Illu Illalu Pillalu Serial Today January 2nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని ధీరజ్ క్షమిస్తాడా! విశ్వని మరోసారి అమూల్య మ్ముతుందా?
Illu Illalu Pillalu Serial Today Episode January 2nd అమూల్య విశ్వ మీద సీరియస్ అవ్వడం విశ్వ మళ్లీ తన మాటలతో అమూల్యని మాయ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode విశ్వ మాటలు నమ్మి అమూల్యని తప్పు పట్టాను.. మీ అందరినీ ఎదిరించి చాలా పెద్ద తప్పు చేశాను. మీ అందర్ని బాధ పెట్టినందుకు క్షమించండి మామయ్య అని అడుగుతుంది. పర్లేదని రామరాజు అంటాడు. వల్లీ మనసులో మామయ్య గారు క్షమించేశారు ప్రేమ మీద ఉన్న కోపం అంతా పోయింది అనుకుంటుంది. తర్వాత ప్రేమ వేదవతికి క్షమాపణ చెప్తుంది.
వేదవతి ప్రేమని దగ్గరకు తీసుకుంటుంది. వల్లీ మనసులో అత్తయ్యగారు క్షమించేశారు.. ఇలా వదిలేయకూడదు మంట పెట్టేయాలి అని ప్రేమతో కడుపులో కత్తితో పొడిచేసి కట్టు కట్టేస్తే బాధ పోతుందా ప్రేమా మీ వాళ్లతో మామయ్య గారిని దారుణంగా అవమానించేసి ఇప్పుడు సింపుల్‌గా సారీ అనేస్తే మామయ్య గారి పరువు తిరిగి వచ్చేస్తుందా.. మరోసారి మీ వాళ్లు మామయ్య గారి చొక్కా చింపేసుంటే ఏమయ్యేది.. నువ్వు ఈ ఇంటి కోడలిగా ఉన్న ఆ ఇంటి కూతురి గారిలానే ప్రవర్తిస్తున్నావ్.. మరోసారి నువ్వు ఇలా చేయవని గ్యారెంటీ ఏంటి.. నిన్ను క్షమించడం అంటే మరోసారి మీ వాళ్ల చేతిలో అవమానించుకోవడానికి ముహూర్తం పెట్టినట్లే అని అడుగుతుంది.
నర్మద కోపంగా అయితే ఏంటి అక్క మామయ్య గారు ప్రేమని క్షమించకూడదు అంతేనా అని అడుగుతుంది. అవును అని వల్లీ అంటే అలా అయితే నిన్ను క్షమించకూడదు కదా అక్క అంటుంది. దానికి వల్లీ కంగారు పడి నేనేం తప్పు చేశాను అంటుంది. గుర్తు చేసుకో అక్క నువ్వు ఏదో ఒక రోజు తప్పు చేసే ఉంటావు.. అందరికీ తెలియకపోవచ్చు.. బయట పడకపోవచ్చు అని అంటుంది. ప్రేమ చిన్న పిల్ల తెలిసీ తెలియక తప్పు చేయొచ్చు అది అర్థం చేసుకొని మామయ్య క్షమించారు. కొందరు పెద్ద వాళ్లు కూడా తప్పు చేస్తారు అని అంటుంది. రామరాజు, వేదవతి ప్రేమని క్షమించామని ఇక ఈ విషయం వదిలేయండి అని అంటారు.
అమూల్యకి పెళ్లి చూపులని పెళ్లి చూపులను అందరూ దగ్గరుండి సక్సెస్ చేయండి అని చెప్తాడు. తర్వాత వేదవతి, నర్మద, ప్రేమ హగ్ చేసుకుంటారు. వల్లీ చూసి కుళ్లుకుంటుంది. రాత్రి ధీరజ్ ఫ్యాన్ రిపేర్ చేసుకుంటే ప్రేమ సంతోషంగా వస్తుంది. ధీరజ్‌కి సారీ చెప్పి క్షమించమని అడుగుతుంది. నువ్వు క్షమించకపోతే నాకు చాలా గిల్టీగా ఉంటుందని అడుగుతుంది. నువ్వు నాతో మాట్లాడుతుంటే నాకు చిరాకుగా ఉంది అని ధీరజ్ కోపంగా అంటాడు. ప్రేమ షాక్ అయిపోతుంది. నువ్వు ఇలా నా పక్కన ఉంటే నాకు కంపరంగా ఉంది.. నువ్వు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది.. నేను మాట్లాడిన చిన్న మాటకే నీకు ఇంత బాధ ఉంటే నా చెల్లి మీద నింద వేశావ్.. నడి రోడ్డు మీద మా కుటుంబం అవమానపడటానికి కారణం అయ్యావ్ మరి నాకు ఎంత బాధ ఉంటుంది అని అంటాడు.
ప్రేమ మళ్లీ సారీ చెప్తే ధీరజ్ కోపంగా నాతో మాట్లాడకు మర్యాదగా పక్కకి వెళ్లు అని అంటాడు. ప్రేమ ఇరిటేట్ అయి పక్కకి కాదురా రూం నుంచి వెళ్లిపోతా.. నువ్వు వచ్చి పిలిచే వరకు రాను అని అంటుంది. రాత్రి అమూల్య బయటకు వస్తే విశ్వ చూసి అమూల్యని పిలుస్తాడు. అమూల్య విశ్వ దగ్గరకు వెళ్లి నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నీ ప్రేమ నిజం అని నమ్మాను. మన రెండు కుటుంబాలు కలవాలి అని నువ్వు సిన్సియర్‌గా అనుకున్నా.. అందుకే నువ్వు అంటే నాకు మొదటి నుంచి నచ్చకపోయినా నిన్ను నమ్మాను.. కానీ నువ్వు నీ చెల్లిని ఇంటికి తెచ్చుకోవడానికి నన్ను ట్రాప్ చేస్తావా.. ఇంకోసారి నాతో మాట్లాడాలని చూస్తే మా అన్నయ్యలకు చెప్పి నీ అంతు చూస్తా అని అంటుంది.
విశ్వ మళ్లీ యాక్టింగ్ మొదలు పెడతాడు. ధీనంగా ముఖం పెట్టి థ్యాంక్యూ అమూల్య నువ్వు నన్ను అనుమానించావ్,, మీ వాళ్ల మాటలకు నీలా ఎవరైనా ఇలాగే మాట్లాడుతారు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మా చెల్లి మా ఇంటికి ఎలా వస్తుంది. నేను నిన్ను టార్చర్ చేస్తే మీ అన్నయ్య మా చెల్లికి టార్చర్ చేస్తాడు కదా.. ఈ చిన్న విషయం నువ్వు ఎలా ఆలోచించలేదు అని విశ్వ అంటాడు. నేను మొదటి సారి ప్రేమించింది నిన్నే నీ కోసం ఇలా ఒంటరిగా ఉండిపోతా.. నీ కోసమే బతుకుతాను.. నీ కోసమే చచ్చిపోతాను అని చెప్పివెళ్లిపోతాడు. అమూల్య మళ్లీ ఆలోచనలో పడుతుంది.
ప్రేమ ఒంటరిగా బయట చలిలో కూర్చొని ఉంటుంది. ధీరజ్ బయటకు వచ్చి చూసి చలి మంట పెడతాడు. ప్రేమ మనసులో వీడు చాలా బాధ పడ్డాడు.. ఎంత అయినా తప్పు నాదే కదా అని అనుకుంటుంది. ధీరజ్ ప్రేమకి దుప్పటికప్పి కూర్చొపెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















