Lakshimi Raave Maa Intiki Serial Today January 1St: సింధూను తప్పించేందుకు మ్యాడీ చేసిన ప్లాన్ ఏమైంది..? శ్రీలక్ష్మీ మ్యాడీని ఎందుకు దొంగగా భావించింది..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 1St: సింధూను ఆస్ట్రేలియా పంపేందుకు మ్యాడీ దొంగలా ప్రయత్నిస్తుండగా...శ్రీలక్ష్మీ పట్టేసుకుని సూర్యనారాయణకు అప్పగిస్తుంది.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ఇయర్‌బడ్స్ కోసం వెతుకుతున్న శ్రీలక్ష్మీని బలత్కరించేందుకు యత్నించిన ముగ్గురు తాగుబోతు వెధవలను లక్ష్మీ చితక్కొడుతుంది. దీంతో వారు పారిపోతారు. తమ్ముడిని ఇంటికి వెళ్లిపొమ్మని...తాను పెద్దయ్యగారి ఇంటికి వెళ్లి మ్యాడీకి ఇయర్‌బడ్స్ దొరకలేదని చెప్పి వస్తానని చెప్పి పంపిస్తుంది. అటు సింధూను ఇంటి నుంచి బయటకు పంపించేందుకు మ్యాడీ త్రిషను కారు తీసుకుని రమ్మని చెబుతాడు. ఆమె సూర్యనారాయణ బంగ్లా వెనక కారుతో వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో అటుగా వచ్చిన శ్రీలక్ష్మీ కారును చూసి అనుమానిస్తుంది. ఈ సమయంలో ఇంటి వెనక కారు ఎందుకు ఉందా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అటు ఆస్ట్రేలియా పారిపోవడానికి సింధూ లగేజీ సర్దుకుని రెడీగా ఉంటుంది. మ్యాడీ దొంగచాటుగా ముసుగు వేసుకుని సింధూను ఇంటి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాడు.అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీలక్ష్మీ దొంగా దొంగా అని అరవడంతో అందరూ నిద్రలేస్తారు. శ్రీలక్ష్మీ మ్యాడీని గట్టిగా పట్టుకుని ఆపుతుంది. ఇంతలో సూర్యానారాయణ సహా అందరూ అక్కడికి వస్తారు. ఈ మాటలు విని కారు తీసుకుని త్రిష పరారవుతుంది. సింధూ వాళ్లు లోపలికి జారుకుంటారు.
సూర్యనారాయణ వచ్చి ముసుగు తీయమని అడగ్గా...శ్రీలక్ష్మీ ముసుగు తొలగించగానే మ్యాడీ కనిపిస్తాడు. చీకటిలో బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతుంటే దొంగ అనుకుని అరిచానని లక్ష్మీ సారీ చెబుతుంది. ఇంతలో సూర్యానారాయణ మ్యాడీని నిలదీస్తాడు.ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. దీంతో వాళ్ల పిన్ని కలుగజేసుకుని ఏద షూటింగ్ కోసం చెప్పాపెట్టకుండా బయలుదేరి వెళ్తున్నాడేమో అని అంటుంది. మ్యాడీ మౌనంగా ఉండటంతో సూర్యనారాయణ ఇంకా గట్టిగా నిలదీస్తాడు. నువ్వు మాట్లాడటం లేదంటే...ఏదో చెప్పకూడని కారణం ఉండిఉంటుందని అంటాడు. ఆ కారణం ఏంటో తెలియాలి అని అంటాడు. సింధూ వైపు చూసి నిజం చెప్పమని మ్యాడీ అంటాడు. నాకేం తెలుసు అని సింధూ అబద్ధం చెబుతుంది.ఇంతదూరం వచ్చిన తర్వాత దాచిపెట్టడం ఎందుకు నిజం చెప్పమని మ్యాడీ అంటాడు. ఎలాగూ అందరికీ దొరికిపోయాం కదా...ఇప్పటికీ నిజం చెప్పకపోతే వీళ్లు నిజంగానే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని అంటాడు.
ఇంతలో ప్రియంవద కల్పించుకుని మనం హడావుడిగా రావడం వల్ల సింధూ మేకప్‌కిట్ తెచ్చుకోవడం మర్చిపోయిందని...అది తీసుకురావడానికే మ్యాడీ ఊరికి వెళ్తున్నాడని అబద్ధం చెబుతుంది. ఇది తెలిస్తే మీరు కోప్పడతారని చెప్పడం లేదని అంటుంది. ఇంత చిన్న మేకప్‌కిట్ తీసుకురావడానికి ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకని శ్రీలక్ష్మీ మళ్లీ మ్యాడీని ఇరికిస్తుంది. వెంటనే సింధూ కలుగుజేసుకుని ఆ బ్యాగ్ తనదని..బట్టలు ఐరన్ చేసితీసుకురమ్మని పంపించానని చెబుతుంది. ఇంతలో సూర్యనారాయణ కల్పించుకుని మంచి పనిచేద్దామనుకున్నప్పుడు దొడ్డిదారిన వెళ్లాల్సిన పని ఏముందని మందలించి వెళ్లిపోతాడు. ఇంతకీ ఈటైంలో నువ్వు ఎందుకు వచ్చావని శ్రీలక్ష్మీని అడగ్గా...మా పక్కింటి వాళ్ల పిల్లి కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చానని చెబుతుంది. ఇంటి బయట కారు ఉండటం చూసి అనుమానం వచ్చి లోపలికి వచ్చానని అంటుంది. దీంతో సూర్యనారాయణ ఆ కారు ఎవరిదని...ఎక్కడని మళ్లీ నిలదీస్తాడు. ఆ కారు ఎవరిదో నాకు తెలియదని మ్యాడీ అంటాడు. దీంతో అందరూ లోపలికి వెళ్తారు.
మ్యాడీ,శ్రీలక్ష్మీ పెనుగులాటలో మ్యాడీ జేబులో నుంచి ఇయర్‌బడ్స్ కిందపడిపోతాయి. వాటిని శ్రీలక్ష్మీ చూస్తుంది. వెంటనే వాటిని తీసుకుని మ్యాడీ జేబులో వేసుకుంటాడు. వాటిని బయటకు తీయించి చూస్తుంది.వీటిని మీ దగ్గరే పెట్టుకుని నేను పడేశానని చెబుతారా అని మండిపడుతుంది. మీరు నన్ను ఆటపట్టించాలని చూశారని...కానీ నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు వాటి కోసం వెతుకుతూనే ఉన్నానని అంటుంది. ఇంకోసారి ఇలా చేయవద్దని చెప్పి వెళ్లిపోతుంది. శ్రీలక్ష్మీ చేసిన పనికి అందరూ బాధపడుతుంటారు. ఇంతలోత్రిష ఫోన్ చేయగా...ఇప్పుడు కుదరదులే వెళ్లిపొమ్మని మ్యాడీ చెబుతాడు.





















