అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి భాగీ వార్నింగ్‌ - ఇంట్లోంచి వెళ్లగొడతానన్న మనోహరి

Nindu Noorella Saavasam serial Today Episode April 17th: ఆకాష్‌కు ఏమైనా అయితే మనోహరిని చంపేస్తానని భాగీ వార్నింగ్‌ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: హాస్పిటల్‌ కింద కార్‌ పార్కింగ్‌లో నిలబడిన మనోహరి.. రణవీర్‌ ఎక్కడ దొరికిపోతాడేమోనని భయపడుతుంది. అమర్‌ కు నిజం తెలిస్తే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుంది.

మను: ఇక్కడ అమర్‌ ఎంక్వైరీ స్టార్ట్‌ చేశాడు. రణవీర్‌ నేను చెప్పినట్టు స్లమ్‌కు వెళ్లాడో లేదో మెయిన్‌ రోడ్డుకు వెళితే పోలీసులకు దొరికిపోతాడు

అప్పుడే అక్కడికి భాగీ వస్తుంది.

భాగీ: నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మనోహరి

మను: అది ఫోన్‌ వస్తే మాట్లాడుతున్నాను

భాగీ: ఎవరి ఫోన్‌

మను: ఫ్రెండ్ ఫోన్‌

భాగీ: ఏ ఫ్రెండ్‌

మను: ఎందుకు అంతలా అడుగుతున్నావు

భాగీ: ఇందాకా నాకు ఫోన్ చేసి ఎవరో నర్స్‌ ఆకాష్‌ మెడికల్‌ హిస్టరీ అడిగింది అని చెప్పావు కదా..? నేను రిసెప్షన్‌లో అడిగితే అలాంటిదేం లేదని చెప్పారే..

మను: లేదు భాగీ నిజంగానే నన్ను నర్స్‌ అడిగింది

భాగీ కోపంగా మనోహరి చెంప పగులగొడుతుంది.

మను: నన్నే కొడతావా..? నీకెంత ధైర్యం

భాగీ: నోర్మూయ్‌ నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు.. చంపేయాలి

మను: నేనేం చేశాను

భాగీ: ఆకాష్‌ను కిడ్నాప్‌ చేసింది రణవీరే కదా..? వాడికి హెల్ప్‌ చేసింది నువ్వే కదా

మను: ఏం మాట్లాడుతున్నావు భాగీ.. పిచ్చి పట్టిందా నీకు వాడికి నేనెందుకు సాయం చేస్తాను..

భాగీ: అబద్దం చెప్పకు వాడికి సాయం చేసింది నువ్వే.. నీ గురించి నాకు తెలియదా..? నువ్వు వెళ్లింది కోల్‌కతా కాదు కాశ్మీర్ కు. తన కూతురు దొరికిందని కాశ్మీర్‌ వెళ్లిన రణవీర్‌ వెనక నువ్వు దొరకకూడదని వెళ్లావు.. అక్కడి నుంచి రణవీర్‌ తోనే తిరిగి వచ్చావు.. నీ కూతురు కోసం ఆకాష్‌ను కిడ్నాప్‌ చేయమని నువ్వే రణవీర్‌కు ప్లాన్‌ ఇచ్చావు.. ఆయన మెడిసిన్‌ కోసం బయటకు వెళ్లగానే.. ఐసీయూలోకి రణవీర్‌ను పంపావు.. ఆకాష్‌ దగ్గర ఉన్న నన్ను రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లేలా చేశావు.. రణవీర్‌ను లోపలికి పిలిచి ఆకాష్‌ను ఎత్తుకెళ్లేలా చేశావు.. ఇదే కదా జరిగింది

మను: నీకు నిజంగా పిచ్చి పట్టింది భాగీ.. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు..

భాగీ: పిచ్చి పట్టింది నాకు కాదు నీకు.. రణవీర్‌తో కలిసి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు.. ఈరోజు ఆకాష్‌ కు ఏమైనా జరిగిందా..? నీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది. ఆయనకు నీ గురించి మొత్తం చెప్పేస్తాను.. సాక్ష్యాలు ఆధారాలు లేవు అనుకోకు నిన్ను తగులబెట్టడానికి నా దగ్గర అన్ని ఉన్నాయి

మను: ఏంటే రెచ్చిపోతున్నావు.. నేను కరుణిస్తే.. మళ్లీ తిరిగి వచ్చావు.. నేను దయతలిస్తే ఇంట్లో ఉంటున్నదానివి.. నా బిక్ష మీద బతుకుతున్నదానివి నాకే వార్నింగ్‌ ఇస్తున్నావా..? మర్చిపోయావా..? నేను తలుచుకుంటే నిన్ను ఈరోజే ఇంట్లోంచి పంపిచేస్తాను

భాగీ: తలుచుకో నేను ఏదీ మర్చిపోలేదు మనోహరి. నాకు అన్ని గుర్తు ఉన్నాయి. నేను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి నువ్వే కారణం అని నాకు ఎప్పుడో తెలుసు.. నువ్వు కరుణిస్తే నేను తిరిగి రాలేదు. నీ దయ వల్ల నేను ఇంట్లో ఉండటం లేదు. నీ బిక్ష పైన బతకడం లేదు. నేను తిరిగి రావాలి అనుకున్నాను కాబట్టే వచ్చాను. ఇంట్లో ఉండాలి అనుకున్నాను కాబట్టి ఉంటున్నాను. అయినా నా ఇంట్లో నా భర్త నా పిల్లలతో నేను ఉండటం. నీ బిక్ష ఏంటి..? నువ్వు చేసిన పాపాలు అన్నింటిని లెక్క కట్టి వడ్డీతో సహా నీకు తిరిగి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. త్వరలోనే నీ స్టోరీకి ఎండ్‌ కార్డు పెట్టబోతున్నాను. నీ పని అయిపోయింది మనోహరి

అని భాగీ వార్నింగ్‌ ఇస్తుంటే అప్పుడే అమర్‌ వస్తాడు.

అమర్‌: భాగీ ఇప్పుడు నీకు ఎలా ఉంది..?

భాగీ: నాకు బాగానే ఉంది మీరు సీసీటీవీ పుటేజీ చూశారు.. కిడ్నాప్‌ చేసింది ఎవరో తెలిసిందా..?

అంటూ భాగీ అడగ్గానే.. చూశానని  ఆ కిడ్నాపర్‌ ఎవరో కాదు రణవీరేనని అమర్‌ చెప్తాడు. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా..? అని భాగీ అడగ్గానే.. సీసీటీవీ పుటేజీలో ఎవ్వరూ లేరు కానీ రణవీర్‌ వైఫ్‌ వెనకుండి ఇదంతా నడిపిస్తుందని అనుమానంగా ఉంది అంటూ అమర్‌ చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget