చలి ఎక్కువగా ఉన్నప్పుడు గుండె సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. హార్ట్ ఎటాక్స్​ కూడా వస్తుంటాయి.

అయితే రెగ్యూలర్​గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చలికాలంలో హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్రత్త పడొచ్చట.

చలికి రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ రావొచ్చు.

కాబట్టి చలిని దూరం చేసుకునేందుకు స్వెట్టర్లు ధరించాలి. వార్మప్​ కోసం ఎక్సర్​సైజ్ చేయాలి.

ఇండోర్​లో స్విమ్మింగ్, యోగా, సైక్లింగ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఇది గుండె సమస్యలను దూరం చేస్తుంది.

పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, లీన్ ప్రోటీన్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డైట్​లో చేర్చుకోండి.

డీహైడ్రేషన్ లేకుండా తరచూ నీటిని తాగండి. దీనివల్ల పూర్తి ఆరోగ్యంతో పాటు గుండెకు మేలు జరుగుతుంది.

స్ట్రెస్​ని తగ్గించుకోవడానికి ధ్యానం, డీప్ బ్రీతింగ్ వంటి ఒత్తిడిని తగ్గించే పనులు చేస్తే మంచిది.

వణుకు, కళ్లు తిరగడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.

విటమిన్ డి తక్కువగా ఉంటే సంప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలి. విటమిన్ డి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.