అన్వేషించండి

Jagadhatri Serial Today May 5th: కౌషికి,నిషికను కొట్టి శ్రీవల్లిని రేప్‌ చేయబోయిందెవరు..? తల్లికి సంబంధించిన సాక్ష్యాలు గురించి కేదార్ ఏం తెలుసుకున్నాడు...?

Jagadhatri Serial Today Episode May5th: కౌషికి,నిషికను కొట్టి శ్రీవల్లిని రేప్‌ చేయబోయిందెవరు..? తల్లికి సంబంధించిన సాక్ష్యాలు గురించి కేదార్ ఏం తెలుసుకున్నాడు...?

Jagadhatri Serial Today Episode: శివశంకర్‌ను యువరాజు చంపబోతుండగా....కేదార్‌ అడ్డుకుని బయటకు తీసుకొచ్చి కొడతాడు. యువరాజు కూడా కావాలనే కేదార్‌ను రెచ్చగొట్టి మరిన్ని దెబ్బలు తింటాడు.ఇదంతా యువరాజు కావాలనే చేస్తున్నాడని జగధాత్రి చెబుతుండగానే శివశంకర్‌ అక్కడికి వచ్చి నా మనవడినే కొడతావా అంటూ గన్‌గురిపెట్టి కేదార్‌ను మహల్‌ నుంచి బయటకు వెళ్లిపొమ్మని హెచ్చరిస్తాడు. దీంతో జగధాత్రి తన భర్తన తీసుకుని బయటకు వెళ్లిపోతుంది. ఇంతలో శివశంకర్‌ ఫోన్ చేయడంతో విశ్రాంత ఎస్‌ఐ మహల్‌కు వస్తాడు. అప్పుడు యువరాజు మా అమ్మానాన్నలకు సంబంధించిన ఏదో సాక్ష్యం మీ దగ్గర ఉందని తాతయ్య చెప్పాడని అదేంటని అడిగితే....మీ అమ్మానాన్నల ఫొటోతోపాటు అరెస్ట్‌కు సంబంధించిన సాక్ష్యం పాత పోలీసుస్టేషన్‌ రికార్డుల్లోఉందని...నేను వెంటనే మీకు తెచ్చి ఇస్తానని ఆయన చెప్పి వెళ్లిపోతాడు.

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి లక్ష్మీని చూస్తాడా! భుజంగం నుంచి భార్యని కాపాడుకోగలడా!

మహల్‌ బయటే ఉన్న జగధాత్రి, కేదార్‌లు ఆ విశ్రాంత ఎస్‌ఐను ఆపి విషయం అడుగుతారు. అసలు మీరు ఎవరని ఆయన నిలదీయగా...జేడీ ఐడీకార్డు తీసి చూపిస్తుంది.దీంతో ఆయన కేదార్ వాళ్ల నాన్న గురించిన నిజం  చెబుతాడు. సరిగ్గా పాతికేళ్ల క్రితం...శివశంకర్‌గారి కూతురు పట్నంలో ఎవరినో ప్రేమించిందని ఆవిషయం పెద్దాయనకు ఇష్టంలేదని చెబుతాడు.భర్తను తీసుకుని ఇంటికి వచ్చిన ఆమెను శివశంకర్‌గారు ఇంట్లోకిరానివ్వలేదని చెబుతాడు.అప్పుడు వారు తిరిగి వెళ్లిపోతుండగా  కారు చెడిపోవడంతో దగ్గరలో ఉన్నలాడ్జీకి వెళ్లగా....పోలీసులు రైడ్‌ చేసి పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారని చెబుతాడు.

Also Read: నిండు మనసులు: గణకి సిద్ధూ మాస్ వార్నింగ్! ప్రేరణని సిద్ధూ క్షమించేశాడా!

నేను వచ్చేసరికి ఎఫ్‌ఐఆర్ రాయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శివశంకర్‌గారు  అక్కడికి వచ్చి కూతురిని విడిపించారని వివరిస్తాడు.అప్పుడు వాళ్లిద్దరూ భార్యాభర్తలుగా రాసిచ్చిన కంప్లైంట్‌తోపాటు మేం వాళ్ల ముగ్గురిని తీసిన ఫొటోలు స్టేషన్‌ రికార్డుల్లో ఉన్నాయని చెప్పి వెళ్లిపోతాడు. ఇదంతా విన్న యువరాజు బయటకు వచ్చి కేదార్‌ను బెదిరించాలని చూడగా....ఇప్పుడు వచ్చిన విశ్రాంత ఎస్‌ఐకి నువ్వే కేదార్‌ అని తెలుసని....ఈసమయంలో తాతయ్యకు ఏం జరిగినా నిన్నే ముందు అనుమానిస్తారు కాబట్టి నువ్వు శివశంకర్‌ను ఏం చేయలేవని జగధాత్రి అంటుంది.

Also Read: చిన్ని సీరియల్: చిన్ని కడుపులో కావేరి పుడుతుందా! దేవాకి ఊహించని షాక్!

కౌషికి ఇంట్లోకి చొరబడిన అవినాష్‌ అందరినీ కొట్టి శ్రీవల్లిని రేప్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు.అప్పుడే కౌషికి గ్యాస్ లీక్‌ చేసి ఇల్లు మొత్తం తగలబెట్టేస్తానని బెదిరించడంతో అవినాష్‌ బయటకు వచ్చి కౌషికికి వార్నింగ్  ఇస్తాడు.అసలు ఎందుకు ఇదంతాచేస్తున్నారని వైజయంతి అడగ్గా...జగధాత్రి, కేదార్‌ కోసమేనని చెప్పి వెళ్లిపోతారు. దీంతో జగధాత్రి,కేదార్‌పై ఇంట్లో వాళ్లంతా కోపంతో రగిలిపోతుంటారు.అప్పుడే మహల్‌ నుంచి ఇంటికి వచ్చిన కేదార్‌, జగధాత్రి...ఇంట్లో అందరూ అదోలా ఉండటంతో ఏం జరిగిందని అడుగుతుంది.

Also Read: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి కోసం శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన గగన్‌ - గగన్‌ తో ఆటాడుకున్న భూమి

దీంతో కోపంతో నిషిక వాళ్ల అక్క చెంపలు పగులగొడుతుంది. పాపం కదా అని ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే...ఇప్పుడు మా ప్రాణాల మీదకే తెచ్చారని వైజయంతి మండిపడుతుంది. అసలు  ఏం జరిగిందని ధాత్రి కంగారుపడి అడుగుతుంది. మీ  అందరినీ కొట్టిందెవరని ప్రశ్నిస్తుంది.మీరు బజారులో గొడవలు పెట్టుకుని వస్తే....వాళ్లు ఇంటిమీదకు వచ్చి అనరాని మాటలు అన్నారని నిషిక  అంటుంది. వాళ్లు చేసిన పని తలుచుకుంటేనే చచ్చిపోవాలని అనిపిస్తోందని అంటుంది. అసలు ఎవరిపై మీరు కేసు పెట్టారని నిషిక అడుగుతుంది. జగధాత్రికి వచ్చింది అవినాష్‌ అని అర్థమవుతుంది. అసలు వాళ్లు ఎవరని....మీకు వాళ్లకు గొడవలు ఏంటని కౌషికి జగధాత్రిని ప్రశ్నిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget