అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today May5th: సింధూ చెప్పిన అబద్ధానికి ఇంట్లోవాళ్ల రియాక్షన్ ఏంటి.? శ్రీలక్ష్మీకి సింధూపై అనుమానం ఎందుకు వచ్చింది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode May5th:సింధూ చెప్పిన అబద్ధానికి ఇంట్లోవాళ్ల రియాక్షన్ ఏంటి.? శ్రీలక్ష్మీకి సింధూపై అనుమానం ఎందుకు వచ్చింది..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సింధూజాక్షిని ప్రియంవద ఇంటికి తీసుకురాగా అందరూ ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నిస్తారు.గోపీ తీసుుకురాకుండానువ్వు ఎందుకు వెళ్లి తెచ్చావని సూర్యనారాయణ ప్రశ్నిస్తాడు.ఇది ఆడవాళ్లకు సంబంధించిన విషయమని చెప్పడంతో సుకన్య  సింధూ కడుపుతోఉందా అని ప్రశ్నిస్తుంది. దీంతో అందరూ చప్పట్లతో హడావుడి చేసి పదేపదే అడుగుతారు.దీంతో సింధూజాక్షి కూడా అవునని అబద్ధం చెబుతుంది. ఆ మాటలకు అందరూ చాలా సంతోషిస్తారు. వెంటనే సింధూను కూర్చోబెట్టి  ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతారు.సింధూ వాళ్ల అమ్మ చాలా సంతోషపడుతుంది. నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి చేసినందుకు మాఅందిరితో నువ్వు మాట్లాడకపోతుంటే అక్కడ ఎన్నో ఇబ్బందులుపడుతున్నావని అనుకున్నానని....కానీ ఇప్పుడు ఈశుభవార్త తెలిసినతర్వాత నా అనుమానాలన్నీ తొలగిపోయాయని అంటుంది. నువ్వు అక్కడ చాలా సంతోషంగా  ఉన్నావని అర్థమవుతుందని అంటుంది. ఇంత త్వరగా  భర్తతో కలిసిపోయి ఇంత మంచి శుభవార్త చెబుతావని అనుకోలేదని అంటుంది.

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి లక్ష్మీని చూస్తాడా! భుజంగం నుంచి భార్యని కాపాడుకోగలడా!

గోపీతో నీకు పెళ్లి సంబంధం చూసినప్పుడు ఈ ఇంట్లో అందరూ నన్ను ఓ శత్రువులా చూశారని..కానీ నా మనస్సాక్షి మాత్రం నేను తప్పు చేయడం లేదని చెప్పిందని...ఇప్పుడు అదే నిజమని నువ్వు నిరూపించావని సూర్యనారాయణ సింధూజాక్షితో అంటాడు. ఇంతలో సుకన్య కలుగజేసుకుని ఇంతమంచి శుభవార్త ఉంటే గోపీ నిన్ను ఒంటరిగా ఎలా పంపించాడని...కట్టుబట్టలతో పుట్టింటికి ఎవరినైనా పంపిస్తారా అని నిలదీస్తుంది.ఏదీఏమైనా మీ ఆయన పద్ధతి ఏం బాగాలేదని అంటుంది.దీంతో ప్రియంవదకు వాళ్ల వదినపై కోపం వస్తుంది. అలాంటిదేమీలేదని...సింధూను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పొలానికి పురుగుల మందులు ఏవో కొడుతున్నాడని....ఆ పనులన్నీ ముగించుకుని రెండు,మూడరోజుల్లో వచ్చేస్తానని చెప్పాడని చెబుతుంది.  ఇంతలో ఇందిర కలుగజేసుకుని మా మనవరాలు అప్పుడే శుభవార్త తెచ్చిందని....ఇక మీ వంతేఉందని శ్రీలక్ష్మీతో అంటుంది.

Also Read: నిండు మనసులు: గణకి సిద్ధూ మాస్ వార్నింగ్! ప్రేరణని సిద్ధూ క్షమించేశాడా!

ఇంటికి తీసుకువెళ్లి వెంటనే మళ్లీ పంపిస్తానని చెప్పి  ఇప్పటి వరకు కనీసం ఫోన్‌కాల్‌ కూడా చేయలేదని  గోపీ వాళ్ల అమ్మ మండిపడుతుంది.అక్కడ వీళ్లు ఏం చెప్పి చచ్చారో...ఆ పెద్దాయన  ఏం అనుకుంటున్నాడోనని కంగారుపడుతుంది. ఏదీ బిజీగా ఉండి చేసి ఉండరులేనని గోపీ అంటాడు.కనీసం  శ్రీలక్ష్మీ అయినా ఫోన్ చేసి అడగలేదని మండిపడుతుంది.

Also Read: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి కోసం శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన గగన్‌ - గగన్‌ తో ఆటాడుకున్న భూమి

నువ్వు ఫోన్ చేసి విషయం కనుక్కోమని కొడుకుని ఆదేశిస్తుంది. అక్కడ సింధూ ప్రియంవదతో మనం తప్పు చేశామని అంటుంది.ఈ నిజం ఇప్పుడు కాకపోయినా రేపయినా బయటపడుతుందని అంటుంది. ఒకవేళ గోపీకి తాతయ్య ఫోన్ చేసినా.....గోపీ తాతయ్యకు ఫోన్ చేసినా మన బండారం బయటపడుతుందని భయపడుతుంది. నువ్వేం భయపడకని ప్రియంవద సర్దిచెబుతుంది. నిజం చెప్పేద్దామని అంటే....విడాకులు తీసుకోవాడనికి సిద్ధమయ్యావని తెలిస్తే ముందు తాతయ్య నిన్నే చంపేస్తారని ప్రియంవద సింధూను హెచ్చరిస్తుంది. ఇంతలో గోపీ ఫోన్ చేసినా సింధూ లిప్ట్ చేయకపోవడంతో గోపీ శ్రీలక్ష్మీకి ఫోన్ చేస్తాడు. లక్ష్మీ వెంటనే కంగ్రాట్స్‌ చెప్పడంతో అయితే ఇక్కడ జరిగిన విషయం ఇంట్లో చెప్పలేదని గోపీకి అర్థమవుతుంది. మీ వదినకు ఫోన్ ఇస్తావా అని చెప్పగా...లక్ష్మీ సింధూ దగ్గరకు వెళ్తుంది. నాకు నచ్చినప్పుడు నేను మాట్లాడతానని అప్పటి వరకు నన్ను విసిగించొద్దని అంటుంది. దీంతో లక్ష్మీ భయటకు వెళ్లిపోతుంది.

Also Read: చిన్ని సీరియల్: చిన్ని కడుపులో కావేరి పుడుతుందా! దేవాకి ఊహించని షాక్!

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Embed widget