Nindu Noorella Saavasam Serial Today April 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరి ప్లాన్ సక్సెస్ - ఓంటరిగా బయటకు వెళ్లిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: భాగీ ఒంటరిగా దొరికే చంపేయాలని ఊస్తున్న మనోహరికి చాన్స్ దొరికింది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలను లోయలోకి తోసేసి ఆ నెపం భాగీ మీదకు తోసేయాలని తర్వాత బాబ్జీతో భాగీని చంపేయాలని ప్లాన్ చేస్తుంది. వెంటనే కిందకు వెళ్లి పిల్లలతో గేమ్ ఆడుగుంది. కళ్లకు గంతలు కట్టుకున్న అంజును లోయలోకి వెళ్లేలా చేస్తుంది. ఇంతలో అనామిక వచ్చి ఆంజు చేయి పట్టుకుంటుంది. అంజు అనామిక చేయి పట్టుకుంటుంది.
అంజు: ఔట్ ఔట్.. అయ్యో అనామిక నువ్వా.. నేను ఇంకా మనోహరి ఆంటీ అనుకున్నాను
అనామిక: మనోహరి ఆంటీని ఔట్ చేయాలి అంతే కదా..? నేను చేస్తాను. అంజు అటు వెళ్తే ప్రమాదం అని చెప్పి వెళ్లాను కదా..? టైంకు నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమయ్యోదో తెలుసా..?
అంజు: కళ్లకు గంతలు కట్టుకున్నాను కదా ఎటు వెళ్తున్నానో ఎలా తెలుస్తుంది.?
మనోహరి: సరే సరే లేండి ఎవరికీ ఏమీ కాలేదు కదా వదిలేయండి పిల్లలు నేను వెళ్తాను మీరు ఆడుకోండి
అనామిక: ఒక్క నిమిషం మనోహరి గారు నేను ఇప్పుడే ఆటలోకి దిగాను. అప్పుడే నువ్వు వెళ్లిపోతాను అంటే ఎలా..? నాతో కూడా ఆడి వెళ్లండి
అనామిక కళ్లకు గంతలు కట్టుకుని ఆడుతుంది. మనోహరి.. అనామికను లోయలోకి తోసేయాలనుకుని తనే పడబోతుంది. వెంటనే అనామిక పట్టుకుంటుంది.
అనామిక: పిల్లలు మీరు లోపలికి వెళ్లి ఫ్రెష్ అవ్వండి డ్రైవర్ మిమ్మల్ని మీ ప్రెండ్ వాళ్ల ఇంటికి తీసుకెళ్తాడు. (పిల్లలు లోపలికి వెళ్లిపోతారు.) జాగ్రత్త మనోహరి గారు మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారు.
మనోహరి: ఏంటి ఏమన్నావు..?
అనామిక: అదే కొంచెం ఏమారినా గోతిలో పడిపోతారు. మూతి పళ్లు రాళిపోతాయి అంటున్నాను.
మనోహరి: అనామిక నువ్వు అప్పుడప్పుడు అచ్చం మా ఆరులా మాట్లాడతావు తెలుసా..? ఒకసారి అరుంధతియే నీలో ఉందేమో అనిపిస్తుంది
అనామిక: ఆవిడే ఉంటే అవిడ చావుకు కారణమైన వాళ్లను సార్ ముందు నిలబెట్టే వాళ్లు కదా మనోహరి గారు.
మనోహరి: అవును కదా.. అయితే నువ్వు తను కాదన్నమాట (అవును అంటూ అనామిక లోపలికి వెళ్తుంది.) నువ్వే అరుంధతి అని తెలిసినా నేను ఎందుకు ఊరికే ఉంటున్నానో తెలుసా..? నీ చెల్లి చావును నీకు చూపించడానికి. దాని సంగతి చెప్పాక నీ సంగతి చెప్తాను.
అని కోపంగా మనసులో అనుకుంటుంది. అమర్ ఒంటరిగా ఆరు యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో నిలబడి ఆరుకు జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో రాథోడ్ వస్తాడు.
రాథోడ్: సార్ ఇక్కడే ఉండి జరిగినవన్నీ తలుచుకుని ఎందుకు సార్ బాధపడుతున్నారు. వెళ్దాం పదండి సార్
అమర్: ఇలాంటి ఒక ఉదయాన్నే ఇక్కడ నా ఆరును కోల్పోయాను. ఆరోజు నాకు తెలియలేదు రాథోడ్. నా భార్యని చావు వెంటాడుతుందని నా భార్య ప్రాణాన్ని ఇంకొకరు కోరుకుంటున్నారని.
రాథోడ్: సార్ జరిగిన దాన్ని తలుచుకుని బాధపడటం కన్నా భాగీకి మంచి లైఫ్ ఇవ్వండి సార్
అంటూ రాథోడ్ చెప్పగానే.. అమర్ ఓకే ఇప్పుడే భాగీకి ఫోన్ చేస్తాను అంటూ కాల్ చేస్తాడు.
భాగీ: ఏవండి చెప్పండి ఫోన్ చేశారు.
అమర్: నిన్ను బయటకు తీసుకెళ్లడానికి ఫోన్ చేశాను.
భాగీ: నన్ను బయటకు తీసుకెళ్తారా
అమర్: అవును నీకు క్యాబ్ పంపిస్తాను. అందులో వచ్చేసెయ్
భాగీ: సరే పంపించండి. అనామిక గారు నన్ను మా ఆయన బయటకు తీసుకెళ్తున్నారు.
అంటూ సంతోషపడుతుంది. భాగీ మాట్లాడేది మొత్తం పై నుంచి విన్న మనోహరి వెంటనే రాథోడ్‌కు ఫోన్ చేసి భాగీ ఒక్కతే అమర్‌ను కలవడానికి కారులో వస్తుంది. మధ్యలో అది అరగంట జర్నీ చేస్తుంది. ఈ టైంలో దాన్ని చంపేయ్ అని చెప్తుంది. బాబ్జీ సరే అంటాడు. భాగీ కారులో వెళ్లిపోతుంది. బాబ్జీ లారీ తీసుకుని వెళ్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















