Nindu Manasulu Serial Today November 19th: నిండు మనసులు: ప్రేరణ-సిద్ధూల మధ్య పెళ్లి రచ్చ! కుమార్, శైలుల ప్రేమ ఏ మలుపు తిరుగుతుందో?
Nindu Manasulu Serial Today Episode November 19th సిద్ధూ శైలు, కుమార్ పెళ్లి చేస్తానని అనడం ప్రేరణ అడ్డు పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ప్రేరణతో వాడు గుడికి ఎందుకు వచ్చాడు అని నీకు ఏం డౌట్ రాలేదా అని అడుగుతాడు. బుర్ర నిండా నాకు డౌట్‌లే అని ప్రేరణ అంటుంది. వాడి బాడీ లాంగ్వేజ్‌కి వాడి ప్రవర్తనకు అసలు పొంతన లేదు.. అంతా ఆపేయమని చెప్పాను.. కాదు అంటే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది అని చెప్పాను అని అంటాడు. వాడు ఇంతలా నటిస్తున్నాడు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది.. ఏదో చేయబోతున్నాడు అని ప్రేరణ అంటుంది.
సిద్ధూ, ప్రేరణల దగ్గరకు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి చిన్న ఎంక్వైరీ ఉంది.. రండి అని ఇద్దరు ఎన్ని ప్రశ్నలు వేసినా చెప్పకుండా తీసుకెళ్తారు. ఇక మినిస్టర్ దగ్గరకు అతని రౌడీలు కుమార్‌ని తీసుకొస్తారు. నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ అని కుమార్ అంటే నా కూతురితో నీకు మాటలు ఏంట్రా.. కేఫ్‌కి నా కూతురు ఎందుకు వచ్చిందిరా.. నువ్వు ఎందుకు నా కూతురితో అంత క్లోజ్‌గా మాట్లాడుతున్నావ్‌రా అని మినిస్టర్ అడుగుతాడు. నాకు తెలుదు మీ కూతురు ప్రేరణ కోసం వచ్చింది అని కుమార్ కవర్ చేస్తాడు. ఈరోజు అందరి నాటకాలు బయట పెట్టిస్తా అని మినిస్టర్ అంటాడు.
సిద్ధూ, ప్రేరణలు వచ్చే సరికి మినిస్టర్ కుమార్ కాలర్ పట్టుకోవడం కుమార్ మినిస్టర్‌ని బతిమాలడం చూసి వీడు దొరికేశాడు అని సిద్ధూ అంటాడు. ప్రేరణ మినిస్టర్‌ని ఆపి మీకు ఇంకో విషయం తెలియాలి అని అంటుంది. సిద్ధూ సీక్రెట్‌గా నువ్వు నీ సిద్ధాంతాలు ఆపేయ్ ఇప్పుడు నువ్వు నిజం చెప్తే కుమార్‌ని చంపేస్తాడు అని అంటాడు. విషయం తెలుసుకున్న సిద్ధూ మినిస్టర్‌తో మీ అమ్మాయి ప్రేరణ కోసం వచ్చుంటుంది అలాగే మీ అమ్మాయి కుమార్‌తో మాట్లాడుటుంది అని అంటాడు. మినిస్టర్ ప్రేరణతో నువ్వు నాతో చెప్తా అన్న విషయం ఏంటి అని అడుగుతాడు.
శైలు దగ్గర నిజం తెలుసుకోవడానికే కేఫ్‌కి రమ్మని పిలిచామని సిద్ధూ అంటాడు. నువ్వు కన్‌ఫ్యూజ్ చేస్తున్నావ్ ప్రేరణ చెప్తేనే వింటాను అని మినిస్టర్ అంటాడు. ప్రేరణ నిజం చెప్పే టైంకి సిద్ధూ శైలుకి ఫోన్ చేసి పిలిపిస్తాడు. వీళ్లని ఎందుకు పిలిచావ్ నాన్న నా మీద అనుమానమా అని శైలు అంటే దానికి మినిస్టర్ బ్రేక్ ఫాస్ట్‌కి పిలిచానని అంటాడు. దాంతో శైలు అందర్ని పిలుస్తుంది.
మంజుల, సాహితి విజయానంద్తో మాట్లాడుతారు. గణ చాలా గొప్పోడు అని మంజుల విజయానంద్తో చెప్తుంది. గణ పూజలు గురించి చెప్తుంది. వాడేంటి ఇదంతా ఏంటి అని విజయానంద్ అనుకుంటాడు. సాహితి కూడా తండ్రితో అతను చాలా మంచోడు అమ్మ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు అని చెప్తుంది. విజయానంద్ షాక్ అయిపోతాడు. విజయానంద్, విశ్వాసం ఇద్దరూ అసలు ఏం జరుగుతుంది.. అని అనుకుంటారు. విశ్వాసం డౌట్‌లు వ్యక్తం చేస్తాడు. వాడు గుడికి వచ్చాడా.. అమ్మాయిని కలవాలి అని వచ్చాడా.. అని అంటాడు. వాడు కావాలి అని వచ్చాడు అని క్లియర్‌గా అర్థమవుతుంది వాడికి నేను ఏంటో చూపిస్తా అని విజయానంద్ అంటాడు.
సిద్ధూ కుమార్‌ని తిడతాడు. ఎందుకు వెళ్లావని అడుగుతాడు. ఇక శైలు ఈ సమస్య పరిష్కరించడానికి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటాం అని అంటుంది. కుమార్ షాక్ అయిపోతాడు. సిద్ధూ మాత్రం ఇదే కరెక్ట్ అంటాడు. అలా ఎలా చేస్తా అంటావ్ అని ప్రేరణ గొడవ పడుతుంది. ప్రేరణ, సిద్ధూ గొడవ పడతారు. అవసరం అయితే పోలీసులకు చెప్పి సాయం తీసుకోవచ్చు అని ప్రేరణ అంటే మినిస్టర్‌ని కాదని మాకు సెక్యూరిటీ ఇస్తారా అని కుమార్ అంటాడు. సిద్ధూ కుమార్ వాళ్లతో తను అలాగే ఉంటుంది. మీ పెళ్లి నేను చేస్తా అని సిద్ధూ అంటాడు. ప్రేరణ ఇది కరెక్ట్ కాదు అని కుమార్ వాళ్లకి చెప్తుంది. నీకు బంధాలు విలువ తెలీదు.. గాలివాటం మనిషివి.. విలువ లేని పనులు చేస్తే నేను ఊరుకోను అని ప్రేరణ వెళ్లిపోతుంది. సిద్ధూ ప్రేరణని ఒప్పించడానికి వెళ్తాడు. కాఫీ పొడి అంటూ ప్రేరణ కోప్పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















