Nindu Manasulu Serial Today September 10th: నిండు మనసులు: ఇందిర జీవితంలో కొత్త మలుపు! సిద్ధూ ప్రేరణని లవ్ చేస్తున్నాడా? కావాలనే అంతా చేస్తున్నాడా?
Nindu Manasulu Serial Today Episode September 10th రాజశేఖరం పుట్టిన రోజు కావడంతో ఇందిర, సుధాకర్‌తో కలిసి గుడికి తీసుకెళ్లాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode రాజశేఖరం ఇంటికి రావడంతో ఇందిర, ప్రేరణ, ఐశ్వర్య ఎమోషనల్ అయిపోతారు. పరిస్థితులకు దయ లేకపోయినా ఆ దేవుడికి జాలి వేసి నన్ను మామూలు మనిషిని చేశాడని రాజశేఖరం అంటాడు. ఎలా ఉన్నారని అందరినీ అడుగుతారు.
ఇందిర ఏడుస్తూ మీర దూరం అయినప్పటి నుంచి కష్టాలకు దగ్గరైపోయామని.. మీ జాడ లేక మాకు నీడ లేక పిల్లలతో ఇక్కడికి చేరుకుంటే మీరు లేని జీవితం చీకటి అయి ఇలా ఉన్నామని అంటుంది. రాజశేఖరం ఏడుస్తూ తప్పు నేను చేసి మీకు శిక్ష వేశాను.. నా తప్పు నేనే సరిదిద్దుకుంటా.. మీకు అడ్రస్ లేదు అన్నవాళ్లకి నేనే మీ అడ్రస్ అని చెప్తాడు. ఇందిర నా భార్య అని ప్రేరణ, ఐశ్వర్యలు నా పిల్లలు అని ఈ ప్రపంచానికి నేను చెప్తా మిమల్ని కాదు అన్న వాళ్ల కళ్లు తెరిపిస్తా అని అంటారు. దానికి ఇందిర ఏడుస్తూ ఈ రోజు చాలా గొప్ప రోజు అండీ.. మీరు కోలుకోవడం మీ పుట్టిన రోజు కావడం అంతా మా అదృష్టం దేవుడి దయ అని అంటుంది.
రాజశేఖరం ఇందిరతో ప్రతీ పుట్టిన రోజుకి పిల్లలు నాకు గిఫ్ట్ ఇచ్చే వారు ఈ సారి నేను పిల్లలకు గిఫ్ట్ ఇస్తాను.. ఇందిర నాభార్య, ప్రేరణ, ఐశ్వర్య నా పిల్లలు అని ఈ సమాజానికి చెప్పడమే నా గిఫ్ట్ అంటాడు. పిల్లలు ఇద్దరూ ఎమోషనల్ అయి భర్త్‌డే విష్ చెప్తారు. ఇందిర కూడా చెప్తుంది. నా ప్రతీ పుట్టిన రోజుకి నన్ను గుడికి తీసుకెళ్తావ్ కదా అని రాజశేఖరం అంటే తీసుకెళ్తా అండీ తీసుకెళ్తా అని ఇందిర అంటుంది. నేను తీసుకెళ్తా అండీ నేను తీసుకెళ్తా అని ఇందిర అంటే పడుకున్న ఇందిరను సుధాకర్ లేపి అక్క అక్క అని అంటాడు. ఇందిర తుళ్లి పడి లేచి బావగారు వచ్చేశారురా అని అంటుంది. దానికి సుధాకర్ వచ్చింది ఇంట్లోకి కాదు నీ కలలోకి అని అంటుంది.
ఇందిర తేరుకొని బావగారి పుట్టిన రోజు కదా నీకు పాయసం చేసి పెడతా అని చెప్పి బావగారిని గుడికి తీసుకురారా అని సుధాకర్‌తో అంటుంది. చంపేయ్వే నన్ను చంపేయ్‌వే అంటాడు. ఇక ఐడియా ఉందని ఇందిర తమ్ముడితో చెప్తుంది. అదంతా విన్న సుధాకర్ అంతేనా అంత సింపుల్‌గా ఎలా అంటావ్ అక్క నువ్వు నన్ను చంపేస్తావ్ లేదంటే నేను చచ్చిపోతా అంటూనే చేయడానికి ఒప్పుకుంటాడు.
సిద్ధూ రాత్రంతా ప్రేరణతో కలిసి చదివి అక్కడే రంజిత్ గది ముందు సోఫాలో పడుకుంటారు. సిద్ధూ లేచే వరకు రంజిత్ అక్కడే కూర్చొని చూస్తుంటాడు. సిద్ధూ లేచి గుడ్ మార్నింగ్ చెప్తే ఎవరు నువ్వు అని అడుగుతాడు. సిద్ధూ మొత్తం చెప్తాడు. చదువుకోమన్నాను కానీ ఇక్కడే పడుకోమని చెప్పలేదు కదా అని రంజిత్ అంటే వీడు ఎవడ్రా బాబు అనుకుంటాడు సిద్దూ. అంతా గుర్తొచ్చిన తర్వాత రంజిత్ సిద్ధూతో రాత్రి నేను చదువుకోమన్నాను కదా.. ఇక్కడే పడుకోమన్నా నవ్వు మర్చిపోయావ్ అంతే కదా అంటాడు. సిద్ధూ నోరెళ్ల బెడతాడు. రంజిత్ సిద్ధూని వెళ్లిపో మని దుప్పటి దిండు తీసుకెళ్లమని అంటాడు.
సిద్ధూ వాటికి పట్టుకొని కిందకి వస్తాడు. ప్రేరణ కిచెన్‌లో ఉంటే విష్ చేస్తాడు. ప్రేరణ బ్యాడ్ మార్నింగ్ అంటుంది. నేను మీ ఇంటికి రావడం ఇలా ఇద్దరం కలిసి అని సిద్ధూ అనగానే ప్రేరణ కోపంగా చూస్తుంది. దాంతో సిద్ధూ అదే వేరు వేరుగా చదువుకోవడం భలే ఉంది అంటాడు. ప్రేరణ సిద్ధూని ఇంటికి వెళ్లిపోమని చెప్తుంది. ఇందిర సిద్ధూని చూసి బాబు అనగానే హాయ్ ఆంటీ అంటాడు.. ఆంటీ ఏంటి అని ప్రేరణ అంటే అమ్మమ్మ అంటే బాగోదు కదా అంటాడు. ఇక ఇందిరతో వెళ్లిపోతున్నా ఆంటీ అంటాడు. అప్పుడేనా అని ఇందిర అంటే మీరు కాఫీ ఇస్తాను అంటారేమో వద్దు ఆంటీ అని దీర్ఘాలు తీస్తాడు. దాంతో ఇందిర కాఫీ తాగే వెళ్లాలి అని ప్రేరణకు కాఫీ చేయమని అంటుంది.
ఇందిర బయటకు వెళ్తాను అంటే ఎక్కడికి అని ప్రేరణ ప్రశ్నిస్తుంది. దాంతో నీకు ఏంటే చెప్పేది.. ఈ రోజు మా అక్కకి సెలవు రోజు మీకు చాకిరీ చేయాలా.. ఈ ఒక్క రోజు మీ అక్కాచెల్లెళ్లు ఇంట్లో అన్ని పనులు చేయండి నేను మా అక్క బయటకు వెళ్తాం. మా అక్కకి సెలవు ఇవ్వండి మీ నోటికి తాళాలు వేసేయండి అని అంటాడు. సుధాకర్ ఇందిరను తీసుకొని వెళ్లిపోతాడు. ప్రేరణ ఇరిటేట్ అయి ఐశ్వర్యని పిలుస్తుంది. కాఫీ చేసి ఇవ్వమని చెప్తుంది.
ఐశ్వర్య సిద్ధూతో మీరు ప్లాన్ ప్రకారమే అంతా చేస్తున్నారు కదా అని అంటుంది. లేదండీ అంతా యాదృచ్చికమే అంటాడు. దానికి ఐశ్వర్య వైజాగ్‌లో పెళ్లి అన్నారు.. ఇక్కడ బైక్ డ్రైవింగ్ అన్నారు. అడక్కుండా కూరగాయలు తెస్తారు. ఎక్కడున్నా కొబ్బరి బోండాం తెస్తారు. ఇంటి బయటే వెయిట్ చేస్తారు. అడక్కుండా బైక్‌పై డ్రాప్ చేస్తారు.. ఇదంతా కోఇన్సిడెన్సేనా అని ఐశ్వర్య అడుగుతుంది. చాలా ఎక్కువగా ఊహిస్తున్నారు. కాస్త తగ్గించుకోండి. ఒంటికి అంత మంచిది కాదు.. థ్యాంక్యూ అని వెళ్లిపోతాడు.
గణ, ఈశ్వరి కూర్చొని మాట్లాడుతుంటే ఇందిర రాజశేఖరాన్ని వీల్ చైర్ మీద పెట్టి బయటకు వస్తుంది. సుధాకర్ బొకేతో ఎంట్రీ ఇస్తాడు. గణ ప్రశ్నించడంతో అదేంటి సార్ అన్నీ తెలిసి ఇలా అంటారు అని బొకే రాజశేఖరం చేతిలో పెట్టి చిన్నగా హ్యాపీ భర్త్‌డే బావగారు అని పెద్దగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ అంటాడు. దానికి ఇందిర ఏంటి ఈరోజు అయ్యగారి పుట్టినరోజా ఏం చేయమంటారు పాయసం చేయనా అని ఈశ్వరిని అడుగుతుంది. ఏం వద్దని ఈశ్వరి అనేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















