అన్వేషించండి

Devara Movie Update: 'దేవర' క్రేజీ అప్‌డేట్‌ - ఏప్రిల్‌ చివరిలోగా షూటింగ్‌, టాకీ పార్ట్‌ పూర్తి?

Devara Movie: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంతో యాక్షన్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

Jr NTR Devara Latest Update: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంతో యాక్షన్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రోజుకో అప్‌డేట్‌ బయటకు వస్తుంది మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. పాన్‌ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు గట్టి ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదు కానీ, బయటకు వస్తున్న అప్‌డేట్స్‌ దీనికి మరింత బలాన్ని ఇస్తున్నాయి.

ఏప్రిల్ చివరిలోగా షూటింగ్, టాకీ పార్ట్ పూర్తి!

అంతేకాదు దేవర టీం నుంచి కూడా ఇన్‌డైరెక్ట్‌ హింట్స్‌ వస్తున్నాయి. ఇక కొరటాల మాత్రం మూవీ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్‌గా గోవా షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న 'దేవర'.. ఈ షెడ్యూల్లో జాన్వీ, ఎన్టీఆర్‌లపై ఓ సాంగ్‌, యాక్షన్ సీక్వెన్స్‌ రూపొందించినట్టు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా టైం ఉంది. కానీ కొరటాల మాత్రం చకచక షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్‌ పార్ట్‌కు సంబంధించి క్రూషియల్‌ షెడ్యూల్‌ దాదాపుగా పూర్తయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. దేవర పార్ట్‌ 1 షూటింగ్ సంబంధించిన షూటింగ్‌, టాకీ పార్ట్‌ మొత్తం ఈ ఏప్రిల్‌లో పూర్తి అవుతాయని సినీ సర్కిల్లో వినిపిస్తున్న టాక్‌.

అంతేకాదు డబ్బింగ్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకోనుందట. ఇంకా పార్ట్‌ 1కి సంబంధించి మూడు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా జులైలో పూర్తి చేస్తారట. ఆ తర్వాత వెంటనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి అక్టోబర్‌ 10 వరకు దేవరను సిద్ధం చేసేందుకు కొరటాల, మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్‌ విరామం తీసుకున్నట్టు సమాచారం. ఈ లేటెస్ట్‌ షెడ్యూల్లో సైఫ్‌ అలీ ఖాన్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. కాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి విడుదల ప్రచార పోస్టర్స్‌, ఫస్ట్‌లుక్‌, టిజర్‌ మూవీ మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

Also Read: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్‌ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'

ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీలోని ఎన్టీఆర్‌ లుక్‌ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తుంది. ఈ చిత్రంలోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. ఇక ఇందులో ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, టామ్‌ షైన్‌ చాకో, నరైన్‌ వంటి స్టార్స్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్‌, హరిక్రష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్‌ సింగీతం అందిస్తుండగా.. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget