Nindu Noorella Saavasam Serial Today August 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: వినోద్‌కు నిజం చెప్తానన్న చిత్ర పాథర్ - షాక్‌లో అమర్, భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode August 13th: షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన చిత్ర వాళ్ల డాడీ వినోద్‌కు నిజం చెప్తాననడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: తన యాక్టింగ్ ఎలా ఉందని ఆరును అడుగుతుంది భాగీ. చాలా బాగా చేశావు మిస్సమ్మ.. ఈ చీరలో కూడా చాలా బాగా ఉన్నావు అని చెప్తుంది ఆరు.
భాగీ: నువ్వు ధైర్యాన్ని ఇవ్వబట్టి.. మా ఆయన చెప్పబట్టి నేను అలా చేసేశాను. బేసిగ్గా నేను అందంగానే ఉంటాను అనుకో.. ఈసారి నగలు ఈ మేకప్ వల్ల ఇంకొంచెం అందం వచ్చింది.
గుప్త: నీవే అనుకొనిన నీ సోదరి నిన్ను మించిన అతి చేయుచున్నది బాలిక.
ఆరు: మీరు ఉండండి
భాగీ: ఏంటక్కా..?
ఆరు: ఏమీ లేదు. ఈ రోజు నీకు అందరి దిష్టి తగిలి ఉంటుంది వెళ్లి దిష్టి తీయించుకో
గుప్త: అవును అవును అది ఇప్పుడు చాలా అవసరం
భాగీ: ఎవరితో తీయించుకోను అత్తయ్యేమో ఇంట్లో లేదు. ఆ మను, చిత్ర చేతులు మంచివి కావు.. అక్కా నువ్వు తీయోచ్చు కదా
ఆరు: అలాగే మిస్సమ్మ..
గుప్త: వలదు బాలిక ఆత్మలు దిష్టి తీయకూడదు. అది నిషిద్దం.
ఆరు: అవును కదా..?
భాగీ: ఏంటక్కా ఆలోచిస్తున్నావు.
ఆరు: నేనా..?
భాగీ: అవును అక్కా అయినా నీ కంటే నా మంచి కోరే వారు ఎవరుంటారు అక్కా..?
ఆరు: ఆ మీ ఆయన ఉన్నారు కదా..? ఆయనతో దిష్టి తీయించుకో…
గుప్త: బాలిక నువ్వేనా ఈ మాట అనుచున్నది.
భాగీ: ఆయన దిష్టి తీస్తారా..?
ఆరు: ఎందుకు తీయరు. నిన్ను యాడ్ చేయమని ఎంకరేజ్ చేసిన వారు.. నీకు దిష్టి తీయరా..? ఏంటి..?
గుప్త: మరోక్క మారు నువ్వే ఆలోచించుకొనుము.. తదుపరి నువ్వే బాధపడెదవు..?
ఆరు: ఏం పర్వాలేదు.. నువ్వు వెళ్లు భాగీ.. నాకు తెలిసి మీ వారు ఈ పాటికి దిష్టి తీయడానికి రెడీగా ఉంటారు.
భాగీ: నిజంగానా అక్కా..? అవును ఆ విషయం మీకెలా తెలుసు
ఆరు: మా వారు కూడా అంతే అప్పుడప్పుడు నాకు దిష్టి తీసేవారులే..
భాగీ: కానీ మావారు వేరులే అక్క నేను దిష్టి తీయమని అడిగితే ఏమంటారో ఏంటో…?
ఆరు: అయితే రాథోడ్‌తో చెప్పించు
భాగీ: ఎస్ ఆ పని చేస్తాను.. చాలా థాంక్స్ అక్కా ఇప్పుడే వెళ్తాను.
అని భాగీ వెళ్లిపోతుంది.
గుప్త: ఏమిటిది బాలిక ఈ రోజు నీ మనసు ఇంత విశాలంగా ఉన్నది. నీ సహోదరిని నీ పతిదేవునితో దిష్టి తీయించుకోమని చెబుతుంటివా..?
ఆరు: మా ఆయనతో దిష్టి తీయించుకునే అదృష్టానికి నన్ను మీరే దూరం చేశారు కదా..?
అనగానే గుప్త కోపంగా చూస్తుంటాడు. అటూ ఇటూ తిరిగి నన్నే నిందిస్తావా..? అంటూ బాధపడతాడు. ఇక చిత్ర, వినోద్‌ల క్లాత్ బిజినెస్ ఓపెనింగ్ జరుగుతుంది. అక్కడికి చిత్ర ఫాథర్ వస్తాడు. అమర్ ఆయనతోనే షాప్ ఓపెనింగ్ చేయిస్తారు. తర్వాత చిత్ర ఆయనను పక్కకు తీసుకెళ్లి తిడుతుంది.
చిత్ర: మీరెందుకు వచ్చారు ఇక్కడికి మీకు పిచ్చి కానీ పట్టిందా..?
ఫాథర్: పిచ్చి పట్టింది నాకు కాదమ్మా నీకు. నీకు ఆస్థులు తప్పా మనుషులు అక్కరలేదు కదా..?
చిత్ర: నాన్న నాకు కోపం వచ్చింది అనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు.
ఫాథర్: నువ్వు నా ప్రాణం తీసినా సరే నీ గురించి చెప్పే చస్తా..! నీ గురించి నీ భర్తకు నీ కుటుంబానికి ఈ ప్రపంచం మొత్తానికే తెలియాలి
అని కోపంగా పై ఫ్లోర్ లో ఉన్న వినోద్ దగ్గరకు వెళ్తుంటాడు. దూరం నుంచి అంతా గమనిస్తున్న అమర్, భాగీ, రాథోడ్ ఆయన్ని ఆపడానికి వెళ్తారు. కానీ ఇంతలో ఆయన వినోద్ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















