అన్వేషించండి

Podharillu Serial Today May 6th: రిసార్ట్‌లో కలిసి మందుతాగుతూ ముచ్చటించుకున్న నారాయణ, ప్రతాప్‌.....చుట్టతో చుట్టరికం కలుపుకున్న ఇరువురు

Podharillu Serial Today Episode May 6th:రిసార్ట్‌లో కలిసి మందుతాగుతూ ముచ్చటించుకున్న నారాయణ, ప్రతాప్‌.....చుట్టతో చుట్టరికం కలుపుకున్న ఇరువురు

Podharillu Serial Today Episode: చక్రి, మహాలక్ష్మీతోపాటు కుటుంబాన్ని తీసుకుని రిసార్ట్‌కు వస్తాడు. అక్కడికి  వచ్చిన తర్వాత చక్రి పీజులు ఎగిరిపోతాయి. రిసార్ట్‌ అంటే ఏదో చిన్నది అనుకున్నాను కానీ...ఇంత పెద్దగా ఉందేంటని అనుకుంటాడు. ఇక్కడ ఉండాలంటే రోజుకు ఎంత అవుతుందేమోననని భయపడిపోతుంటాడు. ఇంతలో కేశవ్‌ కల్పించుకుని ఏంటిరా చూస్తున్నావు...వెళ్లి రూమ్‌లు బుక్‌చేయమని అంటాడు. మహా అయితే రోజుకు పాతికవేలు అవుతుందిఅంతేగా అని అంటాడు. ఆ మాటలు విన్న చక్రికి ఏం చేయాలో అర్థంగాక అయోమయంలో ఉంటాడు.ఇంతలో మహా కల్పించుకుని ఆమాత్రం ఇవ్వలేడనుకున్నావా...వెళ్లేప్పుడు టిప్పుగా మరో 5వేలు ఎక్స్‌ట్రా కూడా ఇస్తాడని అంటుంది. చక్రి భయపడుతుంటే...మాధవ్‌ వాళ్లకు తెలియకుండా తన దగ్గర ఉన్న డ‌బ్బులు చక్రికి ఇచ్చి రూమ్‌లు తీసుకోమని చెప్పి పంపిస్తాడు.
                      అదే రిసార్ట్‌కు అంతకన్నా ముందే మహాలక్ష్మీ తండ్రి కుటుంబంతో సహా వస్తుంది.అక్కడికి వచ్చిన తర్వాత  కూడా ప్రతాప్‌ మహా గురించే ఆలోచిస్తుంటాడు. నీ మనసు బాగాలేదనే కదా ఇక్కడికి తీసుకొచ్చానని ఇప్పుడు కూడా నువ్వు బాధపడుతుంటే అర్థం లేదని ఆదిఅంటాడు. మనల్ని వద్దనుకుని వెళ్లిపోయిన దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలని అంటాడు. తెలిసినవాళ్లు,తెలియని వాళ్లంతా నీ కూతురు  లేచిపోయిందంట కదా అని అడుగుతుంటే...తట్టుకోలేకపోతున్నానని ప్రతాప్‌ అంటాడు. అందుకే కదా దాని గాలి కూడా సోకనంత దూరంగా ఈ రిసార్ట్‌కు వచ్చామని ఇక్కడ హాయిగా నువ్వు రెస్ట్‌ తీసుకోమని తండ్రికి ఆది చెబుతాడు.
                      మహా కన్నాతోపాటు అందరితోనూ  ఫొటోలు దిగుతూ...తనను మాత్రం కనీసం పక్కకు కూడా రానివ్వకపోవడంతో చక్రి బాధపడుతుంటాడు.ఇంతలో రూమ్‌తీసుకోవడానికి వెళ్లగా...అక్కడ ఆధార్‌కార్డు అడగడంతో ఇదే మంచిఛాన్స్‌ అనుకుని మహా దగ్గరకు వెళ్లి ఆధార్‌కార్డు లేకుండా నీకు రూమ్‌ ఇవ్వడం కుదరదంటున్నారని చెబుతాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని అంటే....మనమిద్దరం భార్యాభర్తలమని చెబితే నా పేరుమీద రూమ్‌ ఇస్తారంటా అని అంటాడు. అలా అని వాళ్లకు రుజువు చూపించాలని చెబుతాడు. కాబట్టి మీరు నాతో భార్యగా ఫొటో దిగితే అది చూపించి రూమ్ తీసుకుంటానని అంటాడు. ఇదంతా నీ ప్లాన్‌ కదా అన్నయ్య అని కన్నా అంటాడు. నువ్వు నోరుమూసుకుని ఉండరా అనిచెప్పి మహాతో ఫొటోలు తీయించుకుంటాడు. నువ్వు నాతోనే ఫొటోలు దిగకపోతే నా ప్లాన్స్‌ నాకు ఉంటాయని చక్రి అనుకుంటాడు.


                      రూమ్‌కు వెళ్లి అందరూ ఫ్రెష్‌ అయిన తర్వాత తినడానికి రెస్టారెంట్‌కు వస్తారు.అప్పటికే అక్కడ ప్రతాప్‌ వాళ్లు తినడానికి కూర్చుని ఉంటారు. భోజనం ఆర్డర్ ఇచ్చినా...నారాయణ తినకపోవడం చూసి మహా అడుగుతుంది.నేను మందు తాగకుండా అన్నం తినలేనని చెప్పడంతో....వెళ్లి రెండు  పెగ్‌లు వేసి రమ్మని పర్మిషన్ ఇవ్వడంతో సంతోషంగా వెళ్లిపోతాడు. ప్రతాప్‌ కూడా  మహా జ్ఞాపకాలతో బాధపడుతుండగా...ఆది పక్కనే బార్‌ ఉందని వెళ్లిరమ్మని చెప్పి పంపిస్తాడు.నారాయణ అప్పటికే బ్రాందీ ఆర్డర్ ఇచ్చి తాగడానికి కూర్చుంటాడు. ప్రతాప్‌ కూడా వచ్చి బ్రాందీ  ఆర్డరివ్వగా...స్టాక్‌ లేదని బాయ్ చెబుతాడు. ప్రతాప్‌ లేచి వెళ్లబోతుండగా నారాయణ  ఆపి...నా దగ్గర ఫుల్‌ బాటిల్‌ ఉందని నేను అంత తాగితే నా కోడలు ఒప్పుకోదని మీరు కొంచెం తీసుకోండని చెప్పి ఇస్తాడు. ఇద్దరూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటారు.

ప్రతాప్ సిగార్‌ కాల్చుకోవడానికి నారాయణ అగ్గిపెట్టె ఇస్తే బదులుగా  నారాయణకు ప్రతాప్ సిగార్ ఇస్తాడు. పైగా మందుకు డబ్బులు కట్టడానికి ప్రతాప్ చూడగా....ఇవాళ నేను కడతానని రేపు మీరు ఇవ్వండని చెప్పి పంపిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆది దూరం నుంచి చూసి తండ్రితో  ఎవరు నాన్న అతను అని అడగ్గా...ఇక్కడే కలిశాడని మంచిచెడ్డలు మాట్లాడుకున్నామని చెబుతాడు. ఎవరైతే ఏం అని మిమ్మల్ని సంతోషపెట్టాడని చెబుతాడు. మీ ముఖంలో నవ్వుచూసి చాలారోజులు అయ్యిందని అంటాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
Embed widget