అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today may 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: హాస్పిటల్‌లో వల్లీకి ఊహించని షాక్! మళ్లీ చిక్కుల్లో వల్లీ కాపురం!

Illu Illalu Pillalu Serial Today Episode may 6th వల్లీ కడుపులో బిడ్డ లేదని నర్మద అనడం నిరూపిస్తా అని వల్లీ హాస్పిటల్‌కి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ కన్నీరు పెట్టుకుంటూ నర్మద అక్క ఈ ఇంటి గుమ్మం దాటి వెళ్లిపోతుందేమో అని భయంతో నా గుండె ఆగి ఆగి కొట్టుకుందిరా తెలుస్తుందా అని అంటుంది. తెలుస్తుంది.. ఈ గుండె నా కోసం కాకుండా పక్క గదిలో ఉన్న మీ అక్క కోసం కొట్టుకుంటుందన్నమాట అని అంటుంది. అవునురా.. ఈ 5 లక్షలు అడ్డు పెట్టి ఆపావు.. బావ పౌరుషానికి పోయి ఆ డబ్బు కట్టేసి వెళ్లిపోతా అంటే ఏం చేస్తావురా అని అడుగుతుంది. మై డియర్ పెళ్లాం.. నీ డియర్ అక్క నాకు డియరెస్ట్ వదిన కదా.. మీ బుల్లి బావ.. నాకు బ్లెడ్ బ్రదర్ కదా.. మరి వాళ్లని నేను వెళ్లనిస్తానా.. ఇలా చిన్న చిన్న వాటిని తలచుకొని నువ్వు పెద్దగా ఊహించుకోవద్దు అని అంటాడు. నువ్వేంటే ఆ ధైర్యమే వేరురా అని ప్రేమ ధీరజ్ భుజం మీద వాలిపోతుంది. 

శ్రీవల్లికి భాగ్యం పీతల గుడ్లు కూర పంపిస్తుంది. అది చూసి వల్లీ లొట్టలేసుకొని తినడానికి రెడీ అయిపోతుంది. ఇడ్లీబాబాయ్ భాగ్యం ఆవిడగారండీ మీరు పెన మీద దోసెను పొయ్యిలో వేసినట్లు అయిందండీ.. కడుపుతో ఉన్న వాళ్లు పీతల కూర తినరు కదా.. అమ్మడు తినడం వేదవతి చెల్లాయ్ చూసింది అంటే అంతే సంగతి ఇక అని అంటాడు. మూడో కంటికి తెలీకుండా అమ్మడుకి తినమని చెప్పావ్ కదా మరి టెన్షన్ ఎందుకు అని అడుగుతుంది. వల్లీ బెడ్‌రూంలో బెడ్ మీద పీతల కూర పెట్టుకొని తింటుంది. ఇంతలో చందు శ్రీవల్లి కోసం పుల్లటి మామిడి కాయలు తీసుకొచ్చి అవి ఇవ్వమని ప్రేమ, నర్మదలకు చెప్తాడు. ఏంటి బావ అని అంటే కడుపుతో ఉన్న తనకి పుల్లటివి తినాలి అనిపిస్తుంది కదా.. అందుకే తెచ్చా ఇచ్చేయండి అంటాడు. మీరే ఇవ్వొచ్చు కదా బావ అని ప్రేమ అంటే అమూల్య విషయంలో తను చేసింది ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా మీరే ఇచ్చేయండి అని అంటాడు.

నర్మద, ప్రేమ వల్లీ దగ్గరకు తీసుకొని వెళ్తారు. వల్లీ పాటలు పెట్టుకొని పాటలు పాడుతూ పీతల కూర తింటుంది. వల్లి అక్కాయ్ అని పిలవగానే వచ్చేశారు వీళ్లు ప్రశాంతంగా తిననివ్వరు అని అంటుంది. ఇంతలో ఇద్దరూ దగ్గరకు వచ్చి ఏం తింటున్నావ్ అంటే నాకు ఇష్టమని మా అమ్మ పీతల కూర వండి పంపిందని అంటుంది. నీకు బుద్ధుందా కడుపుతో ఉన్న వాళ్ల పీతల కూర తినరు కదా.. వేదవతిని పిలుస్తారు. వేదవతి కూడా వచ్చి షాక్ అయి అసలు మీ అమ్మకి బుద్ధుందా.. ఇద్దరు పిల్లల తల్లి కదా.. ఈ మాత్రం తెలీదా అని తిడుతుంది. ఇంకోసారి మీ అమ్మ ఏమైనా ఇస్తే నాకు తెలీకుండా తింటే బాగోదు అని తిడుతుంది. తర్వాత మామిడి కాయలు ఇస్తుంటే పులుపు అని తినదు. నర్మద, ప్రేమ వేదవతిని పక్కకి తీసుకెళ్తారు. నర్మద వేదవతితో అత్తయ్యా వల్లీ అక్కని చూస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది అని అడుగుతుంది. అదో తింగరి అని వేదవతి అంటే అది కాదు అత్తయ్యా నాకు ఎందుకో తను ప్రెగ్నెంట్ కాదు అనిపిస్తుంది. కూతురు కడుపుతో ఉంటే తల్లి ఎందుకు పీతల కూర ఇస్తుంది. పైగా కడుపుతో ఉన్న వాళ్లు వేవిళ్లతో పులుపు తినాలి అనుకుంటారు.. అక్క చూశావా మామిడి కాయలు ఎలా విసిరి కొట్టిందో అని అంటుంది. 

వేదవతి షాక్ అయిపోతుంది. వల్లీ చాటుగా ఆ మాటలు వింటుంది. వాళ్లమ్మ కంత్రీది.. జిత్తుల మారి ఏమైనా చేయగలదు.. అని ప్రేమ అంటుంది. వల్లీ వచ్చి ఏంటి ఏంటి.. నేను కడుపుతో లేనా.. నా కడుపులో బిడ్డ  లేదు అంటున్నారా అని అడుగుతుంది. మీ అమ్మ అలాంటి వస్తువులు పంపిస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా అని వేదవతి అంటుంది. వీళ్లకి నా మీద కుళ్లు వీళ్లిద్దరికీ నా కంటే ముందు పెళ్లి అయినా సరే కడుపు పండలేదు కదా.. అందుకే అసూయ పడుతున్నారు అని అంటుంది. ప్రాణం పోయినా మేం అసూయ పడం.. జరిగింది మర్చిపోయి బావకి చెప్పి నిన్ను ఇంటికి తీసుకొచ్చిందే మేం అని అంటారు. మీ అనుమానాలకు బుద్ధి చెప్పి ఈ రోజే మీ నోరు మూయిస్తా.. పదండి.. ఇప్పుడే డాక్టర్ దగ్గరకు వెళ్దాం.. మీ ముందే స్కానింగ్ చేసుకుందాం అని అంటుంది. ఇద్దరినీ ఈడ్చుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది.

వల్లీ ఇద్దరిని తీసుకెళ్లి గతంలో వల్లీ ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. వీళ్లు నన్ను అనుమానిస్తున్నారు.. నేను ప్రెగ్నెంటో కాదో చెప్పండి.. స్కానింగ్ చేసి వీళ్లకి చెప్పండి డాక్టరమ్మా అని వల్లీ అడుగుతుంది. డాక్టర్‌ ఏం వద్దు అనేస్తే బేబీ గ్రోత్‌ కోసం స్కాన్ చేయండి అని నర్మద అంటే ఇప్పుడు చేయడం కుదరదు మీరు వెళ్లండి అని డాక్టర్ అంటుంది. వల్లీ కూడా లేదు ఇప్పుడే స్కానింగ్ చేయండి అని అంటుంది. సరే మీరు బయటకు వెళ్లండి అని డాక్టర్ ప్రేమ, నర్మదని పంపిస్తుంది. తర్వాత వల్లీని డాక్టర్ లాగిపెట్టి కొడుతుంది. వల్లీ షాక్ అయిపోతుంది. ఏమైంది డాక్టరమ్మ ఇలా కొట్టారు అని వల్లీ అడిగితే నీకు మీ అమ్మకి తమాషాలు అయిందా,.. ఆ రోజు నా కూతురి కాపురం నిలబెట్టు అని అడిగితే నీకు కడుపు ఉందని అబద్ధం చెప్పాను,.. ఇప్పుడు నువ్వు ఇచ్చి నిరూపించుకోవాలి స్కాన్ తీయండి అంటే లేని కడుపునకు ఎలా స్కానింగ్ తీయాలి అని అడుగుతుంది. 

వల్లీ షాక్ అయిపోతుంది. నేను కడుపుతో ఉన్నాను అని మా అమ్మ అబద్ధం చెప్పించిందా.. అని బిత్తరపోతుంది. అందరూ తను ప్రెగ్నెంట్ అని తనని ప్రేమగా చూసుకోవడం.. కడుపులో బిడ్డ మీద ఆశలు పెట్టుకోవడం అంతా గుర్తు చేసుకొని చాలా ఏడుస్తుంది. నా కడుపులో బిడ్డ ఉందని చాలా సంబరపడిపోయాను డాక్టర్ గారు.. ఎప్పుడెప్పుడు బిడ్డని పట్టుకుంటానా అని మురిసిపోయాను.. ఇప్పుడు ఇది తట్టుకోలేకపోతున్నా డాక్టర్ గారు.. నా ప్రాణం పోతున్నట్లు ఉంది..అని ఏడుస్తుంది. డాక్టర్ వల్లీని ఓదార్చి మీ అమ్మ మీకు విషయం చెప్పింది అని అనుకున్నాను.. అంటుంది. తల్లిని అవుతున్నా అని సంబర పడిన నేను ఇప్పుడు కడుపుతో లేను అని ఎలా తట్టుకోగలను.. ఇప్పుడు వాళ్లని నిరూపిస్తా అని తీసుకొచ్చాను.. వాళ్లకి ఇప్పుడు నా ముఖం ఎలా చూపించాలి అని అంటుంది.  నర్మద వాళ్లకి నేను అర్థమయ్యేలా చెప్తా అని డాక్టర్ అంటే వాళ్లకి తెలిస్తే తట్టుకోలేరు.. మా అమ్మ చేసిన మోసాలకు చెప్పిన అబద్ధాలకు నా జీవితం నాశనం అయిపోతుంది.. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నా కాపురం కూడా కూలిపోతుంది. మీరే ఏదో ఒకటి చేయండి డాక్టరమ్మా  అని బతిమాలుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget