అన్వేషించండి

Nindu Manasulu Serial Today may 6th: నిండు మనసులు: మల్లెపూలతో సిద్ధూని కవ్వించిన ప్రేరణ! బెడ్ మీద ప్రేరణ పక్కన సిద్ధూ చూసిందెవరిని?

Nindu Manasulu Serial Today may 6th సిద్ధూని ప్రేరణ మల్లెపూలతో కవ్వించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ప్రేరణ బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో ప్రేరణ కొబ్బరి బొండం చూసి ఎలా అయినా తాగాలి అనుకొని సిద్ధూ తాగిస్తాడో లేదో అని కళ్లు తిరిగేస్తున్నాయ్ సిద్ధూ ఆ చెట్టు దగ్గర బండి ఆపు అని అంటుంది. దానికి సిద్ధూ కొబ్బరి బొండా కావాలని చెప్పొచ్చు కదా అంటాడు. సిద్ధూ కొబ్బరి బొండాం కొనిపిస్తాడు. నువ్వు తాగకపోతే నాకు వద్దు అని సిద్ధూ చెప్పడంతో సిద్ధూ ఓకే అంటాడు. ఇద్దరూ బొండాం తాగుతారు. 

ప్రేరణ, సిద్ధూలు బొండాం తాగుతూ ఉంటే ఓ దొంగ  ఇద్దరూ గొప్పింట్లోల్లా ఉన్నారు అనుకొని సిద్ధూ పర్సు పట్టుకొని పారిపోతాడు. సిద్ధూ దొంగ వెనక పరుగులు పెడితే ప్రేరణ కొబ్బరి బొండాంతో కొడుతుంది. దాంతో ఆయన పడిపోతాడు. నువ్వు ఎవర్రా నా భర్త పర్సు కొట్టేయడానికి దాని మీద రైట్స్ నాకే అని అంటుంది. ఇప్పుడు లేస్తే పోలీసులకు పట్టిస్తారు అని దొంగ కళ్లు తెరవడు.. దాంతో ఇద్దరూ ఆయన్ను ఓ క్లినిక్‌కి  తీసుకెళ్తారు. డాక్టర్ చూసి దొంగని తీసుకొచ్చారా మీలాంటి వాళ్లని మొదటి సారి చూస్తున్నా అంటాడు.

సార్ పొగడ్తలు తర్వాత ముందు అతనికి ట్రీట్మెంట్ చేయమని అంటాడు. డాక్టర్ అతన్ని అటు తిప్పి ఇటు తిప్పి.. అతనికి తలకి మాత్రమే దెబ్బ తగల్లేదు చాలా చాలా టెస్ట్‌లు చేయాలి అని అంటాడు. దొంగ మనసులో అసలు వీడు నిజంగా డాక్టరా కాదా.. అని అనుకుంటాడు. వాడికి మాకు ఏం సంబంధం లేదు మేం డబ్బు ఇవ్వమని సిద్ధూ అంటే ఖర్చు మొత్తం తన మీద పడిపోతుందని దొంగ లేచేస్తాడు.  నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి లేదంటే ఈ డాక్టర్ నా కిడ్నీలు అమ్మేస్తాడు అని పారిపోతాడు. 

విజయానంద్ బయట తిరుగుతూ ఉంటాడు. ప్రేరణ, సిద్ధూ దొంగ గురించి మాట్లాడుతూ నవ్వుతూ వస్తారు. అది చూసి విజయానంద్ షాక్ అయిపోతాడు. మీరు నవ్వుకుంటూ వస్తున్నారేంటి ఇద్దరూ కలిసిపోయారా అని అడుగుతాడు. అవును కలిసిపోయాం.. ఇప్పుడేంటి అని సిద్ధూ అంటాడు. నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటాను.. ఇష్టం వచ్చినట్లు బయటకు వెళ్తాను నీకు ఏంటి అని అంటాడు. ఏంటి మామయ్యగారు మేం కలిసి ఉన్నామని ఓర్వలేకపోతున్నారా అని అంటుంది. అవును అని విజయానంద్ అంటే మీకు ఇంకా విడదీసే బుద్ధి పోలేదా అని అడుగుతుంది. అది సరే మీ ఇద్దరూ ఎక్కడికి వెళ్లారు అంటే ఒకే బొండాంలో రెండు స్ట్రాలు వేసుకొని తాగాం అని మెలికలు తిరుగుతుంది. విజయానంద్ గుండెలో రాయి పడినట్లు అయిపోతుంది.

విజయానంద్,విశ్వాసం కలిసి మందు తాగుతూ ఉంటారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో ఈ టైంలో ఎవరు వచ్చార్రా అని బయటకు వెళ్తారు. ఇంటికి ఆర్డర్ వచ్చింది సార్ అని మల్లెపూలు ఇస్తాడు. మల్లెపూలు ఏంట్రా అని విజయానంద్ షాక్ అవుతాడు. ప్రేరణ వచ్చి తీసుకుంటుంది. ఏంటి ఆర్డర్ పెడితే మల్లెపూలు వస్తాయా అని విజయానంద్ అంటే మనం ఆర్డర్ పెడితే ఏమైనా వస్తాయి అని ప్రేరణ వెళ్లిపోతుంది. విజయానంద్ మందు తాగుతూ అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందిరా అని విశ్వాసానికి అడుగుతాడు. అదేంటి సార్ కొత్తగా పెళ్లి అయిన కోడలు మల్లెపూలు పెట్టుకుంటుంది.

సార్ త్వరలోనే మీకు మనవడో మనవరాలో పుడుతుంది అని అంటాడు. ఊరుకో విశ్వాసం నీ మనసులో ఏం అనుకుంటున్నావో నాకు తెలుసురా మన సిద్ధూ పాలు తాగే పసివాడు.. వాడికి ఇవన్నీ తెలీవురా అని అంటాడు విజయానంద్. ప్రేరణ మన ఇంటికి వచ్చినప్పుడు నుంచే ఇదంతా జరుగుతుందిరా.. ఆ ప్రేరణ వల్ల మందు మంచినీళ్లులా తాగేస్తున్నానురా అని అంటాడు. ప్రేరణ చేసే పనులు ఎలా అయినా ఆపేయాలి అని విజయానంద్ అంటే అయినట్లే అని విశ్వాసం అంటాడు. 

ప్రేరణ మల్లెపూలు పెట్టుకొని బొర్లా పడుకొని ఉంటుంది. సిద్ధూ చూసి అలా దగ్గరకు వెళ్తాడు. అబ్బా ఈ ప్రేరణ ఏంటి ఈ రోజు ఇలా పడుకుంది,, పైగా మల్లెపూలు పెట్టుకుంది.. ఈ మల్లెపూలతో ఏం ప్లాన్ చేసిందో అని అనుకొని ప్రేరణని చూడకుండా లేపుతాడు. ఏంటి అండీ మంచి నిద్రలో లేపుతున్నారు అంటే నువ్వు నిద్రపోతే సరిపోతుందా నేను నిద్రపోవద్దా అని అడుగుతాడు. ఏంటి ఈ రోజు మల్లెపూలు పెట్టుకున్నావ్ అని అడుగుతాడు. నా ఇష్టం.. పూలు పెట్టుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా అని అడిగితే నాకు నువ్వు పూలు పెట్టుకోవడం ఇష్టం లేదు అని అంటాడు. నేను మల్లెపూలు పెట్టుకుంటే నీకు ఏమైనా ప్రాబ్లమా అని ప్రేరణ అడిగితే నా గదిలో పూలు పాల గ్లాస్‌లు నాట్ అలౌడ్‌ అని అంటాడు. బెడ్ దిగు అని సిద్ధూ అంటే లేవను అని ప్రేరణ అంటుంది. దాంతో సిద్ధూ సోఫా మీద పడుకుంటాడు. ప్రేరణ రొమాంటిక్‌గా నీ నవ్వే హాయిగ ఉంది.. ఈ ఊసే కొత్తగ ఉంది అని పాట పాడుతుంది. ఏయ్ ఏంటి పాట పాడుతున్నావ్ అని సిద్ధూ అడుగుతాడు. వస్తావ్ వస్తావ్ నిదానంగా దారిలోకి వస్తావ్ అని ప్రేరణ అనుకుంటుంది. తర్వాత ప్రేరణ పడుకుంటుంది. సిద్ధూ మీద మల్లెపూలు పడితే ప్రేరణ అనుకొని ఏయ్ ప్రేరణ అంటాడు, ఇంతలో ప్రేరణ పక్కన సిద్ధూనే కనిపిస్తూ సిద్ధూ లేచి ఏయ్ ఎవర్రా నువ్వు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget