అన్వేషించండి

chinni serial today may 6th: చిన్ని సీరియల్: లోహిత మెడలో తాళి చూసేసిన చందు! శ్రేయ కండీషన్ నిజంగానే సీరియస్‌ ఏనా!

chinni serial today episode may 6th మ్యాడీ, శ్రేయలకు పెళ్లి చేయాలని నాగవల్లి వాళ్లు ప్లాన్ చేయడం అందులో భాగంగా శ్రేయ ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని కలలో కావేరి కనిపించి బాధ పడకమ్మా త్వరలోనే నేను నీ కడుపులో పాపగా పుడతాను అని చెప్తుంది. దాంతో చిన్ని కంగారుగా లేచి కావేరి ఫొటో దగ్గరకు వెళ్లి.. మాట్లాడుతుంది. మ్యాడీతో మా అమ్మ నా కడుపులో పుడుతుంది.. ఇక ఫొటోలో ఉండదు.. నా కడుపులో ఉంటుంది. అమ్మ మన ఇంట్లో మన బిడ్డగా పుడుతుంది. అమ్మ అన్నీ తానై నన్ను పెంచింది.. రేపు నేను కూడా మా అమ్మని అలా పెంచాలి.. అని చిన్ని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నేను మా అమ్మని అలా పెంచుతా కదా అని చిన్ని అడుగుతుంది. 

మ్యాడీ చిన్నిని దగ్గరకు తీసుకొని నీకు మీ అమ్మ ఆశీస్సులు ఉన్నాయి.. దేవుడి దయ కూడా ఉంటే అన్నీ నువ్వు అనుకున్నట్లే అవుతాయని మ్యాడీ అంటాడు. చిన్నిని పడుకోపెడతాడు. మరోవైపు దేవా రౌడీలకు కాల్ చేసి లాయర్‌ హరి సాక్ష్యాలు ఇచ్చే వరకు చితక్కొట్టమని అంటాడు. ఇంతలో చిన్ని అక్కడికి వస్తుంది. ఏంటి మామయ్య గారు ఏసీ రూంలో ఉన్నా ఇలా చెమటలు పడుతున్నాయి అని అడుగుతుంది. నాకు చెమటలు పడితే నీకు నష్టమేంటి అని అడుగుతాడు. మీ కొడుకు సూపర్ మామయ్యా.. తనకు ఉన్న ఇంటెలిజన్స్‌కి ఏ ఐఏఎస్‌నో ఐపీఎస్‌నో కావాలి.. చూశారా కేసుని ఎలా తిరగేస్తున్నారో.. లాయర్‌ని ఎవరు కిడ్నాప్ చేసుకుంటారు మామయ్యగారు అని చిన్ని అడుగుతుంది. నాకేం తెలుసు అని దేవా అంటే తెలుసుంటుందేమో అని అడిగాను మామయ్య గారు.. లాయర్‌ని మీరు కిడ్నాప్ చేశారు అని గెస్ చేశాను మామయ్య గారు.. నేను అనుకోవడం పార్వతి అత్తయ్యని చంపిన హంతకుడే ఇప్పుడు లాయర్‌ అంకుల్‌ని కూడా కిడ్నాప్ చేసుకుంటాడు. నా భర్త మామూలోడు కాదు కదా.. ఆ హంతకుడు ఎవడో తెలుసుకుంటాడు అని చిన్ని అంటుంది. 

మ్యాడీకి చందు కాల్ చేసి లాయర్‌ అంకుల్‌ని కిడ్నాప్ చేసిన వెయికిల్ సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నా అని అంటాడు. మ్యాడీ చందుతో ఎవరైనా నిన్ను ఫాలో అవుతున్నారేమో జాగ్రత్త అని చెప్తాడు. మ్యాడీ చిన్నిని పిలిచి లాయర్ అంకుల్ అడ్రస్ తెలిసింది,, ఆయన్ను కలిసి సాక్ష్యాలు సంపాదించి.. మమ్మీడాడీకి చూపిస్తే వాళ్లకి మీ అమ్మ నిర్దోషి అని తెలుస్తుందని అంటాడు. ముందు వెళ్లి లాయర్ అంకుల్‌ని కలుద్దాం పద అని అంటాడు. మరోవైపు లోహిత, శ్రేయ, నాగవల్లి, వసంత రెడీ అనుకుంటారు. నాగవల్లి జాగ్రత్త చెప్పి భోజనానికి రమ్మని అంటుంది. ఇంతలో శ్రేయ చేయి కట్ చేసుకొని కళ్లు తిరిగి పడిపోతుంది.. వసంతం శ్రేయని తీసుకొని ఎంత పని చేశావే అని ఏడుస్తూ అందర్ని పిలుస్తుంది. అందరూ కంగారుగా శ్రేయని హాస్పిటల్కి తీసుకొస్తారు. 

చందు మ్యాడీకి కాల్ చేస్తాడు. శ్రేయ సూసైడ్ చేసుకుందని చెప్తాడు. సరే నేను పది నిమిషాల్లో వస్తాను అని చందు అంటాడు. డాక్టర్ వచ్చి శ్రేయ కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్తుంది. తర్వాత దేవాతో మాట్లాడాలని పిలుస్తుంది. వసంత  చాలా ఏడుస్తుంది. చిన్ని దగ్గరకు వెళ్లి ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా.. నీ కళ్లు చల్లబడ్డాయా అని అడుగుతుంది. శ్రేయ పుట్టినప్పుటి నుంచి మ్యాడీనే తన భర్త అని నమ్మి నీతోనే ఉంది.. అనుకోకుండా ఈ చిన్ని వచ్చి నిన్ను గద్దలా తన్నుకుపోయింది.. అప్పటి నుంచి నా కూతురు పిచ్చిది అయిపోయింది అని అంటుంది. లోహిత కూడా అందరితో శ్రేయ నాకు చాలా సార్లు చెప్పింది బతికితే బావ కోసం బతుకుతా లేదంటే చస్తా అని చెప్పిందని లోహిత చెప్తుంది.

శ్రేయ  ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదు.. అని మ్యాడీ అంటే నీకు అర్థం కాదురా.. అది ఎంత ప్రేమించిందో నీకు అర్థం కాదు.. ఈ చిన్ని నిన్ను కావాలనే పెళ్లి చేసుకుందని నీకు అర్థం కాదు.. తను నిన్ను మోసం చేస్తుందని కూడా నీకు అర్థం కాదు అని వసంత అంటుంది. చిన్నిని పొమ్మని గెంటేస్తుంది. లోహితతో చెప్పి చిన్నిని గెంటేయమని అంటుంది. లోహిత చిన్నిజుట్టు పట్టుకొని తీసుకెళ్తుంది. లోహి చిన్నిని బయటకు గెంటేసే టైంకి చందు అక్కడికి వచ్చి మొత్తం చూస్తాడు. లోహిత, చందు ఒకరికి ఒకరు చూసి షాక్ అయిపోతారు. లోహిత మెడలో తాళి చూసి లోహితకు పెళ్లి అయిందని బిత్తరపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
Godavari Serial Today July 4th: 'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget