Nindu Noorella Saavasam Serial Today August 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు పేరెంట్స్ గురించి నిజం చెప్పని అమర్ – రణవీర్ ను చంపేయాలన్న మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: అమర్ కు ఆరు తల్లిదండ్రుల గురించి నిజం తెలిసినా ఇంట్లో వాళ్లకు నిజం చెప్పకపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి, ఘోర దగ్గరకు వెళ్లి రణవీర్ గురించి చెప్తుంది. ఇంతకుముందు నేను చూసిన రణవీర్ కంటే.. ఇవాళ నేను చూసిన రణవీర్ వేరే అంటుంది. వాడు నన్ను చూసిన చూపులు ఇవాళ చాలా ఇరిటేటింగ్‌గా అనిపించాయి. అంటే మన ముగ్గురి బతుకులు ఒక్కటే మనోహరి అంటూ ఘోర చెప్తాడు. మన ముగ్గురివి సమాధానాలు లేని ప్రశ్నలే.. కోరి తెచ్చుకున్న సమస్యలే.. మన ముగ్గురిలో ఎవరు గెలిచినా మిగిలిన ఇద్దరి గమ్యాల మీద ప్రభావం పడుతుందని ఘోర చెప్తాడు. మరోవైపు అమర్ ఇంట్లో అందరూ వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు.
ఆరు: అందరూ వచ్చారంటే కచ్చితంగా ఆయన్ని గట్టిగా అడుగుతారు. ఈరోజు ఆయన నా కన్నవాళ్ల గురించి నిజం చెప్పేస్తారు.
అని గుప్తకు చెప్తుంది. ఇంతలో అందరూ ఒకేసారి అమర్‌ను మీతో మాట్లాడాలి అని అంటారు.
అమర్: అందరూ ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఏంటా విషయం. అడగండి.
అంజు: అంటే డాడ్ మిస్సమ్మ ముందు వచ్చింది కదా మిస్సమ్మకు ముందు ఆన్సర్ చేయండి.
మిస్సమ్మ: అంటే ఇంట్లో పెద్దవాళ్లు మామయ్యా ఉన్నారుగా నేను అడిగితే ఏం బాగుంటుంది. ముందు మామయ్య గారికి ఆన్సర్ చేయండి.
అమర్: మీరైనా అడుగుతారా? లేదా ఎవరడుగుతారో డిసైడ్ అయ్యి వస్తారా?
శివరాం: అదేంటంటే అమర్.. అది..
నిర్మల: హక్కులు అధికారం అన్నారుగా వెళ్లి అడగండి.
రాథొడ్: సార్ మీరు ఈ ఇంటికే పెద్దపులి లాంటోళ్లు.. మీరు కూడా తడబడితే ఎలా సార్. అడగండి సార్.
శివరాం: ఇప్పుడు నీ ఒపినియన్ ఎవరు అడిగారయ్యా.. ప్రతిదానికి తూ తూ అంటావు. అంటే అది కాదు అమర్ లంచ్ ఎప్పుడు చేద్దామా అని.
నిర్మల: ఏం లేదు నాన్నా.. అందరి మనసుల్లో ఉన్నది ఒకటే ప్రశ్న. అందరికి కావాల్సింది ఒకటే సమాధానం. కోడలి కన్నవాళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లిన నువ్వు ఏం తెలుసుకున్నావు నాన్నా..? ఎందుకు ఎవరికీ సమాధానం చెప్పకుండా ఇలా సైలెంట్ గా ఉన్నావు.
మిస్సమ్మ: అవునండి ఆరు అక్క గురించి కాని మా అక్క గురించి కాని ఏదైనా తెలుసుకున్నారా?
అని అడగ్గానే అమర్ ఆశ్రమంలో మిస్సమ్మ, అరుంధతి అక్కాచెల్లెల్లు అన్న నిజం తెలుసుకున్నది గుర్తు చేసుకుంటాడు. అందరూ ఏం తెలుసుకున్నారో చెప్పండి అని అడుగుతారు. ఇంతలో మనోహరి వచ్చి అమర్ నిజం చెప్పకుండా ఆపాలనుకుంటుంది. అమర్ కూడా నిజం తెలియలేదని చెప్తాడు. మిస్సమ్మ మనం వేరే ఎలాగైనా ట్రై చేద్దామంటే కష్టమని చెప్పాను కదా అని వెళ్లిపోతాడు అమర్. తర్వాత అంజు బాధపడుతుంది. అమ్మా వాళ్ల పేరెంట్స్ ఎవరో తెలియడం లేదని ఫీల్ అవుతుంది. తర్వాత అమర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది ఆరు.
గుప్త: తల్లిదండ్రుల గురించి తెలియదు అనగానే ఈ బాలిక ఏంటి ఆలోచనలో పడింది. అతగాడి మనసును పసిగట్టిందా ఏంటి? బాలికా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు.
ఆరు: నా కన్నవాళ్ల గురించి గుప్తగారు.
గుప్త: ఏమీయు తెలియదని నీ పతిదేవుడు చెప్పెను కదా?
ఆరు: అది అబద్దం గుప్త గారు. ఆయనకు అబద్దం చెప్పడం రాదు గుప్త గారు. అందుకే ఆయన అబద్దం చెప్పినప్పుడు కనిపెట్టడం చాలా ఈజీ. ఆయన నిజం చెబితే ఇంట్లో వాళ్లకు బాధేస్తుందేమోనని అందుకే చెప్పలేదేమో అనిపిస్తుంది.
అని ఆరు చెప్పగానే అలాంటిదేం లేదని మీ ఆయనకు నిజం తెలియదని గుప్త చెప్పగానే అయితే పౌర్ణమి రోజు మిస్సమ్మ లోకి వెళ్లి నిజం తెలుసుకుంటాను అంటుంది. దీంతో గుప్త ఆరును తిడతాడు. తర్వాత అమర్ ఆలోచిస్తుంటే రాథోడ్ ఇంట్లో వాళ్లకు ఎందుకు నిజం చెప్పలేదని అడుగుతాడు. చెప్పి వాళ్లను బాధపెట్టలేనని అమర్ చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘కల్కి 2898 ఏడీ’లో ముందుగా ఆ పాత్రలో కీర్తి సురేశ్ - నో చెప్పి మంచి పని చేశానంటూ కామెంట్స్