎక్కడ ఉన్నాయి
మనోహరి: ఘోర ఆ ఆస్థికలు తీసుకుని నీకు ఇద్దామని నేను అక్కడికి వెళితే అక్కడికి అమర్ వచ్చాడు. నన్ను అనుమానించాడు. కొద్దిలో తప్పించుకున్నాను.
ఘోర: ఏంటి మనోహరి అక్కడ అందరినీ మోసం చేసినట్టు నన్ను మోసం చేస్తున్నావా…? ఆస్థికలు ఎందుకు తీసుకెళ్లాలనుకున్నావు. నీకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయావు.. ఇప్పుడిక నా ప్రయాణం నీవైపే
మనోహరి రూంలోకి భాగీ వస్తుంది.
భాగీ: ఇప్పటిదాకా చేసిన తప్పులు చాలు మను.. అక్క అస్థికలు తీసుకుని ఆ ఘోరాకు ఇవ్వడానికి ప్రయత్నించావు. ఇక నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు.
అని తిట్టి వెళ్లిపోతుంది.
మనోహరి: విన్నావా ఘోరా ఇప్పుడైన నా మీద నమ్మకం వస్తుందా..?
ఘోర: సరే మనోహరి నేను నిన్ను నమ్మాలి అంటే ముందు నువ్వు ఆస్థికలు నాకు తీసుకొచ్చి ఇవ్వు అప్పుడు నమ్ముతాను.
మనోహరి: ఆ ఆస్తికలు అమర్ రూంలో ఉన్నాయి. అవి తీసుకురావడం చాలా కస్టం ఘోర.
ఘోర: నాకు కథలు చెప్పొద్దు మనోహరి. అవి ఎలాగైనా తీసుకొచ్చి నాకు ఇవ్వు
అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఘోర. తర్వాత రాత్రికి అందరూ నిద్రపోయాక.. రాథోడ్, భాగీ ముసుగులు వేసుకుని బయటకు వచ్చి నిలబడతారు.
భాగీ: అంతా మనం అనుకున్నట్టే జరగుతుంది కదా.. రాథోడ్..
రాథోడ్ : అంతా మనం అనుకున్నట్టే జరగుతుంది మిస్సమ్మ..
భాగీ: మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే పౌర్ణమి అయ్యే వరకు మనం గుండెల మీద చేయి వేసుకుని పడుకోవచ్చు రాథోడ్.
అమర్: ఏం జరగుతుంది ఇక్కడ.. ఆ ఎక్స్ ప్రెషన్స్ ఏంటి.. రాథోడ్ మీ ఇద్దరి గెటప్స్ ఏంటి..
రాథోడ్: అంటే అది చలికాల కదా సార్..
అమర్: ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు
రాథోడ్: అంటే సార్ ఆస్తికలు ఇంట్లో ఉన్నాయి కదా..? వాటికి కాపలా కాస్తున్నాం సార్.
భాగీ: అక్క ఆస్థికల విషయంలో చాన్స్ తీసుకోలేం కదా
అమర్: సరే అయితే రాథోడ్ ఏమైనా అవసరం అయితే నన్ను నిద్ర లేపు
అని అమర్ వెళ్లిపోతాడు. వెనకాలే భాగీ వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం దేవుడికి పూజ చేశాక అందరికీ హారతి ఇచ్చిన తర్వాత భాగీ.. అరుంధతి ఫోటో చూస్తుంది. ఫోటో చూసిన తర్వాత షాక్‌తో కింద పడబోతుంటే అందరూ పట్టుకుంటారు. ఏమైంది మిస్సమ్మ అని అడుగుతుంటే భాగీ పలకకుండా ఆరు ఫోటో దగ్గరకు వెళ్లి చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!