అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు దొరికిపోయిన మనోహరి – సీసీటీవీ చెక్‌ చేసిన రాథోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: ఆడిటోరియంలో అనుమానాస్పదంగా కనిపించిన చేయి మనోహరి చేతితో మ్యాచ్‌ అవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  తనను చంపబోతున్న మీనన్ తో భాగీ చివరి సారిగా అమర్‌తో మాట్లాడతానని చెప్తుంది. మీనన్‌ సరే అనగానే వాకీటాకీ తీసుకుని అమర్‌కు  లోపలికి రావడానికి హింట్‌ ఇస్తుంది భాగీ. ఇంతలో అంజు కూడా కిటికీ దగ్గరకు వెళ్లి అమర్‌ను పిలుస్తుంది. అమర్‌ తన ఫోర్స్‌తో లోపలికి వెళ్లి మినిస్టర్‌ ను కాపాడతాడు. మీనన్‌ తప్పించుకుంటాడు. తర్వాత ఇంటికి వచ్చిన ఆరు ఆడిటోరియంలో జరిగిందంతా గుప్తకు చెప్తుంది.

ఆరు: గుప్తగారు.. మా ఆయనేంటి ఇంకా రాలేదు.

 గుప్త:  ఆ దాడికి పాల్పడిన వారిని, వారికి సాయం చేసిన వారిని పట్టుకోవాలి కదా అదే పనిలో ఉన్నాడు.

ఆరు: అవును ఆ పని ఉంది కదా ఆ రౌడీలను లోపలికి తీసుకొచ్చిన వారు ఎవరో తెలియాలి వారిని అసలు వదిలిపెట్టరు గుప్త గారు.

 గుప్త: శుభవార్తతోనే వస్తాడులే

 ఆరు: అంటే వారికి సాయం చేసింది ఎవరో ఆయనకు తెలుసా..? గుప్తగారు..

గుప్త: తెలుసు

ఆరు: అయితే మీకు కూడా తెలుసా..? గుప్త గారు

గుప్త: తెలుసు నాకు కూడా తెలుసు..

ఆరు: ఎవరు గుప్త గారు ఫ్లీజ్‌ చెప్పు గుప్త గారు

గుప్త: ఇంకెవరు నీ స్నేహితురాలు మనోహరి.

 ఆరు: నిజంగా అంటే మనోహరి గురించి నిజం తెలియబోతుందా..?

గుప్త: అవును మన నీడలోనే ఉండి దుర్మార్గులు ఎన్ని చేసినను మనకు కనిపించవు అని మా పితృదేవులు చెప్పుచుండెడివారు. అలాగే నీ స్నేహితురాలు ఎన్ని చేసినను నీ పతి దేవుడికి ఏమీ కనిపించలేదు. మొదటిసారి ఆ బాలిక అడుగు బయట పెట్టినది. నీ పతి దేవుడికి చిక్కుటకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్పుడు కదా అసలైన కథ మొదలైంది.  ఇప్పుడు కదా నీ పతి దేవుని కంట ఆ బాలిక పడినది. ఇక మీదట మనోహరి దాచిన ఒక్కోక్క నిజం కాపాడిన ఒక్కోక్క అబద్దం బయట పడును

 ఆరు: హమ్మయ్యా మీరు చెప్తుంది నిజమా గుప్తగారు. ఆయనకు మనోహరి మీద అనుమానం కలగబోతుందా..? ఈరోజు కోసమే కదా నేను ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసింది.

 ఇంతలో లోపలి నుంచి భాగీ వచ్చి ఆరును చూసి ఆశ్చర్యపోతుంది.

భాగీ: అక్కడ ఎవ్వరూ లేరు అక్క ఎవరితో మాట్లాడుతుంది.

 గుప్త: బాలిక నీ సోదరి వస్తుంది. ఇక నేను వెళ్తాను..

భాగీ: అక్కా మీరు ఇందాకటి నుంచి  ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు.

 ఆరు:  అది నేను అప్పుడప్పుడు చందమామతో మాట్లాడుతుంటాను.

బాగీ: చందమామ ఎక్కడుంది.. నాకు కనబడటం లేదు.

ఆరు: ఏంటి నీ ముఖం వెలిగిపోతుంది

భాగీ: నిజం చెప్పండి మీరు ఇందాక మాట్లాడింది మా అరు అక్కతోనేనా..?

ఆరు: ఎందుకు అలా అడిగావు

భాగీ: మా ఆరు అక్కా ఇంకా ఇంటి చుట్టూనే తిరుగుతుందని పంతులు గారు చెప్పారు. మీరేమో గాలిలో చూస్తూ మాట్లాడుతున్నారు. పైగా జరగబోయేది తెలిసినట్టు  చెప్తున్నారు.

అని భాగీ అడగ్గానే ఆరు షాక్‌ అవుతుంది. ఇంతలో భాగీ లోపలికి వెళ్దాం పద అని ఇద్దరూ లోపలికి వెళ్తారు. తర్వాత అమర్‌ ఇంటికి వస్తాడు. ఆడిటోరియంలో జరిగిన విషయం ఆలోచిస్తూ రాథోడ్‌ కు ఫోన్‌ చేస్తాడు.

అమర్‌: రాథోడ్‌ మనోహరి ఫంక్షన్‌కు వచ్చిన పుటేజీ ఓపెన్‌ చేసి మనం చూసిన చేతికి మనోహరి చేతిని మ్యాచ్‌ చేసి చూడండి.

రాథోడ్‌: చూస్తున్నాను సార్‌.. సార్‌ చేయి మ్యాచ్‌ అయింది.

అని రాథోడ్‌ చెప్పగానే.. అమర్‌ కోపంగా మనోహరి దగ్గరకు వెళ్లి గన్‌ ఎయిమ్‌ చేసి ఎందుకు ఇలా చేశావని నిలదీస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget