Nindu Noorella Saavasam Serial Today December 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ : అమర్ సేఫ్ – మనోహరిపై పేలిన పిల్ల తూటాలు
Nindu Noorella Saavasam Today Episode: మనోహరిని టార్గెట్ గా చేసుకుని పిల్లలు మాట్లాడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ను బతికించేందుకు చిన్న అవకాశం ఉన్నా చెప్పండి గుప్తగారు అని ఆరు ప్రాధేయపడుతుంది. అందుకోసం నేను ఏమైనా చేస్తానని మోకాళ్ల మీద కూర్చుని బతిమాలుతుంది. ఆరు దీనావస్తను చూసిన గుప్త చలించిపోతాడు. ఒక్క అవకాశం ఉందని చెప్తాడు. అదేంటో చెప్పండి అని ఆరు అడగ్గానే నీ స్పర్శ శక్తిని దేవుడికి ధారపోయాలని అప్పుడే అమర్ బతికే చాన్స్ ఉందని గుప్త చెప్తుండగానే ఆరు వెళ్లి హాస్పిటల్ లో ఉన్న దేవుడిని ప్రార్దిస్తుంది. ఇంతలో ఆపరేషన్ థియేటర్ లోంచి డాక్టర్ బయటకు వస్తాడు.
భాగీ: డాక్టర్ గారు ఆయనకు ఎలా ఉంది…?
డాక్టర్: ఇప్పుడే బాడీలోంచి బుల్లెట్ తీశాం. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు.
మనోహరి:ఇప్పుడు లోపలికి వెళ్లగానే ముసలి సంఘం మొత్తం నా మీదకు దాడికి వస్తారు. అదే జరిగితే అమర్ దృష్టిలో నేను బాడ్ అయిపోతాను. వాళ్ళు స్టార్ట్ చేయక ముందే నేనే అమర్ ముందు బాధపడినట్టు నటిస్తే సరిపోతుంది
( అని మనసులో అనుకుంటుంది.)
శివరాం: డాక్టర్ గారు మేము వెళ్లి మా అబ్బాయిని చూడొచ్చా..?
డాక్టర్: చూడొచ్చు పది నిమిషాల్లో రూంకు సిఫ్ట్ చేస్తున్నాము ఇంకో విషయం పేషెంట్‌కు రెస్ట్ కావాలి. మీరు చూసి వచ్చేయండి. పేషెంట్ ను డిస్టర్బ్ చేయోద్దు
అని డాక్టర్ చెప్పగానే అందరూ రూంలోకి వెళ్తారు. ఆరు కూడా అమర్‌ను చూడటానికి వెళ్తుంటే.. గుప్త వెల్లొద్దని వారిస్తాడు.
ఆరు: ఎందుకు గుప్త గారు నన్ను పదే పదే ఆపుతున్నారు.
గుప్త: ఎందుకంటే నేను నిన్ను ఆపకపోతే నువ్వు తప్పు మీద తప్పు చేసేదవు. వాటిని కప్పు పుచ్చలేక నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆరు: మా ఆయన అంత పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. నాకు చూడాలని ఉండదా..?
గుప్త: ఉండును కానీ ఆ బాలిక పక్కన ఉండగా నువ్వు వెళ్లరాదు.
ఆరు: సరే మిస్సమ్మకు కనిపించకుండా నేను చూడోచ్చా
అని ఆరు అడగ్గానే చూడొచ్చని గుప్త చెప్తాడు. వెంటనే ఆరు అమర్ రూం దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లిపోతుంది. అందరూ రూంలోకి వెళ్లి అమర్‌ను చూస్తుంటారు. ఇంతలో మెలకువ వచ్చిన అమర్ ఏదో పలవరిస్తుంటే.. మనోహరి దగ్గరకు వెళ్తుంది.
మనోహరి: అమర్ ఎలా ఉంది..
అమర్: మిస్సమ్మ.. మిస్సమ్మకు ఎలా ఉంది. ఎక్కడ ఉంది.
అని అమర్ అడగ్గానే భాగీ దగ్గరకు వెళ్లి అమర్ చేయి పట్టుకుంటుంది. అమర్ కూడా కళ్లు తెరచి అందరినీ చూస్తాడు. బయట నుంచి ఆరు ఆత్రుతగా అమర్ ఎప్పుడు చూడాలా అని గుప్తును అడుగుతుంది.
అమర్: పిల్లలకు ఏం కాలేదు కదా..?
శివరాం: ఏం కాలేదు. అమర్..
మనోహరి : సారీ అమర్ ఇదంతా జరగడానికి ఒకరకంగా నేను కారణం అయ్యాను.
రామ్మూర్తి: ఒక రకంగా కాదు మనోహరి గారు. ఈ మొత్తానికి కారణం మీరే. చూడమ్మా మనోహరి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు నా కూతురు వద్దంటున్నా వినకుండా పిల్లలను ఎక్స్ కర్షన్‌కు పంపించావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో…?
అమర్: పర్వాలేదండి ఏమీ కాలేదు కదా..?
ఇంతలో నర్స్ వచ్చి పేషెంట్ దగ్గర ఎవరో ఒక్కరే ఉండండి అని చెప్పగానే మిస్సమ్మ మాత్రమే ఉంటుంది. అందరూ వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన పిల్లలు భోజనం చేయకుండా గార్డెన్ లో కూర్చుని ఉంటారు. వాళ్లను చూసిన మనోహరి ఇదే మంచి సమయం పిల్లలను మళ్లీ రెచ్చగొట్టి రేపు మిస్సమ్మ వచ్చే లోపు నా వైపు మార్చుకోవాలి అనుకుని పిల్లల దగ్గరకు వెళ్లి తన నాటకం మొదలుపెడితే మనోహరిని పిల్లలు పిచ్చ తిట్టుడు తిడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















