Nindu Manasulu Serial Today September 11th: నిండు మనసులు: రాజశేఖరం పుట్టినరోజున ఊహించని ట్విస్ట్! ప్రేరణ, ఇందిర మధ్య ఏం జరగబోతుంది?
Nindu Manasulu Serial Today Episode September 11th ఇందిర ఈశ్వరి, గణలను ఒప్పించి రాజశేఖరాన్ని గుడికి తీసుకురావడం ప్రేరణ, ఐశ్వర్యలు కూడా గుడికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సుధాకర్ రాజశేఖరానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తాడు. సార్ ఏం ఇష్టమైతే అది చేస్తాను అని ఇందిర అంటే దానికి సుధాకర్ సార్ ప్రతీ సంవత్సరం పుట్టిన రోజుకి గుడికి వెళ్తారు. శని, ఆదివారాలు కాకపోతేనే అని అంటాడు. ఆవిడ ఆ విషయం నిన్ను అడిగిందా అని ఈశ్వరి అరుస్తుంది.
ఇందిర రాజశేఖరాన్ని గుడికి తీసుకెళ్దాం అంటుంది. ఈ పరిస్థితిలో వద్దని ఈశ్వరి అంటే ఈ గంగే వాళ్ల ఆయన్ని గుడికి తీసుకెళ్తుంది. మీరు తీసుకెళ్లకపోవడం ఏంటి మేడం అని సుధాకర్ అంటారు. అందరూ గుడికి వెళ్లానని అనుకుంటారు. సుధాకర్ స్టేషన్‌కి వెళ్తాను అని అంటే గణ కోపంగా పనికి మాలిన సుధా నీకు స్టేషన్‌లో ఏం పని లేదులే కానీ కార్ రెడీ చేయ్ అని అంటాడు.
సిద్ధూ నిద్ర సరిగా లేక బద్ధకంగా ఇంటికి వస్తే.. కుమార్ చూసి రాత్రంతా ఎక్కడున్నార్ సార్ అని అడిగితే ప్రేరణ వాళ్ల ఇంట్లో చదువుకున్నానని అంటాడు. ప్రేరణ వాళ్ల ఇంట్లో చదువుకున్నావా అని కుమార్ నోరెళ్ల బెడతాడు. ఓవర్ చేయకురా అని సిద్ధూ అంటాడు. దానికి కుమార్ మీ ఇద్దరి మధ్య ఏం లేకుండా ఆ ఇంటికి వెళ్లావా నిన్ను ఆ అమ్మాయి ఏం లేకుండా పిలిచిందా..రాత్రి కలిసి చదుకువున్నారా.. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అంటాడు. కుమారా నీది బుర్రా బూతా అని సిద్ధూ అంటాడు. మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉంటే చెప్పరా నేను కలుపుతానని కుమార్ అంటాడు. ఇంతకు మించి ఒక్కటి మాట్లాడితే ఒక్కటిస్తా జాగ్రత్త అని సిద్ధూ అంటాడు. ఇక కుమార్ తానకి ఓ లవ్ ఉందని అంటే సిద్ధూ నవ్వి ఏంట్రా నీకు లవ్వా ఎవర్నా ఆ దురదృష్టవంతురాలు అని నవ్వుతాడు.
కుమార్ సిద్ధూతో నాకు హెల్ప్ చేయురా. శైలుని నీకు పరిచయం చేస్తా మమల్ని నువ్వే కలపాలి అని అంటాడు. దానికి సిద్ధూ ఆ రోజు వైజాగ్‌లో ప్రేమ పెళ్లి చేసినందుకే ప్రేరణ ఈ రోజుకి నన్ను విలన్‌లా చూస్తుంది. నా రుణం పెరిగిపోతుంది.. తన కోపమూ పెరిగిపోతుంది అని అంటే కుమార్ కాళ్లు పట్టి సాయం చేయరా అని అంటాడు. సరే అని సిద్ధూ అనడంతో శైలుని గుడికి తీసుకొస్తా అని కుమార్ అంటాడు.
ప్రేరణ, ఐశ్వర్య తండ్రి పుట్టిన రోజు అని గుడికి వస్తారు. అమ్మని కూడా తెచ్చుంటే బాగుండేది అని ఐశ్వర్య అంటే తీసుకురాలేం కదా నాన్న పుట్టిన రోజు అని చెప్పగానే అమ్మ ఏడ్చేసింది అందుకే తీసుకురాలేదని చెప్తుంది. ఇక శైలు గుడికి వచ్చి కుమార్‌కి కాల్ చేస్తుంది. ప్రేరణ, ఐశ్వర్యని చూసి శైలు పలకరిస్తుంది. కుమార్ లవ్ చేస్తున్న శైలు ప్రేరణ ఫ్రెండ్. శైలు ప్రేరణ వాళ్లతో మాట్లాడుతుంది.
గణ వాళ్లు గుడికి వస్తుంటే ఓ స్పీడ్ బ్రేకర్ రావడంతో రాజశేఖరం పడిపోతుంటే ఏవండీ అని ఇందిర అనేస్తుంది. దాంతో ఈశ్వరి, గణ షాక్ అయి చూస్తారు. సుధాకర్ కవర్ చేస్తాడు. అందరూ గుడికి వస్తారు. ఇందిర, గణ, ఈశ్వరి, రాజశేఖరాన్ని గుడికి తీసుకెళ్తారు. సుధాకర్ పక్కకు వెళ్లి ప్రేరణ, ఐశ్వర్యలను చూస్తాడు. టెన్షన్ మళ్లీ మొదలైందిరా అని అనుకుంటాడు. పరుగులు తీస్తాడు. సీక్రెట్‌గా ఇందిరకు ప్రేరణ వాళ్లని చూపిస్తాడు. ఇందిర షాక్ అయిపోతుంది.
ఇందిర వాళ్లు ప్రదక్షిణలకు వెళ్తారు. సుధాకర్ ప్రేరణ వాళ్లకి ఎదురెళ్లి ఆపుతాడు. మీరు ఎందుకు వచ్చారు అంటే ఈ రోజు నాన్న పుట్టిన రోజు అంటారు. నువ్వు ఎందుకు వచ్చావ్ అని ప్రేరణ అడుగుతుంది. ఇద్దరినీ వెళ్లిపోమని అంటాడు. మేం ఎందుకు వెళ్లిపోవాలి అని ప్రశ్నిస్తారు. మేం వెళ్లమని అనేస్తారు. సుధాకర్ ప్రేరణ, ఐశ్వర్యలు గణ వాళ్లని చూడకుండా వాళ్లని అటూ ఇటూ తిప్పుతాడు. అందరూ దర్శనానికి వెళ్తారు. ప్రేరణ వాళ్లకి కనిపించకుండా ముసుగు వేసుకుంటుంది. గణ ప్రేరణ వాళ్లు ఒకర్ని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఐశ్వర్య తండ్రి చూసి ఎమోషనల్ అయి నాన్నని చూడాలి అని ఉంది అక్క అని అంటుంది. ఈశ్వరి కోపంగా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















