అన్వేషించండి

Nindu Manasulu Serial Today may 5th: నిండు మనసులు: గణకి సిద్ధూ మాస్ వార్నింగ్! ప్రేరణని సిద్ధూ క్షమించేశాడా!

Nindu Manasulu Serial Today may 5th ప్రేరణ సిద్ధూలు గణకి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూలను డీసీపీ అరెస్ట్ చేస్తానని చెప్పి తీసుకెళ్తాడు. విజయానంద్ మంజుతో మన పరువు మొత్తం పోయింది.. కొత్తగా పెళ్లి అయిన జంటని తీసుకెళ్లి పరువు తీసేశారు.. మొత్తం ప్రేరణ వల్లే అని అంటాడు. ఏం అయింటుందని మంజుల అంటే గతంలో ప్రేరణ, సిద్ధూలు భార్యాభర్తలుగా సంతకాలు పెట్టారు కదా. ఆ విషయంలో అయింటుందని అంటాడు. వాళ్ల సమస్యని వాళ్లే సరిదిద్దుకుంటారు అని మంజుల అంటుంది. విషయం తెలిసే వరకు మనం ఇలా అనుకోవడం తప్పు.. అప్పుడు వాళ్లు చేసింది తప్పు అయినా ఇప్పుడు భార్యాభర్తలు అని ఇందిర అంటుంది.

విజయానంద్ మనసులో డీసీపీ సిద్ధూ, ప్రేరణల్ని అరెస్ట్ చేసి ఇద్దరినీ ఇబ్బంది పెడతాడని సంతోషపడతాడు. డీసీపీ ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడుతాడు. ప్రేరణ చాలా టెన్షన్ పడుతుంటే డీసీపీ ఇద్దరితో పూజలోకి వచ్చి సడెన్‌గా షాక్ ఇచ్చాను అనుకున్నారా.. మీరు నాకు ఇచ్చిన షాక్ ముందు ఇదేం పెద్ద షాక్ కాదు.. తప్పు చేసిన వాళ్ల తాట తీయడానికి నేను ఈ జాబ్ ఎంచుకున్నాను.,. ఆ రోజు మీరు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా.. పెళ్లి కాకుండా అయింది అని నన్ను నమ్మించడం ఎంత పెద్ద తప్పో తెలుసా.. అని అడుగుతాడు. 

ప్రేరణ చాలా టెన్షన్ పడుతుంది. దాంతో డీసీపీ ఏం భయపడొద్దు సిద్ధూ నాకు జరిగింది అంతా చెప్పాడు.. ఆరోజు నాకు మీరు అబద్ధమే చెప్పారు.. కానీ ఒకమ్మాయిని కాపాడటానికి సిద్ధూ తోడుగా దొరికాడు అని అర్థమైంది.. సరైన మగాడు నీకు భర్తగా దొరికాడు.. నువ్వు ధైర్యంగా నిజం చెప్పడం నాకు నచ్చింది సిద్ధూ.. అప్పుడు పెళ్లి అయింది అని చెప్పిన అబద్ధాన్ని ఇప్పుడు నిజం చేశారు అందుకే నువ్వు చెప్పిన వెంటనే ఈ వ్రతానికి వచ్చాను. వ్రతం ఆపడానికి చాలా మంది ప్రయత్నించారు,.. నువ్వు నన్ను పిలిచి మంచి పని చేశావు.. లేదంటే మీ పూజ డిస్ట్రబ్ అయ్యేది.. నేను చేయాల్సిన సాయం చేశాను.. మీ గోల్స్ మాత్రం మర్చిపోకండి..మీలో మంచి టాలెంట్ ఉంది.. సివిల్స్ పూర్తి చేయండి.. మీ ఇద్దరి దారులు వేరైనా మీ గమ్యం ఒక్కటే అని డీసీపీ అంటే మా ఇద్దరి దారులు ఒకటే సార్ అని ప్రేరణ అంటుంది. డీసీపీ ఇద్దరికీ ఆల్‌దిబెస్ట్ చెప్పి వెళ్లిపోతాడు.

మరోవైపు గణ చాలా ఆవేశంగా ఉంటాడు. ఏమైందిరా మీ నాన్న ఏడి అని అడుగుతుంది. వస్తారమ్మా.. వస్తారు.. కాలి నడకన మొత్తం హైదరాబాబ్ మొత్తం తిరిగేసి వస్తారు అని అంటాడు. ఇంతలో రాజశేఖరం రావడంతో అసలు నువ్వు ఏం అనుకుంటున్నావ్,, ఏం చేయాలి అనుకుంటున్నావ్,.. అని అడుగుతాడు. ఏం అనుకోవడం లేదు అని రాజశేఖరం అంటాడు. అక్కడికి ఎందుకు వెళ్లావ్,.. నీ కూతురు అల్లుడుని ఆశీర్వదించడానికి వెళ్లావా.. అసలు ఏం అనుకుంటున్నావ్.. నీ ప్లాన్ ఏంటి చెప్పు అని గణ అంటాడు. దానికి రాజశేఖరం ప్లాన్ లేదు పాడు లేదు చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అనుకుంటున్నా అని అంటాడు. విన్నావా అమ్మా అయితే ఏం చేస్తావ్.. వాళ్లని తెచ్చి అందరి ముందు నీ కూతురు నీ భార్య అని చెప్తావా ఏంటి అని అడుగుతాడు. గణ ఆవేశ పడుతుంటే ఈశ్వరి ఆపుతుంది. ఈయన్ను చూస్తుంటే నా రక్తం మరిగిపోతుందమ్మా.. ఇక్కడికి ఇక్కడే కాల్చేయాలి అని ఉంది..ఇంకోసారి వాళ్లని కలవాలి అనుకున్నా.. దూరం నుంచి చూడాలి అనుకున్నా అక్కడికక్కడే చంపేస్తా జాగ్రత్తగా ఉండు ఓకేనా అని అడుగుతాడు. రాజశేఖరం సమాధానం చెప్పకపోవడంతో గణ గాలిలో కాల్చుతాడు. నువ్వు చావుకి అయినా రెడీ కానీ నేను చెప్పింది చేయవు ఇక్కడ బులెట్ మిస్ అయింది కానీ ఈసారి మిస్ అవ్వదు.. ఈ సారి బులెట్ వాళ్లకి తగులుతుంది అని వార్నింగ్ ఇస్తాడు.

ప్రేరణ సిద్ధూతో ఇదంతా నా మీద ప్రేమతో చేశావన్నమాట.. జరిగింది అంతా మర్చిపోయి నన్ను క్షమించేశావ్ అన్న మాట ఇక నుంచి మనం సంతోషంగా ఉండొచ్చు అంటుంది. ఎవరు చెప్పారు అని సిద్ధూ కోప్పడతాడు. ఇది నీ కోసం చేయలేదు అంటే నువ్వు చెప్పకపోయినా నీ ప్రేమ తెలిసిపోతుంది సిద్ధూ అని ప్రేరణ అంటుంది. వ్రతం ప్రశాంతంగా చేస్తే అమ్మ హ్యాపీగా ఉంటుందని ఇలా చేశా అంటాడు. నువ్వు చేసే పనుల వల్ల మా అమ్మ బాధ పడకూడదు.. ఇంకా ఇలాంటివి ఏమైనా చేస్తే ఊరుకోను అని సిద్ధూ అంటే అత్తయ్య తప్ప మిగతా వాళ్లు ఎవరు బాధ పడినా నాకు బాధ లేదు అని ప్రేరణ అంటుంది. 

సిద్ధూ, ప్రేరణ మాట్లాడుతూ ఉంటే అక్కడికి గణ వస్తాడు. అంటే మీరు అక్కడికీ డీసీపీని పిలిపించి వ్రతం చేసుకొని నాతో అక్షింతలు వేయించుకున్నారన్న మాట. ఆయన మిమల్ని ఎలా సాయం చేస్తారు. ఆయనకు మీకు ఎలా సాయం చేస్తారు అని అంటాడు. అసలు ఏం జరిగింది అని ఆయనకు మొత్తం చెప్పేశాం.. ఏ గుంట నక్కలు మాకు ఏం చేయలేవు అని సిద్ధూ అంటాడు. మీరు మామూలోళ్లు కాదురా.. ఆయనకు మీరు చేసిన మోసానికి లేనిపోని కేసులు వేస్తాడు అనుకున్నా కానీ భలే తప్పించుకున్నారురా.. నేను మీకు ఫ్యాన్ అయిపోయాను అని అంటాడు. డీసీపీ రాకపోయి ఉంటే కథ వేరేలా ఉండేది మీకు నిద్ర లేకుండా చేసేవాడిని అని గణ అంటే ఏం చేస్తావురా.. ఏం చేయలేవు మీ నాన్న లేకపోతే మా వ్రతం జరగదు అనుకున్నావా అని సిద్ధూ అంటాడు. ఇక్కడ నుంచి ఎవరో దొంగతనంగా పిలిచారు అని గణ అంటాడు. మేం ఎందుకు పిలుస్తాం అని ప్రేరణ అంటే కూతురే వద్దుని వెళ్లిపోయిన ఆయనకు మాతో సంబంధం ఏంట్రా.. మీ నాన్న రావడానికి ఎవరు కారణమో అది ఆలోచించు.. దమ్ముంటే నిజం తెలుసుకొని మాట్లాడు.. మాలో మాకు వంద ఉండొచ్చు అలా అని మా కుటుంబాన్ని టచ్ చేయాలని చూస్తే నేను ఊరుకోను.. నన్ను తట్టుకోలేవు అని సిద్ధూ అంటాడు. మా నాన్నని అడ్డం పెట్టుకొని మా పరువు తీయాలని చూసినా.. అడ్డమైనా వాళ్లని మాతో కలపాలని చూసినా ఊరుకోను అని గణ అంటాడు. పోరా నీతో మాకు ఏంటి.. కుటుంబాన్ని కాపాడుకోలేని అంత అసమర్దులు లేరు ఎవరూ ఇక్కడ అని సిద్ధూ అంటాడు. మా ఆయన ఇచ్చిన వార్నింగే నేను ఇస్తా జాగ్రత్త అని ప్రేరణ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget