Nindu Noorella Saavasam Serial Today April 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి నిజం చెప్పిన భాగీ – అనామిక ప్లాన్ అట్టర్ ప్లాప్
Nindu Noorella Saavasam Today Episode: మనోహరి కోల్‌కతాలో ఏం చేసిందో కనుక్కుంటానని భాగీ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మత్తుగా రూంలోకి వచ్చి తనను హగ్ చేసుకున్న భాగీని పడుకోమని చెప్తాడు అమర్. భాగీ పడుకోకుండా పిచ్చిపిచ్చిగా చేస్తుంది. అమర్‌కు కిస్ ఇస్తూ.. ఐ లవ్యూ చెప్తుంది. నా మాట అసలు వినవా నువ్వు అంటూ చిలిపిగా కోప్పడుతుంది. దీంతో సరే వింటాను అంటూ అమర్, భాగీని పడుకొబెడతాడు. తర్వాత ఉదయం సదాశివం తల పట్టుకుని హల్లోకి వస్తాడు.
సదాశివం: నిర్మల పొద్దునే తల నొప్పి తట్టుకోలేకపోతున్నాను.. కాస్త కాఫీ ఇస్తావా..? పిలుస్తుంటే పలకటం లేదేంటి నిర్మల
నిర్మల: కళ్లు తెరిస్తే కనబడతాను
శివరాం: ఓ తెచ్చావా..? తలనొప్పి ఏంటో పొద్దునే ఇలా పట్టుకుంది
నిర్మల: నిన్న తమరు వేసిన చిందులకు ఈ మాత్రం అయినా లేకపోతే ఎలా..?
శివరాం: నేను చిందులు వేశానా..?
నిర్మల: ఏం చేశారా..? సిగ్గు లేకపోతే సరి నిమ్ము డార్లింగ్ అనడాలు పాటలు పెట్టుకుని డాన్సులు వేయడాలు అమ్మో నేను వేయలేనని చెప్తే నాకు వయసు అయిపోయిందని చెప్పి ఎగతాళి చేసి నవ్వుతారా..? నా వయసు అయిపోతే మీ వయసు ఏమైనా వెనక్కి వెళ్తుందా ఏంటి..? ఇంకోసారి కాళ్ల నొప్పులు అనండి అప్పుడు చెప్తాను మీ సంగతి
శివరాం: నాకు తెలియకుండా ఇన్ని చేశానా..?
నిర్మల: అవును మర్చిపోయారా..?
పై నుంచి అనామిక వస్తుంది.
నిర్మల: అనామిక, భాగీ ఇంకా కిందకు రాలేదా..?
అనామిక: లేదు ఆంటీ ఇంకా రాలేదు
నిర్మల: రోజు పొద్దునే వచ్చేస్తుందే.. ఇవాళేంటి..? పండగ పూటైనా ఇంకా రాలేదు
అనామిక: అదీ హెడేక్ అంటుంది
నిర్మల: సరిపోయింది మీ అంకుల్ లాగా భాగీ కూడా రాత్రంతా చిందులు వేస్తూ కూర్చుందా..?
అనుకుంట వెళ్లిపోతుంది నిర్మల. పైన రూంలో నిద్ర లేచిన భాగీకి అంతా మసక మసకగా కనిపిస్తుంది. పక్కనే కాఫీ కలుపుతున్న అమర్ కూడా మసకగా కనిపిస్తుంటాడు. అమర్ కాఫీ ఇవ్వగానే..
భాగీ: ఏంటీ… కాఫీ నాకా..?
అమర్: ఈ రూంలో నువ్వు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా..?
భాగీ: ఎవరూ లేరు కదా..?
అమర్: మరి తీసుకో కాఫీ
మిస్సమ్మ: శ్రీరామ నవమి రేపైతే ఇవాళేంటి రెడీ అయ్యారు
అమర్: ఏయ్ లూజ్ ఒకసారి టైం చూడు
మిస్సమ్మ: తొమ్మిదే కదా అయింది.
అమర్: రాత్రి తొమ్మిది కాదు.. ఉదయం తొమ్మిది అవుతుంది
మిస్సమ్మ షాకింగ్ గా నిద్ర లేచి వెంటనే రూం సర్దుతుంది. పూజ కోసం సిద్దం చేస్తుంది. ఇంతలో మనోహర దగ్గరకు వెళ్తుంది.
మనోహరి: ఏయ్ నన్ను ఒంటరిగా ఉండనివ్వవా..? ఎందుకు ఇప్పుడొచ్చావు..
భాగీ: నీ గురించి కొన్ని నిజాలు తెలిశాయి మను అందుకే వచ్చాను.
మనోహరి: నిజాలా ఏంటా నిజాలు.. అయినా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు
భాగీ: నువ్వు ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లాక అక్కడ పెళ్లి చేసుకున్నావు. నువ్వేంటో.. నీ గతమేంటో..? నీ భర్త ఎవరో నువ్వు దాచిన నిజాలు ఏంటో నువ్వు బాధ పెట్టిన మనుషులు ఎవరో అన్ని కనుక్కుంటా మను. ఇక నుంచి ఒక్క రోజు కూడా నిన్ను మనఃశాంతిగా ఉండనివ్వను.
మనోహరి: అవునా చూద్దాం.. ఎవరు ఏం చేస్తారో..?
భాగీ: చూద్దాం కాదు మను.. ఇంకా నా పంతం నెగ్గాలి ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం భాగమతి టూ పాయింట్ ఓ ను చూస్తావు. అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించి ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేసి నీ నోటితోనే నిజం చెప్పిస్తా మను
అని భాగీ వార్నింగ్ ఇవ్వడతో మనోహరి భయపడుతూ భాగీని చూస్తుంటుంది. ఇంతలోఇవాళ్టీఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















