Nindu Manasulu Serial Today September 6th: నిండు మనసులు సీరియల్: మంత్రి రాసలీలల వీడియో లీక్.. గణ బ్లాక్‌మెయిల్.. కాళ్ల బేరానికి మినిస్టర్!
Nindu Manasulu Serial Today Episode September 6th మినిస్టర్ రాసలీలల వీడియోతో గణ మినిస్టర్‌ని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode నమ్మకం అనే కాన్సెప్ట్ మీద ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ మాట్లాడుతారు. ప్రేరణ తల్లిదండ్రుల నమ్మకం గురించి వాళ్ల బంధం గురించి చెప్తే సిద్ధూ వింటూ ఉండిపోయి ఏదో ఆలోచిస్తూ తన వంతు వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండిపోయాడు. దాంతో ప్రేరణ బాగా చెప్పిందని విశ్వనాథ్ అంటారు.
విశ్వనాథ్ పర్సనల్‌గా రాసిన థీసిస్‌ని ఇద్దరూ కలిసి ప్రిపేర్ అవ్వండి అని ఓ బుక్ ఇచ్చి రెండు రోజుల్లో మళ్లీ పరీక్ష ఉంటుందని అంటారు. ప్రేరణ ఆ బుక్ త్వరగా అందుకుంటుంది. మరోవైపు ఐశ్వర్య దగ్గరుండి ఏసీ రిపేర్ చేయిస్తుంది. ఇద్దరూ కలిసి రంజిత్ దగ్గరకు వెళ్తారు. రంజిత్ ఆయనతో ఫ్రిజ్ రిపేర్ చేశావా అంటే ఇద్దరూ షాక్ అవుతారు. మళ్లీ మర్చిపోయాడు అని ఐశ్వర్య మనసులో అనుకుంటుంది. రిపేర్ చేసిన అతను రెండు వేలు అడిగితే అతని చూసి మందు తాగుతావ్.. నీకు పచ్చకామెర్లు ఉన్నాయ్.. జ్వరం ఉంది.. వీక్‌గా ఉన్నావ్.. లివర్ పోయింది అని చెప్పి టెస్ట్‌లు చేసుకోమని డబ్బులు ఇస్తాడు. అవన్నీ నీకు ఎలా తెలిశాయని ఐశ్వర్య అడిగితే చూస్తే తెలిసిపోతుందని చెప్పి గదిలో ఎప్పుడూ ఏం టచ్ చేయకుండా ఉండు అని చెప్తాడు.
మినిస్టర్ జయరాం దగ్గరకు గణ వస్తాడు. మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాను సార్ అని గణ అంటే కొబ్బరి కాయ కొడతావా ఏంటి అని మినిస్టర్ అంటాడు. దానికి గణ దద్దోజనం ఇస్తానని అంటాడు. ఇక మినిస్టర్ గణని కూర్చొవద్దు అని నిలబడొద్దు అని గణని ఇబ్బంది పెడతాడు. దాంతో గణ ముఖ్యమైన విషయం సార్ అని అంటాడు. పీఏని పంపేస్తారు. నాకు నసపెట్టకు చాలా పనులు ఉన్నాయ్ అని మినిస్టర్ గణని అని వెటకారంగా నవ్వుతాడు. దానికి గణ నా దగ్గర ఓ వీడియో సార్ చూడండి అని మినిస్టర్ రాసలీలల వీడియో చూపిస్తాడు.
మినిస్టర్ ఫిట్స్ వచ్చినట్లు అయిపోయి అలా ఉండిపోతాడు. మినిస్టర్ ఒక్క సారిగా పూర్తిగా తగ్గిపోతాడు. గణ మినిస్టర్‌ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు. రిలాక్స్ అవ్వండి సార్ ఈ క్షణం అయినా ఈ వీడియో మీడియాలోకి వెళ్తుంది. జనాలు అంతా పండగ చేసుకుంటారని గణ అంటాడు. దానికి మినిస్టర్ ఈ వీడియో బయటకు వెళ్లకూడదు అని అంటాడు. దెబ్బకి దిగిపోయి నువ్వేం చెప్తే అది చేస్తా అంటే నేను ఆఫ్రాల్ ట్రాఫిక్ ఎస్‌ఐని దీన్ని ఆపాలి అంటే పవర్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయిండాలి.. నమ్మకం ఉన్నవాడు కావాలి అంటాడు. అలాంటి వాడు ఎవడు ఉన్నాడు అని మినిస్టర్ అంటే గణ కాలి మీద కాలు వేసుకొని మీకు ఆలోచించే టైం ఉన్నా వీడియో ఎవడో ఒకడు లీక్ చేసేస్తాడు. దమ్మున్న పోలీస్ ఎవడో మీరు ఆలోచించుకోండి అని మినిస్టర్‌ని అంటాడు. వెళ్తూ వెళ్తూ సార్ చింతామణితో డ్యాన్స్ అదిరిపోయింది అంటాడు.
ఏసీ రిపేర్ చేసిన వ్యక్తి రిపోర్ట్ తీసుకొని రంజిత్ దగ్గరకు వచ్చి అన్నీ టెస్ట్‌లు చేయించుకున్నా మీరు చెప్పినట్లే రిపోర్ట్ వచ్చాయని అంటాడు. ఐశ్వర్య నోరెళ్లబెడుతుంది. ప్రేరణ సిద్ధూతో ఇచ్చిన టాపిక్ మీద ఎలా మాట్లాడాలో ఇప్పుడు అర్థమైందా అని అంటుంది. మీరు సూపర్ అండీ మీకు అవతల వ్యక్తి మీద నమ్మకం ఉండదు కదా అలా ఎలా చెప్పారని అంటాడు. ఇక సిద్ధూ థీసిస్ బుక్ అడిగితే ప్రేరణ ఇవ్వను అంటుంది. ఇద్దరూ కొట్లాడుకుంటే అంకుశం పరాంకుశం అక్కడికి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















