Lakshimi Raave Maa Intiki Serial Today May1st: సింధూజాక్షి పురుగుల మందు ఎందుకు తాగింది.? ఈ విషయం గోపీ ఎవరికి చెప్పాడు..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode May1st:సింధూజాక్షి పురుగుల మందు ఎందుకు తాగింది.? ఈ విషయం గోపీ ఎవరికి చెప్పాడు..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: అడవి టూర్ అయిపోవడంతో లక్ష్మీ,మ్యాడీ ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. తాము అక్కడ పోటీలో గెలిచిన బహుమతిని లక్ష్మీ పెద్దయ్యకు ఇస్తుంది. మీరు ఇద్దరూ ఎప్పుడూ ఇలా రాధాకృష్ణుల్లా కలిసి ఉండాలని సూర్యనారాయణ చెబుతాడు.మీరిద్దరూ కలిసి పనిచేస్తే ఎందులో అయినా విజయం సాధిస్తారని అంటాడు. ఇంతలో ప్రియంవద మ్యాడీని చూస్తూ...వీడేంటి ఇంతకు ముందు ఆ ఎర్రబస్సును చూస్తే కస్సుబుస్సుమనేవాడు..ఇప్పుడు అతుక్కునిపోతున్నాడని అనుకుంటుంది. పైగా దానికి అన్ని విషయాల్లోనూ సాయం చేస్తున్నాడని మండిపడుతుంది.
డ్యాన్స్ వేయడం, అడవికి తీసుకెళ్లడం చూస్తుంటే...వీడు ఆ లక్ష్మీకి దగ్గర అయ్యేలా ఉన్నాడని అనుకుంటుంది. అయినా ఎవరు ఎలా పోతే నాకెందుకులే ముందు శ్రీలక్ష్మీ దగ్గర నుంచి మా ఆయన ఎక్కడ ఉన్నాడోనన్న సీక్రెట్ తెలుసుకోవాలని అనుకుంటుంది. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోగా...మ్యాడీ కూడా తాను లక్ష్మీకి దగ్గరవుతున్నానా అని అనుకుంటాడు. ప్రతివిషయంలో నాకు తెలియకుండా సాయం చేస్తున్నాను అని ఫీలవుతాడు. కొంపదీసి లక్ష్మీ చెప్పినట్లు నిజంగానే తనపై ప్రేమ పెంచుకుంటున్నానా అని ఆలోచిస్తాడు. అదే జరిగితే నా జీవితం నాశనం అయినట్లేనని రేపటి నుంచి ఇంతకు ముందు ఉన్నట్లే కఠినంగా ఉండాలని అనుకుంటాడు.
Also Read: మనోజ్ నుంచి 25 లక్షలు తీసుకుని దొంగ జంట పరార్! ఊహల్లో తేలుతున్న ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు మే1 ఎపిసోడ్
సింధూ కడుపుతో ఉన్నదనుకుని గోపీ వాళ్ల అమ్మ తనకు పాలు తీసుకుని వచ్చి ఇస్తుంది.ఇంట్లో నువ్వు ఏ పనీ చేయవద్దని...ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవమని చెబుతుంది. నువ్వు చేయాల్సింది ఒక్కటేనని నాకు మనవడో,మనవరాలినో ఇస్తే చాలని అంటుంది. ఆమె చెప్పే మాటలకు సింధూజాక్షికి కోపం వస్తుంటుంది.ఇంతలో గోపీ అక్కడికి వచ్చి పొలానికి మందు కొట్టాలని చెప్పాను కదా మందు డబ్బా ఎక్కడ పెట్టావని అడుగుతుంది.ఇదిగో ఇప్పుడే తీసుకొస్తానని వాళ్లఅమ్మ లోపలికి వెళ్తుంది. దీంతో సింధూ నేను చెప్పిన పని ఏం చేశావని నిలదీస్తుంది.నాకు కొంచెం టైం కావాలని చెప్పాను కదా అని అంటాడు. నీకు ఇచ్చిన టైం ఆల్రెడీ అయిపోయిందని...నువ్వు మాటమీద నిలబడకపోయినా నేను మాత్రం నిలబడతానని అంటుంది.గట్టిగా అరవకండీ అమ్మ వింటుందని గోపీ భయపడతాడు. అప్పుడే వాళ్ల అమ్మ పురుగులమందు డబ్బా తీసుకుని వస్తుంది.అది ఆమె చేతిలో నుంచి సింధూ తీసుకుంటుంది.నీకు మందు డబ్బాతో పనేంటమ్మా...దాని వాసన చూసినా కడుపులో ఉన్న పిల్లాడికి ప్రమాదమని అంటుంది. దీంతో సింధూ పిల్లాడులేడు పీసు లేదని చెప్పి ఆ మందు డబ్బా పట్టుకుని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుటుంది.
Also Read: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణకి బట్టలు పెట్టిన విజయానంద్! కన్నింగ్ మామ గణ, రాజశేఖరం మధ్య పుల్లలు పెట్టేశాడా!
గోపీ, వాళ్ల అమ్మ భయపడి తలుపులు బాదినా సింధూ తీయదు. వెంటనే పురుగుల మందు తాగి కిందపడిపోతుంది. దీంతో గోపీ గట్టిగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వస్తాడు. వెంటనే సింధూను తీసుకుని ఆస్పత్రికి వెళ్తాడు. అక్కడ ఆమెను ఐసీయూలో చేర్చుతారు.అసలు ఏం జరిగిందని గోపిని వాళ్ల అమ్మ నిలదీస్తుంది. మీకు ఏమైనా గొడవ జరిగిందా అని అంటుంది.అలాంటిదేమీ లేదని...మేం హనీమూన్‌కు వెళ్లాం కదా అక్కడ మరో రెండురోజులు ఉందామని సింధూఅన్నదని...కానీ నువ్వు ఫోన్ చేశావని చెప్పి నేనే తీసుకొచ్చానని గోపి అబద్ధం చెబుతాడు.
Also Read: చిన్ని సీరియల్: కావేరి కేసు రీ ఓపెన్ చేయిస్తున్న మ్యాడీ! చెమటలు పట్టేసిన దేవా! సీసాలో ఆత్మ!
అందుకే పురుగుల మందుతాగినట్లు ఉందని అంటాడు.ఇంత చిన్న విషయానికి పురుగుల మందు తాగుతారా అని ఏడుస్తుంది.వెంటనే ఈ విషయం వాళ్ల ఇంట్లో చెప్పమని చెబుతుంది.ఇప్పుడు వాళ్లకు తెలిస్తే చాలా ప్రమాదమని గోపీ అంటాడు.ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు ఇంకా ప్రమాదమని...ఆ పెద్దాయన నిన్ను బతకనివ్వడని అంటుంది.వెంటనే గోపీ సూర్యనారాయణకు ఫోన్ చేయగా...ఆఫోన్ ప్రియంవద ఎత్తుతుంది.సింధూ పురుగుల మందు తాగిందని గోపీ చెప్పగా..షాక్‌కు గురవుతుంది.ఇప్పుడు ఈవిషయం నాన్నకు చెబితే వెంటనే వెళ్లి సింధూమీద గొడవపడతాడని అనుకుంటుంది. తానే వెళ్లి ఆ గోపిని దాని జీవితం నుంచి తన్ని తరిమేసి వస్తానని బయలుదేరుతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















