అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తనను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని పట్టుకున్న మనోహరి – స్కూల్ లో ఎమోషన్ అయిన అమ్ము

Nindu Noorella Saavasam Today Episode: మనోహిరిని డబ్బులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని పట్టుకుని చూసి మనోహరి షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ పిల్లలను చూడాలని స్కూల్‌ లోపలికి  వస్తాడు. మిస్సమ్మ అమర్‌ సార్‌ వచ్చారని పరుగెత్తుకెళ్తుంది. పిల్లలు కూడా పరుగెత్తుకొచ్చి అమర్‌ ను చూసి హ్యాపీగా ఫీలవుతారు. మాకోసమే వచ్చారా? అని పిల్లలు అడిగితే లేదని డ్యూటీ మీద వచ్చానని అమర్‌ చెప్పగానే పిల్లలు డల్‌గా ఫీలవుతారు. తర్వాత తనకు వర్క్‌ ఉందని అమర్‌ వెళ్లిపోతాడు. మిస్సమ్మ పిల్లలతో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అమర్‌ దగ్గరకు వెళ్తుంది.

అమర్‌: ఏమైంది మిస్సమ్మ ఎందుకు పరిగెత్తుకొచ్చావు.  

మిస్సమ్మ: మీతో మాట్లాడటానికి వచ్చాను.

అమర్: చెప్పు ఏంటో..

మిస్సమ్మ: మీరు రాగానే పిల్లల కళ్లల్లో ఆనందం. మీరు వెళ్లిపోతున్నప్పుడు ముఖంలో బాధ. మీకు కనిపించవా అండి. కనిపించినా కనికరం లేకుండా వెళ్లిపోతున్నారా? ఆకాష్‌ ఎంత ఆశగా మిమ్మల్ని ఉండమని అడిగాడు. కనీసం కాసేపు ఉండి వెళ్లొచ్చు కదా?

అమర్‌: వాళ్లకు నా అవసరం లేదు మిస్సమ్మ.

మిస్సమ్మ: అది మీరెలా చెప్పగలరండి.

అమర్: నాకు తెలుసు కాబట్టి.

మిస్సమ్మ: తెలుసా? వాళ్ల పక్కన మీరుంటే వాళ్లకు వచ్చే ధైర్యం. ఎంతో మీకు తెలుసా?

 అంటూ మిస్సమ్మ అడగ్గానే తెలుసని కానీ పక్కన నువ్వు ఉన్నావన్న ధైర్యం అందుకే వెళ్తున్నాను. పిల్లల పక్కన నువ్వు ఉంటే వాళ్ల అమ్మలా వాళ్లకు నా అవసరం లేకుండా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది అంటాడు అమర్‌. దీంతో నమ్మకం పెట్టుకున్నందుకు థాంక్స్‌ చెప్తుంది మిస్సమ్మ. అమర్‌ వెళ్లిపోతాడు. రాథోడ్‌ మిస్సమ్మను చూస్తుంటే మా సార్‌ నీకు మిస్సమ్మ నుంచి మిస్సెస్‌ గా ప్రమోషన్‌ ఇచ్చేలా ఉన్నాడని అంటాడు. మరోవైపు మనోహరి డబ్బులు తీసుకుని వచ్చి ఆజ్ఞాత వ్యక్తికి ఫోన్‌ చేస్తుంది.

మనోహరి: హలో నువ్వు చెప్పిన ప్లేస్‌ కు వచ్చేశాను.

అజ్ఞాత వ్యక్తి: ఆ కనిపిస్తుంది. దిక్కులు చూడ్డం వల్ల నీకు ఉపయోగం లేదు మనోహరి. నీ ముందు ఒక చెత్తకుప్ప కనిపిస్తుంది కదా?

మనోహరి: ఆ కనిపించింది.

అజ్ఞాత వ్యక్తి: ఆ సూట్‌ కేసు అక్కడ పెట్టేసి నువ్వు అక్కడి నుంచి వెళ్లిపో..

మనోహరి: ఏయ్‌ సూట్‌ కేసు అక్కడ పెట్టేసి వెళ్లిపోవడం ఏంటి? నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నా కళ్ల ముందే నువ్వు ఆ వీడియో డిలీట్‌ చేయాలి.

అజ్ఞాత వ్యక్తి: ఏంటి మనోహరి వాయిస్‌ పెరుగుతుంది. నేను చెప్పింది చేయడం తప్పా ప్రశ్నించే హక్కు నీకు లేదు. కాదు కూడదు అంటే నేనేం చేస్తాను నీకు తెలుసు కదా?

అంటూ ఆ  వ్యక్తి బెదిరించడంతో  మనోహరి డబ్బుల అక్కడ పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత బుర్ఖా వేసుకున్న ఒక మహిళ ఆటోలో వచ్చి  ఆ సూటుకేసు తీసుకెళ్తుంది. అంతా గమనించిన మనోహరి ఆటోకు అడ్డుగా వెళ్లి నిలబడుతుంది. మరోవైపు ఆకాష్‌ చెస్‌ అడుతుంటాడు. మిస్సమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని చెస్‌ లో గెలుస్తాడు. ఆనంద్‌ కూడా బాడ్మింటన్‌లో గెలుస్తాడు. అమ్ము స్పీచ్‌ విభాగంలో పాల్గొంటుంది. తన టాఫిక్‌ అమ్మ గురించి అని చెప్తుంది. తన అమ్మ గురించి గొప్పగా చెప్తుంది. దీంతో మిస్సమ్మ, అరుంధతి ఎమోషన్‌ అవుతారు. మరోవైపు ఆటోకు అడ్డుగా వెళ్లిన మనోహరి నుంచి ఆ బుర్ఖా వేసుకున్న వ్యక్తి తప్పించుకుని పారిపోతుంది.  పారిపోయిన వ్యక్తిని పట్టుకుని బుర్ఖా తీసి చూసి షాక్‌ అవుతుంది. బుర్ఖాలో ఉన్నది మంగళ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: 'దృశ్యం' చిన్నారిని ఈ మధ్య గమనించారా..హీరోయిన్ గా ఆఫర్స్ కోసం వెయిటింగ్ అంటోన్న ఎస్తర్ అనిల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget