Nindu Manasulu Serial Today January 2nd: నిండు మనసులు: సిద్ధూ ప్రేరణని ప్రేమిస్తున్నావా? షాక్ ఇచ్చిన ఇందిర! అసలు ట్విస్ట్ ఇదే!
Nindu Manasulu Serial Today Episode January 2nd ప్రేరణ కనిపించలేదని సిద్ధూ కంగారుపడి ప్రేరణ కనిపించగానే కోప్పడటం ఇందిర చూసి ప్రేరణని ప్రేమిస్తున్నావా అని అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ కనిపించడం లేదని ఇందిర, సిద్ధూ, సుధాకర్ చాలా టెన్షన్ పడతారు. సిద్ధూ కుమార్కి కాల్ చేస్తే ప్రేరణ ఇంకా కేఫ్కి రాలేదని కుమార్ చెప్తాడు. దాంతో సిద్ధూ ఇంకా టెన్షన్ పడతాడు. ఇందిర ఏడుస్తూ నాకు కాళ్లు చేతులు ఆడటం లేదురా.. ఆ గణ గాడు ప్రేరణ మీద కోపంతో ఏమైనా చేస్తే అని ఇందిర సుధాకర్కి చెప్తుంది.
సిద్ధూ చాలా టెన్షన్ పడతాడు. సుధాకర్ అక్కతో వాడికి ఉద్యోగం లేదు అక్క వాడేం చేస్తాడు అని అంటాడు. మీరేం టెన్షన్ పడకండి.. నేను ప్రేరణ ఎక్కడున్నా తీసుకొస్తా అని వెళ్తాడు. ఇక ఇందిర, సుధాకర్ కూడా గణ ఇంటికి వెళ్లాలి అనుకుంటారు. సిద్ధూ గణ ఇంటికి వెళ్లి కాలర్ పట్టుకొని ప్రేరణ ఎక్కడా అని అడుగుతాడు. ఆ ప్రేరణ గురించి నాకు తెలీదు అని గణ అంటాడు. ఈశ్వరి సిద్ధూతో తనని నా కొడుకు ఎందుకు ఏం చేస్తాడు అని అడుగుతుంది. దాంతో సిద్ధూ గణ వార్నింగ్ ఇచ్చిన విషయం చెప్తాడు. గణ నిజంగానే ఏమైనా చేశావారా అని ఈశ్వరి అడుగుతుంది. నాకేం తెలీదు అని గణ అంటాడు. నువ్వే ఏదో చెప్పరా అని గణ మళ్లీ కాలర్ పట్టుకుంటే ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావ్.. వెళ్లి వెతుక్కోరా అని గణ సీరియస్ అవుతాడు.
ఈశ్వరి గణతో పోయిన పరువు చాలదారా వాళ్లతో ఎందుకు పెట్టుకుంటున్నావ్.. వదిలేయ్ ముందు నీ ఉద్యోగం, పరువు దక్కించుకో అని అంటుంది. ఇక సిద్ధూ వెళ్తుంటే ఇందిర, సుధాకర్ కనిపిస్తారు. సిద్ధూ గణ దగ్గర ప్రేరణ లేదని వెతకడానికి వెళ్తాను అని అంటే ఇందిర కూడా సిద్ధూతో వెళ్తాను అంటుంది. సిద్ధూ సుధాని గణతోనే ఉండమని గమనిస్తూ ఉండమని అంటాడు.
సిద్ధూ, ఈశ్వరి ప్రేరణ ఫొటో పట్టుకొని అందర్ని అడుగుతూ ఉంటారు. తెలిసిన అందరికీ సిద్ధూ కాల్ చేసి అడుగుతుంటాడు. సిద్ధూ ఇందిరతో ఎవరిని అడిగినా ప్రేరణ గురించి తెలీదు అంటున్నారు.. అసలు నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లింది అని సిద్ధూ అంటాడు. ప్రేరణ ఎక్కడుంది అని చాలా టెన్షన్ అవుతుంటాడు. ఇంతలో ఎదురుగా ప్రేరణ కుమార్ లవర్ శైలుతో షాపింగ్ చేసి వస్తూ ఉండటం ఇందిర చూస్తుంది. సిద్ధూకి ప్రేరణను చూపిస్తుంది.
సిద్ధూ కోపంగా ప్రేరణ దగ్గరకు వెళ్లి నిల్చొంటాడు. చెప్పకపోయిన భలే కనిపెట్టి వచ్చేశావ్ అని అనుకుంటారు. సిద్ధూ కోపంగా ప్రేరణని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. నీకు అసలు బుద్ధి ఉందా.. నువ్వు ఏమైపోయావో నీకు ఏమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా.. ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది. కనీసం ఒక్కసారి అయినా ఫోన్ చూసుకోవాలి కదా.. కంటిన్యూగా స్విఛ్ ఆఫ్ వస్తుంది. నీకు చెప్తూనే ఉన్నాను కదా నువ్వు ఎక్కడికైనా వెళ్తే చెప్పు అని.. అయినా చెప్పడం లేదు అంటే నీ గురించి ఆలోచించేవాళ్లు ఏమైపోయినా పర్వాలేదా.. మాట్లాడవే. కనీసం శైలుతో వెళ్తున్నా మీ అమ్మకి అయినా చెప్పాలి కదా .. నీ కోసం సిటీ మొత్తం పిచ్చోడిలా తిరిగాను.. నీకేమైంది అని టెన్షన్ పడుతున్నా నువ్వేమో ఈవిడ గారితో నవ్వుతూ తిరుగుతున్నావ్ అని అంటాడు.
శైలు సిద్ధూకి సారీ చెప్పి నేను ఎప్పుడు పిలిచినా ప్రేరణ రాను అని చెప్తుండేది.. అందుకే నేను బలవంతంగా పిలిచి మధ్యలో ఫోన్ వస్తుందేమో అని ఫోన్ స్విఛ్ ఆఫ్ చేసేశా సిద్ధూ అన్నయ్య సారీ, ఆంటీ సారీ ఇది ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదని అంటుంది. ప్రేరణ నువ్వు కనిపించకుండా పోయే సరికి తట్టుకోలేకపోయా.. కోపం, బాధ, ఫ్రస్టేషన్లో ఏం చేశానో నాకే తెలీదు.. ఒకటి గుర్తు పెట్టుకో ప్రేరణ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. అందుకే ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పు అని సిద్ధూ అంటాడు. నేను చిన్న పిల్లని కాదు సిద్ధూ పరిస్థితులు చూసుకోగలను అంటుంది. అయినా సరే నాతో చెప్పు అని సిద్ధూ చెప్పి వాళ్లని పంపిస్తాడు.
సిద్ధూతో మాట్లాడాలి అని ఇందిర పక్కకి తీసుకెళ్తుంది. నీ గురించి నాకు తెలుసు బాబు.. కానీ ఈ రోజు నువ్వు ప్రేరణ మీద చేయి ఎత్తావ్ అది హక్కు అనుకోవాలా.. బాధ్యత అనుకోవాలా అని అడుగుతుంది. తప్పు అనుకోవాలి ఆంట.. ఈరోజు నా వల్ల తప్పు జరిగింది.. కానీ అది నేను కావాలి అని చేయలేదు అని అంటాడు. నాకు అలా అనిపించలేదు అని ఇందిర అంటుంది. ప్రేరణ విషయంలో నువ్వు ఇన్ని రకాలుగా రియాక్ట్ అవుతావా.. నా కంటే కూడా అన్నీ నీలోనే ఎక్కువ కనిపించాయి,, అది చూసిన నాకు చాలా వింతగా ఉంది.. నీ పనులు మాటలు తన మీద నీకు ఉన్న హక్కులా అనిపించింది. ఈరోజుది ఓకే కానీ ఆరోజు నా కూతుర్ని హత్తుకున్నావ్ కదా.. ఆ పనికి నువ్వు చెప్పే సమాధానం ఏంటి.. ఏమనుకోవాలి.. అసలేంటి ఇదంతా.. ఎందుకు ఇదంతా.. సరే సూటిగా అడుగుతున్నా నువ్వు ప్రేరణని ఇష్టపడుతున్నావా.. ప్రేరణని నువ్వు ప్రేమిస్తున్నావా.. అని అడుగుతుంది.
సిద్ధూ షాక్ అయిపోతాడు. మీ దగ్గర నుంచి ఈ ప్రశ్నలను ఊహించలేదు. నా దృష్టిలో ఇది మీ సందేశం.. దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది.. మీరు అడిగారు కాబట్టి చెప్తా.. నా దృష్టిలో ప్రేరణ అంటే ఏదో చెప్తా.. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ఆనందం, స్వేచ్ఛ నాకు ప్రేరణ దగ్గర దొరికాయి.. నేను తనకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు.. తను తీసుకుంది.. అలా స్వేచ్ఛ తీసుకున్నవాళ్లు నా జీవితంలో ఎవరూ లేరు.. ఆంటీ తను నాకు మంచి స్నేహితురాలు ఆంటీ.. స్నేహితురాలు మాత్రమే.. ప్రేరణ నా జీవితంలో చాలా స్పెషల్.. తన వ్యక్తిత్వం నన్ను చాలా మార్చింది.. మా మధ్య ఏదో ఉంది అనడానికి మీకు నా ప్రవర్తనే కారణం.. నేను తన సమక్షంలో నన్ను నేను మర్చిపోతా ఆంటీ అంతే.. ఆరోజు కూడా తను నాకు చేసిన సాయానికి అలా చేసేశా.. ఆరోజు మీరు చూశాక అర్థమైంది.. లిమిట్స్ ఉంటాయి అని.. ఈరోజు తనపై చేయి ఎత్తాక అర్థమైంది.. నేను హద్దులు దాటుతున్నా అని..ఇందుకు మీకు నేను చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నా ఆంటీ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















