అన్వేషించండి

Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు సీరియల్: ప్రేరణ, సిద్ధూలకు ఫ్రీ IPS కోచింగ్.. సిద్ధూ తండ్రికి షాక్.. సుధాకి గణ వార్నింగ్!

Nindu Manasulu Serial Today Episode July 28th సిద్ధూ ప్రేరణలకు ఓ ఇన్‌స్టిట్యూట్ ఫ్రీగా కోచింగ్ ఇస్తామని కాల్ చేయడం ఇద్దరూ ఒకే బైక్ మీద బయల్దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ సుధాకర్‌తో మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఓ ఫోన్ వస్తుంది. GR ఇన్స్టిట్యూట్ వాళ్లు ప్రేరణకు ఫ్రీగా ఐపీఎస్‌ కోచింగ్ ఇస్తామని చెప్తారు. ప్రేరణ ఎగిరి గంతేస్తుంది. తల్లి, చెల్లితో చెప్పి సంబరపడిపోతుంది. ఐశ్వర్య తల్లితో మామయ్య నోరు తీపి చేయమ్మా అంటుంది. స్వీట్ లేదు కదా అని ఇందిర అంటే కాఫీ ఉంది కదా ఇచ్చేయ్ అంటుంది. 

ఇక ఏ పందికొక్కు నన్ను ఆపలేదు..

మరోవైపు సిద్ధూకి కూడా జీఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్లు కాల్ చేసి సివిల్స్‌కి ఫ్రీ కొచింగ్ ఇస్తామని చెప్తారు. సిద్ధూ ఎగిరి గంతేస్తాడు. కుమార్‌ని గిరగిరా తిప్పేస్తాడు. తండ్రి విజయానంద్‌ని ఉద్దేశించి ఇక ఏ పచ్చనోట్లు పంది కొక్కులు నన్ను ఐపీఎస్‌ అవ్వకుండా ఆపలేడని అంటాడు. ఆ పెద్ద మనిషికి దిమ్మ తిరిగిపోతుందని కుమార్ అంటాడు. వెంటనే ఈ విషయం నా చెల్లికి చెప్పాలని సిద్ధూ సాహితికి కాల్ చేస్తాడు. సాహితికి విషయం చెప్తాడు. సాహితి చాలా సంతోష పడుతుంది. 

గ్రాహాలన్నీ అబ్బాయిగారికి గోరుముద్దులు తినిపిస్తున్నాయి సార్.. 

సాహితిని చూసిన ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావ్ అని విజయానంద్ అడుగుతాడు. దాంతో సాహితి అన్నయ్య త్వరలోనే ఐపీఎస్‌ కాబోతున్నాడు అని చెప్తుంది. విజయానంద్ షాక్ అయిపోతాడు. అన్నయ్యకి ఫ్రీ కొచింగ్ ఇస్తారని చెప్తుంది. ఏంట్రా ఇది అని విజయానంద్ అంటే దానికి పీఏ గ్రాహాలన్నీ అబ్బాయిగారికి గోరుముద్దులు తినిపిస్తున్నాయి సార్.. ఇక బాబుని ఆపడం కష్టమే అని అంటాడు.

మనసు ప్రశాంతంగా ఉంచుకోరా.. హాయిగా తిను..

ప్రేరణ వాళ్లు భోజనానికి కూర్చొంటారు. సుధాకర్ కూడా కూర్చొంటాడు. ఎలా ఉంది తమ్ముడు అని శారద కూర గురించి అడిగితే వంకాయ కూర అదిరింది అని చెప్తాడు. ప్రేరణ నవ్వుతూ అది వంకాయ కూర కాదు మామయ్య బెండకాయ అని చెప్తుంది. దాంతో సుధా ఏ ముహూర్తాన మీరు గుడిలో అడుగు పెట్టారో కానీ అప్పటి నుంచి నా బుర్ర గిర్రున తిరుగుతుందే. వంకాయకి బెండకాయకి తేడా కూడా తెలీడం లేదే అని అంటాడు. ఇందిర తమ్ముడితో మనసు ప్రశాంతంగా ఉంచుకోరా.. హాయిగా తిను అని అంటుంది. ప్రశాంతత.. హా.. ప్రశాంతన నాకూ.. మీరు తినండి అమ్మా..  సునామీ తినమ్మా అని ఐశ్వర్యని అంటాడు. 

ముందు చంపేది వాడినే.. వాళ్లకి సాయం చేస్తాడా..

ఇంతలో సుధాకర్‌కి గణ ఫోన్ చేస్తాడు. సుధాకర్ వణికిపోతాడు. ఎవరు కాల్ అని ఐశ్వర్య అడిగితే పైవాడు అని చెప్తాడు. పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడుతాడు. సార్ సార్ చెప్పండి సార్ ఏంటి విషయం అని అడుగుతాడు. దాంతో గణ వాళ్ల అడ్రస్ దొరికిందా అని అడుగుతాడు. ఇంకా లేదని అంటాడు సుధా. గణ కోపంగా నువ్వు ఇలా తింటూ తొంగుంటే ఎలా దొరుకుతుందిరా అని అంటాడు. సుధాకర్ తన చెల్లి మేనకోడళ్ల నవ్వు చూసి ఆహా ఏం నవ్వుతున్నారే అని అనుకుంటాడు. గణ సుధాకర్‌తో వాళ్లకి సాయం చేసేవాడు కూడా నాకు కావాలి ముందు వాడిని చంపేస్తా అంటాడు. ఇక గణకి పై అధికారి కాల్ చేసి జీఆర్ ఇన్సిటిట్యూట్ దగ్గరకు బందోబస్తుకి వెళ్లమని చెప్తాడు.  

మళ్లీ వీడే తగిలాడా.. ఖర్మరా బాబు..

ఉదయం సిద్ధూ ఇన్స్టిట్యూట్‌కి బయల్దేరుతాడు. కుమార్ సిద్ధూకి ఆల్‌దిబెస్ట్ చెస్తాడు. ప్రేరణ కూడా ఇంట్లో చెప్పి వెళ్తుంది. ఇందిర ఇంట్లో కూరగాయలు అయిపోయావని చెప్తుంది. నేను తెస్తా అని సుధాకర్ అంటే నేను వస్తా అని ఇందిర అంటుంది. ప్రేరణ బైక్ బుక్ చేస్తుంది. సిద్ధూకే ఆ రైడ్ వస్తుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకొని వీడేంటి అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఏంటి అనుకుంటారు. మళ్లీ మీరు నా బైక్ బుక్ చేశారని సిద్ధూ చెప్తాడు. ప్రతీ సార్ నువ్వే వస్తున్నావ్ ఇదంతా నీ ప్లాన్ చేశావా అంటుంది. నాకు అంత ఇంట్రస్ట్ లేదు అని సిద్ధూ అంటాడు. నాకు అంతా అర్థమైంది నువ్వు నా వెంట పడుతున్నావ్ అని ప్రేరణ అంటే అంత లేదమ్మా అని సిద్ధూ అంటాడు. పరిస్థితులు ఇలా పగ పట్టాయేంటి అనుకుంటూ ప్రేరణ సిద్ధూ బైక్ ఎక్కుతుంది. 

కారులోనూ భార్యాభర్తల గోలేనా..

ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ గిల్లిగజ్జాలాడుతూ ఉంటారు. ఇంతలో పక్కనే  ఓకారు వెళ్లడం ఆ కారు డోర్ సరిగా వేయకపోవడం అందులో నుంచి పాప విండో నుంచి బయటకు చూస్తూ ఉండటం చూసిన సిద్ధూ బండి రివర్స్ చేసి కారుని ఫాలో అవుతాడు. కారులో భార్యభర్తలు గొడవ పడుతూ పాపని పట్టించుకోరు. సిద్ధూ కారుకి బండి అడ్డంగా పెట్టి ఆపుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget