Nindu Noorella Saavasam Serial Today April 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ప్రకృతితో యుద్దం చేసైనా పెళ్లి ఆపుతానన్న అరుంధతి – కుటుంబాన్ని చిక్కుల్లో పడేయొద్దన్న గుప్త
Nindu Noorella Saavasam Today Episode: అమర్, మనోహరిల పెళ్లి ప్రకృతితో యుద్దం చేసైనా ఆపుతానని అరుంధతి, గుప్తతో చాలెంజ్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ బాడీలోంచి బయటకు వచ్చిన అరుందతి ఏడుస్తూ.. హ్యపీగా ఫీలవుతూ.. కిందకు వస్తుంది. గార్డెన్ లో కూర్చుని ఏడుస్తుంది.. ఇంతలో గుప్త వస్తాడు. చూశావా నీవల్ల వాళ్లు ఎలా బాధపడుతున్నారో అనగానే.. వాళ్లది నీకు బాధగా కనిపిస్తుందేమో కానీ వాళ్లకు కలిగిన ఆనందం నాకు అర్థం అవుతుంది. కానీ ఇదంతా ఒక్కరోజే అని తెలిసి బాధగా ఉంది. అయినా ఈ ఒక్కరోజు అయినా నేను నా వాళ్లతో గడిపానన్న సంతోషం కలిగింది. ఇది జీవితాతం గుర్తుపెట్టుకుంటాను.
గుప్త: తప్పు చేయుచున్నావు బాలిక. చాలా పెద్ద తప్పు చేయుచున్నావు. ప్రకృతికి విరుద్దమైన తప్పులు చేసినచో వినాశనం తప్పదు. కోరి విపత్తులు తెచ్చి నీ కుటుంబం పై మోపరాదు. నీవు చేయు పనులకు నీ కుటుంబం మూల్యం చెల్లించవలెను.
అరుంధతి: వద్దు నా కుంటుంబాన్ని ఏమీ చేయకండి.
గుప్త: అటులైన నా మాట వినుము బాలిక. నీవు ఇచ్చట ఉండినచో నీకు లభించిన శక్తిని ఉపయోగించి తలరాతను మార్చుటకు ప్రయత్నం చేసెదవు. దానివల్ల విపత్తు తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అందులకే పరిస్థతి చేజారక ముందే మనం ఇచట నుంచి మా లోకమునకు బయలుదేరెదము.
అరుంధతి: లేదు గుప్త గారు మీరు ఎన్ని చెప్పినా? మా ఆయన పెళ్లి మనోహరితో జరగదు అన్న భరోసా లేనిదే నేను ఇక్కణ్నుంచి రాను రాలేను.
గుప్త: మరి అయితే వినావనం సృష్టించెదను అనెదను. నీ కుటుంబాన్ని కష్టాలలోకి నెట్టెదను అనెదవు అంతేగా?
అరుంధతి: మరి నేనేం చేయాలి గుప్తగారు. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే ఇచ్చాడు ఆ దేవుడు. నాకు ఇలాంటి కుటుంబం ఇవ్వాలని నేను అడిగానా? నాకు చావు ఇవ్వమని నేను అడిగానా? నా కుంటుంబాన్ని కాపాడుకోవడానికి మనోహరిని నేను ఇంట్లోకి తెచ్చి చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చాడనుకుంటాను. నేను ప్రకృతితో యుద్దం చేసైనా ఈ పెళ్లిని ఆపుతాను.
గుప్త: జగన్నాథ ఆ బాలిక చెప్పినట్లు ఈ శక్తి వరమా? లేక ఆ కుటుంబానికి శాపమా?
అని గుప్త భయపడతాడు. తర్వాత తెల్లవారగానే అమర్ రూంలో ఉన్న మిస్సమ్మ నిద్ర లేస్తుంది. అమర్ కూడా నిద్ర లేస్తాడు. అమర్ ని చూసి మిస్సమ్మ గట్టిగా అరుస్తుంది. మీరు నా రూంలోకి ఎందుకొచ్చారు అంటుంది. ఎవరు ఎవరి రూంలో ఉన్నారో చూడు అనగానే చూసి మిస్సమ్మ షాక్ అవుతుంది. ఆలోచిస్తుంది. ఏం గుర్తు రావడం లేదు అంటుంది. నిద్రలో వాటర్ తాగడానికి వెళ్లి నిద్రమత్తులో ఇక్కడికి వచ్చి పడుకున్నావేమో అంటాడు అమర్. ఇంకోసారి ఇలా రానని చెప్పి మిస్సమ్మ బయటకు వెళ్తుంది. ఎదురుగా వచ్చిన పిల్లలు మిస్సమ్మను చూసి హ్యాపీగా ఫీలవుతారు. అచ్చం మా అమ్మలాగా మాకు అన్ని పనులు చేశావు అంటూ చెప్పగానే మిస్సమ్మ ఇవన్నీ నేనే చేశానా? అంటూ డౌట్ గా అడుగుతుంది. మరోవైపు మనోహరి నగలు ఇచ్చిన జ్యువెల్లరీ షాపు వ్యక్తి డూప్లికేట్ నగలు తయారు చేసి మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో షాపు వ్యక్తితో నగలు ఇంటికి పంపించాలనుకుంటాడు. మరోవైపు గుప్త తన రింగు గురించి ఆలోచిస్తుంటాడు. గార్డెన్ లో వెతుకుతుంటాడు. ఇంతలో అరుంధతి పరుగెత్తుకొస్తుంది. ఇంతలో మూర్తి రావడంతో ఎందుకొచ్చాడో తెలుసుకుందామని గుప్తను అడగ్గానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'దేవర' క్రేజీ అప్‌డేట్ - ఏప్రిల్ చివరిలోగా షూటింగ్, టాకీ పార్ట్ పూర్తి?