అన్వేషించండి

Jagadhatri Serial Today May 1st: కేదార్‌ను శివశంకర్‌ కలవకుండా ఏం చేశాడు..? యువరాజు వలలో శివశంకర్‌ ఎలా చిక్కాడు..?

Jagadhatri Serial Today Episode May1st: కేదార్‌ను శివశంకర్‌ కలవకుండా ఏం చేశాడు..? యువరాజు వలలో శివశంకర్‌ ఎలా చిక్కాడు..?

Jagadhatri Serial Today Episode: సుధాకర్‌కు శివశంకర్‌ ఫోన్ చేసి బెదిరిస్తాడు. పాతికేళ్ల క్రితం తన కూతురుని మోసం చేశావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం నా మనవడిని అయినా దగ్గరకు తీసుకుని నీ కొడుకులా పెంచుకున్నావా లేదా అని నిలదీస్తాడు.నేను నీదగ్గరకే వస్తున్నానని అన్ని లెక్కలు తేలుస్తానని హెచ్చరిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన యువరాజు ఈ మాటలన్నీ విని ఆ ముసలాడిని చంపేస్తానంటూ భయలుదేరతాడు. సుధాకర్‌ కొడుకుని ఆపుతాడు.ఎవడో వచ్చి నా  ఆస్తిని తన్నుకునిపోతానంటే చూస్తూ ఊరుకోనని అంటాడు.ఈ వజ్రపాటి సుధాకర్‌కు  ఒక్కడే కొడుకు ఉండాలని...వాడు ఈ యువరాజు అయ్యిఉండాలని అంటాడు. అలాకాకుండా మధ్యలో ఎవరైనా దూరితే వాళ్లను పక్కకు తప్పిస్తానని చెబుతాడు. దీంతో సుధాకర్‌ కొడుకుని ఆపి నేను ఈ వ్యవహారం చూసుకుంటానని ఆ శివశంకర్‌ ఇంటికి రాకుండా  అడ్డుకుంటానని చెప్పడంతో యువరాజు వెళ్లిపోతాడు. నాన్న ప్రతిదానికి భయపడి వ్యవహారం ఇంతదూరం తెచ్చాడని నేనే వెళ్లి విషయం తేల్చుకుంటానని గన్‌ తీసుకుని బయలుదేరతాడు.

యువరాజు గన్‌తీసుకుని ఆవేశంగా వెళ్తుండటంతో నిషిక,వైజయంతి ఆపుతారు.ఎందుకు ఇప్పుడు గన్‌ తీశావని నిలదీస్తారు.ఆ కేదార్‌గాడి తాత వచ్చాడని...నాన్నకు ఫోన్ చేసి బెదిరించాడని వెళ్లి వాడిని లేపేస్తానని చెబుతాడు.అప్పుడు నిషిక భర్తను ఆపి...నువ్వు చెప్పినది చూస్తే ఆ ముసలాయనకు మనవడు ఎలా ఉంటాడో కూడా తెలియదని...అలాంటప్పుడు నువ్వే కేదార్‌లా వెళ్లి కలిసి ఇంటికి రాకుండా చూసుకోవచ్చుకదా అని సలహా ఇస్తుంది. అతని వద్ద ఉన్న ఆధారాలు నాశనం చేసేస్తే సరిపోతుంది కదా అని అంటుంది. వైజయంతి కూడా ఈ హత్యలు వద్దని కొడుకుకి చెప్పడంతో యువరాజు సరేనంటూ వెళ్లిపోతాడు. వైజయంతి, నిషిక  ఇద్దరూ సుధాకర్‌ వద్దకు వచ్చి....యువరాజు వెళ్లి తానే  కేదార్‌ అని ఆ మసులాడికి చెప్పబోతున్నాడని నువ్వు మధ్యలో కల్పించుకుని ఏదైనా మాట్లాడితే నామీద ఒట్టు అంటూ వైజయంతి సుధాకర్‌తో ఒట్టు వేయించుకుంటుంది.

Also Read: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణకి బట్టలు పెట్టిన విజయానంద్! కన్నింగ్ మామ గణ, రాజశేఖరం మధ్య పుల్లలు పెట్టేశాడా!

బయట నుంచి ఇంటికి వచ్చిన జగధాత్రి, కేదార్‌ సుధాకర్ కంగారు చూసి ఏమైందని అడుగుతారు.సుధాకర్‌ నిజం చెప్పబోతుండగా నిషిక,వైజయంతి అడ్డుకుని వాళ్లను వంటచేయమని చెప్పి లోపలికి పంపిస్తారు. దీంతో కేదార్‌, ధాత్రికి అనుమానం వస్తుంది.నాన్న ఏదో చెప్పబోతుంటే నిషిక వాళ్లు అడ్డుకున్నారని అంటాడు. నాకు కూడా  అదే అనిపిస్తోందని జగధాత్రి అంటుంది. ఈలోగా యువరాజు కేదార్ వాళ్ల తాతయ్యను కలిసి తానే కేదార్‌ అని చెప్పి నమ్మిస్తాడు.అందుకు అవసరమైన ఫొటోలు, ఆధార్‌కార్డులు చూపిస్తాడు. దీంతో శివశంకర్‌ యువరాజే కేదార్‌ అని అనుకుంటాడు. మీ నాన్న నిన్ను దగ్గరకు తీసుకున్నాడా అని అడిగితే ....నన్న  ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఆ యువరాజు కొట్టి తరిమేశాడని చెబుతాడు.

Also Read: మనోజ్ నుంచి 25 లక్షలు తీసుకుని దొంగ జంట పరార్! ఊహల్లో తేలుతున్న ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు మే1 ఎపిసోడ్

 అయితే నేను వస్తాను పదా అని చెప్పగా..ఇప్పుడు వద్దులే తాతయ్య అనిఅంటాడు.అయినా సరే శివశంకర్‌ వినకుండా వెళ్దామని చెబుతాడు.దీంతో యువరాజు ఇంటికి ఫోన్ చేసి మేం వస్తున్నామని చెబుతారు. కేదార్,జగధాత్రి ఇంట్లోనే ఉండటంతో వాళ్లను ఎలాగైనా బయటకు పంపించేందుకు నిషిక నానా తంటాలు పడుతుంది. సరదాగా బయటకు వెళ్లి లంచ్‌ చేసి రమ్మని చెబుతుంది.ఇప్పుడు బయటకు వెళ్లి తినే మూడ్ లేదని కేదార్ అంటాడు.అయితే సరదాగా షాపింగ్‌కు వెళ్లండని కార్డు ఇస్తుంది. వీళ్లేదో నాటకం ఆడుతున్నారని గ్రహించి జగధాత్రి ఇప్పుడు బయటకు వెళ్లమని తెగేసి చెబుతుంది.

Also Read: చిన్ని సీరియల్: కావేరి కేసు రీ ఓపెన్ చేయిస్తున్న మ్యాడీ! చెమటలు పట్టేసిన దేవా! సీసాలో ఆత్మ!

యువరాజును తీసుకుని శివశంకర్‌ ఇంటికి వస్తాడు.నేను లోపలికివస్తే ఆ యువరాజు  నన్ను కొడతాడని మీరు వెళ్లండని అబద్ధం చెప్పి యువరాజు శివశంకర్‌ను లోపలికి పంపిస్తాడు. అప్పుడు శివశంకర్‌ వచ్చి సుధాకర్‌తోమాట్లాడుతుండగా తానే తన తాతయ్యని కేదార్ తెలుసుకుంటాడు.దగ్గరకు వెళితే అతను యువరాజు అనుకుని తోసివేస్తాడు.నీ నాటకాలు నాకు తెలుసునని...నా మనవడు కేదార్ అన్ని చెప్పాడని చెబుతాడు.తానే కేదార్‌నని చెబుతున్నా శివశంకర్‌ వినడు.   

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని తోసేసిన మహా! సహస్రని మిస్ లీడ్ చేసిన అంబిక
కలవారి కోడకలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని తోసేసిన మహా! సహస్రని మిస్ లీడ్ చేసిన అంబిక
Godavari Serial Today November 12th: 'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
Nindu Manasulu Serial Today November 12th: నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 12:అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?
నువ్వులేక నేను లేను: అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget