అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 20th: మండపంలో మిస్సమ్మ, బయట అరుంధతి, భగవంతుని నిర్ణయం ఏమిటి

Nindu Noorella Saavasam Today Episode: మండపం లోకి ప్రవేశించిన మిస్సమ్మ అమరేంద్రకి కనపడకుండా దాక్కుంటుంది. బయట ఆగిపోయి అరుంధతి అమర్ , భాగిల వివాహమే దైవ నిర్ణయం అని నమ్ముతుంది. ఇంతకీ ఏం జరగనుందో..

Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మ రూపంలో వచ్చిన అరుంధతి అనుకోకుండా అక్కడ   ఘోరా  గీసిన బంధన రేఖ వల్ల లోపలికి వెళ్ళలేక పోతుంది. పిల్లలు వెనక్కి తిరిగి వచ్చి  మిస్సమ్మా  నీవల్లే మీ అందరికీ వచ్చాము,  నువ్వే ఉదయం లేచి మమ్మల్ని పట్టుకొచ్చావు.  అందుకని లోపలకి రమ్మని అంటారు. కానీ ఇదంతా అరుంధతి ఆత్మ చేసిన పని కావడంతో   మిస్సమ్మ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఇక్కడికి ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను అని అడుగుతూ ఉంటుంది. పెళ్ళాపటానికే వచ్చి లోపలికి వచ్చాక ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని రాథోడ్ అడుగుతాడు. పిల్లలు రాలేకపోయారు అని బాధపడుతున్న అక్కడివారు అందరూ పిల్లలు  కనబడేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు  మిస్సమ్మకు మాత్రం ఏమీ అర్థం కాక పైకి నవ్వుతూ ఉండిపోతుంది. మిసమ్మ వచ్చింది అని చూసిన పనిమనిషి వెంటనే లోపల మనోహరి కి చెప్పాలని బయలుదేరుతుంది. బయట అరుంధతి మాత్రం లోపలికి వెళ్లడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అమ్మ అని లోపలికి వచ్చిన పనిమనిషితో ఏంటే నీ ప్రాబ్లం అని అంటుంది మనోహరి. 

మనోహరి: నేను ప్రశాంతంగా పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా. అసలే చాలా టెన్షన్స్ తో పెళ్లి త్వరగా ఎలా జరిగేలా చేయాలో అర్థం కాక నేనుంటే, నువ్వేమో 10 నిమిషాలకు ఒకసారి బ్యాడ్ న్యూస్ మోసుకొని వస్తున్నావ్.

పనిమనిషి: మీ పెళ్లికి అన్ని గండాలు మీరు పెట్టుకుని నన్నంటే నేనేం చేస్తాను అమ్మగారు

మనోహరి: సరే ఇప్పుడేమైందో ముందు అది చెప్పు 

పనిమనిషి: ఫంక్షన్ హాల్ కి ఆ మిస్సమ్మ పిల్లల్ని తీసుకొని వచ్చిందమ్మా 

మనోహరి: చా, ఇదేంటి ఈ ఇంటిని జలగలాగా పట్టుకొని వేలాడుతోంది. అంత అవమానించిన దొంగని ముద్రవేసిన కూడా మళ్లీ పెళ్లికి సిగ్గులేకుండా వచ్చేసింది. 

పనిమనిషి: అదే నాకు అర్థం కావటం లేదు అమ్మ. అయినా తన అక్క పిల్లలని తెలియకున్నా కూడా ఆ కుటుంబాన్ని మీ నుండి కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాది. ఎన్ని మాటలు పడుతుంది. ఎన్ని అవమానాలు భరిస్తుంది. నిజంగా మిస్సమ్మ గ్రేటే అమ్మ. 

మనోహరి: అవునే ఇన్ని చేశాక కూడా... అది ఇంకా ఈ పెళ్లిని ఆపపాలని,  ఆ పిల్లల్ని అమర్ ని  ఎప్పటికీ కలిసి ఉండేలా చేద్దాం అనుకుంటున్న దాని కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే నాకు ముచ్చట వేస్తోంది 

పనిమనిషి: త్వరగా ఏదో ఒకటి చేసి ఇక్కడి నుండి పంపించేయండి అమ్మ. 

మనోహరి: ఎందుకే ఉండనువ్వు దాని కళ్ళముందే అమర్ నా మెడలో తాళి కట్టడం మేము ఏడడుగులు వేయడం అది చూడాలి. చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేక ఆ పెళ్లిని ఆపలేక సాయి స్థితిలో అలా కూర్చుని కుమిలి కుమిలి ఏడవడం నిన్ను చూడాలి ఆ గెలుపుని నేను ఆనందించాలి. 

పనిమనిషి: అది కాదమ్మా మిస్సమ్మని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాకెందుకు మిస్సమ్మ ఇక్కడ ఉంటే పెళ్లికి అడ్డుపడుతుందేమో అనిపిస్తుంది 

మనోహరి: నువ్వే దాన్ని ఎక్కువ అంచనా వేస్తున్నావు. అయినా అది ఇప్పుడు చచ్చిన పామే.  దాన్ని మళ్లీ చంపడం దేనికి.  అది పెళ్లి ఆపాలంటే అమర్ ముందుకు రావాలి కదా.  ఇప్పుడు అది ఏమి చెప్పినా అమర్ నమ్మటం పక్కన పెట్టు కనీసం దాని మాట వినడు. మొహం కూడా చూడడు. అయినా అది వచ్చి ఒక రకంగా నాకు మేలే చేసిందిలే. 

పనిమనిషి: ఏమి  మేలు చేసిందమ్మా 

మనోహరి: అది రాకుంటే కచ్చితంగా పిల్లలు, రాథోడ్  వచ్చేవాళ్లే కాదు. అమర్ నా మెడలో తాళి కట్టడం వాళ్లు చూడకపోతే నా ఆనందం కొంచెం తగ్గిపోయేది. అయినా నన్ను ఆపాలనుకున్నవాళ్లు, నన్ను ఆశ్రయించుకున్న వాళ్లు, అనుమానించిన వాళ్లు, అవమానించిన వాళ్లు అందరూ ఒకే చోటుకి భలే వచ్చారే... 

పనిమనిషి: అవునమ్మా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ గతం కూడా వచ్చింది. అసలు ఎవరు అమ్మ వాళ్లు. మీరు ఎందుకు నన్ను పెళ్లికూతురు స్థానంలో కూర్చోబెట్టారు. ఎందుకు మీరు వాళ్లకి అంత భయపడ్డారు. ఇప్పుడే కాదమ్మా ఇంతకుముందు కూడా మీరు మీ గత ప్రస్తావన వచ్చినప్పుడు మీరు ఇలానే ..

మనోహరి: ఆపేయ్..  ఆపు కొన్ని విషయాలు తెలుసుకోవడం నీ ప్రాణానికి అంతం అంత మంచిది కూడా కాదు తెలుసుకోవాలి ప్రయత్నించుకు

పనిమనిషి: క్షమించండి అమ్మ ఇంకొకసారి అడగను 

అని వెళ్ళిపోతుంది. మిస్సమ్మ వాళ్ళ ఇంట్లో నాన్న మంగళని తిట్టి ఉదయం అనగా బయటికి వెళ్ళింది ఇంతవరకు ఎందుకు రాలేదు ఏంటి అని గాబర పడతాడు. ఆ పెళ్లి ఆపడానికి వెళ్లిందని పంతులుగారు చెప్పడం  గుర్తొస్తుంది. వెంటనే మండపానికి బయలుదేరుతారు.  అరుంధతి చేస్తున్న ప్రయత్నానికి చిత్రగుప్త కోప్పడతాడు.  అరుంధతి బాధతో , కోపంతో, ఆవేదనతో గుప్తా మీద కూడా కోప్పడుతుంది. నా తాళి ఎప్పటికైనా తనకే దక్కాలి కాబట్టే భగవంతుడు తనని ఆ కుటుంబానికి దగ్గర చేశాడని వాదిస్తుంది.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy :  విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
Karimnagar BRS Mayor: కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
Kadapa DTC  : తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన -  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bihar DEO Bundles of Cash | అధికారి ఇంట్లో తనిఖీలు..నోట్ల కట్టలు చూసి షాక్ | ABP DesamRam Gopal Varma Convicted Jail | సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీకి జైలు శిక్ష | ABP DesamNara Lokesh Davos Interview | దావోస్ సదస్సుతో ఏపీ కమ్ బ్యాక్ ఇస్తుందన్న లోకేశ్ | ABP DesamCM Chandrababu Naidu Davos Interview | మనం పెట్టుబడులు అడగటం కాదు..మనోళ్లే ఎదురు పెడుతున్నారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy :  విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
Karimnagar BRS Mayor: కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
Kadapa DTC  : తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన -  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
Budget Halwa: బడ్జెట్‌ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?
బడ్జెట్‌ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?
RRB: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు- వివరాలు ఇలా ఉన్నాయి
RRB: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు- వివరాలు ఇలా ఉన్నాయి
Rajahmundry Airport Accident: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం - కొత్త టెర్మినల్ పనుల్లో హఠాత్తుగా పడిపోయిన నిర్మాణం
రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం - కొత్త టెర్మినల్ పనుల్లో హఠాత్తుగా పడిపోయిన నిర్మాణం
Andhra News: డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
Embed widget