Nindu Noorella Saavasam Serial Today December 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ : పిల్లల దగ్గరకు వెళ్లిన ఆరు ఆత్మ – అరవింద్‌కు వార్నింగ్ ఇచ్చిన అమర్
Nindu Noorella Saavasam Today Episode: పిల్లలు ఉన్న బంగ్లా దగ్గరకు ఆరు ఆత్మ వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: స్పృహ తప్పి పడిపోయిన ఆకాష్‌ను చూసి పిల్లలందరూ భయపడుతుంటే అరవింద్ వచ్చి తిడతాడు. ఎందుకు అరుస్తున్నారని అడగడంతో మా తమ్ముడు ఎందుకో స్పృహ తప్పి పడిపోయాడు అని అమ్ము చెప్తే.. స్కూల్‌లో ఆడిన నాటకాలు ఆడుతున్నారా..? అంటూ తిడతాడు. అందరూ కామ్ గా ఉండాలని లేకపోతే బాంబులు పేలుస్తానని అరవింద్ బెదిరించడంతో పిల్లలు భయంగా సైలెంట్ అవుతారు. మరోవైపు గుప్త గీసిన గీత దాటుకుని వచ్చిన ఆరు ఫారెస్ట్‌లో అమర్ వాళ్లు ఉన్న దగ్గరకు వస్తుంది. మిస్సమ్మను పిలుస్తుంది. కానీ ఆరు మాటలు మిస్సమ్మకు వినిపించవు. ఆరు కూడా మిస్సమ్మకు కనిపించదు. ఇంతలో ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాడు.
అమర్: సార్ నేను ఫోన్ చేస్తే ఆ అరవింద్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు.
ఆఫీసర్: నాకు కాల్ చేశాడు అమరేంద్ర.. తన చాలా డిమాండ్లు అడిగాడు. అన్ని ఓకే కానీ నువ్వు వెపన్ లేకుండా తన దగ్గరకు వెళ్లాలట.
అమర్: నాకు ఓకే సార్ ఇప్పుడే నేను వెళ్తాను.
ఆరు: వాళ్లెంత దుర్మార్గులో తెలిసి కూడా మీరు వాళ్ల దగ్గరకు ఒంటరిగా వెళ్తా అంటారేంటండి వద్దు.
భాగీ: ఏవండి వద్దండి..
అమర్: నాకేం కాదు మిస్సమ్మ నేను ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్లడం చాలా అవసరం.
ఆఫీసర్: రిస్క్ ఎందుకు అమర్.. అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదు. ప్రమాదం ఏంటో తెలియకుండా నిన్ను అక్కడికి పంపించను.
భాగీ: అవును సార్ ఆ ఏరియాలో గజమయూరి అనే భయంకరమైన పాము ఉంటుందట.
ఆరు: అయ్యో పిల్లలకు పాము వల్ల ప్రమాదం ఉందన్నమాట
అమర్: అవును సార్ గజమయూరి స్థావరంలోకి వెళ్లిన ఏ ఒక్కరూ తిరిగి రాలేదని చెప్తున్నారు. అరవింద్‌కు ఈ విషయం చెప్పాలన్నా.. పిల్లలను అక్కడి నుంచి సేఫ్‌గా తీసుకురావాలన్నా నేను అక్కడికి వెళ్లాలి సార్
ఆఫీసర్ అరవింద్‌కు ఫోన్ చేస్తాడు.
ఆర్మీ ఆఫీసర్: అరవింద్ నేను చెప్పేది ఒకసారి విను
అరవింద్: ఏంటి సార్ మీకు పిల్లలు అంటే లెక్కే లేనట్టు ఉంది. పోనీ ఒకరిని చంపి మీకు పార్శిల్ చేసి పంపించనా..? జోక్ చేశాను సార్ ఎందుకు అంత టెన్షన్
ఆఫీసర్: అమరేంద్రను వెపన్ లేకుండా పంపిస్తాను అరవింద్
అరవింద్: ఇప్పుడొద్దు ఆఫీసర్.. ఇవాళ రాత్రికి అక్కడే ఉండండి.. రేపు పొద్దున్నే పంపించండి.
అనగానే అమర్ నేను ఇప్పుడే వస్తాను అరవింద్ అంటాడు. అరవింద్ వినడు. గజమయూరి పాము గురించి అమర్ చెప్పినా అరవింద్ కన్వీన్స్ కాడు. ఓపిగ్గా మాట్లాడుతున్నానని అడ్వాంటేజ్ తీసుకుందామనుకుంటున్నావా.. ఆఫీసర్. ఇక్కడ చుట్టూ కెమెరాలు పెట్టాను మీ ప్రతి కదలిక నాకు తెలుస్తుంది అంటూ ఫోన్ కట్ చేస్తాడు. కోపంగా పామంటా.. పాము.. అంటూ అనగానే అనుచరుడు నిజమే అయ్యుండొచ్చు అన్న పొద్దునే మనం బోర్డు చూశాము కదా..? అంటాడు. అరవింద్ తన అనుచరుణ్ని తిడుతూ అరవింద్ కావాలనే మనల్ని బెదిరించి బయటకు వచ్చేలా పాము కథలు చెప్తున్నాడు అంటాడు. మరోవైపు పిల్లలు భయపడుతుంటారు.
ప్రిన్సిపాల్: ఆకాష్ ఎందుకు అంతలా భయపడ్డావు..
ఆకాష్: పామును చూశాను మేడం..
ప్రిన్సిపాల్: ఏంటి పాముకే అంతలా అరవాలా..?
ఆకాష్: మేడం పాము అంటే చిన్నది కాదు మేడం.. పెద్దది మన స్కూల్ అంత ఉంది మేడం
ప్రిన్సిపాల్: మమ్మల్ని భయపెట్టాలని అలా చెప్తున్నావు కదా
ఆకాష్: లేదు మేడం నిజంగానే చెప్తున్నాను
అనడంతో ప్రిన్సిపాల్ భయంతో రౌడీని పిలిచి పాము గురించి చెప్తుంది. రౌడీ కోపంగా ప్రిన్సిపాల్ ను తిడుతాడు. మరోవైపు ఫారెస్ట్ లోనే వెయిట్ చేస్తున్న అమర్ వాళ్లు అరవింద్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో అమర్ నేను లోపలికి వెళ్తాను సార్ అని ఎవరు చెప్పినా వినకుండా ఫారెస్ట్ లోకి వెళ్తాడు. అమర్ కన్నా ముందే ఆరు పిల్లలు ఉన్న బంగ్లా దగ్గరకు వెళ్లి పిల్లలను చూసి బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!