Chinni Serial Today January 2nd: చిన్ని సీరియల్: మధుని పెళ్లి చేసుకున్న మ్యాడీ! శ్రేయ సూసైడ్! దేవా ఏం చేస్తాడు?
Chinni Serial Today Episode January 2nd గుడిలో మ్యాడీ మధుని పెళ్లి చేసుకోవడం.. శ్రేయ చాలా ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీ గుడిలో పెళ్లి చేసుకోవాలని తిలక్ పట్టుపడతాడు. అది జరగదు అని దేవా అంటే జరిగి తీరుతుంది. ఈ అమ్మాయితోనే నీ కొడుకు పెళ్లి జరిగి తీరుతుంది. లేదంటే నీ కొడుకు జీవితాంతం బ్రహ్మాచారిలా ఉండిపోతాడు అని అంటాడు. నా కొడుకు ఎందుకు పెళ్లి చేసుకోడు.. అసలు ఈ పరిస్థితికి కారణం ఈ అమ్మాయి,, పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సింది కూడా ఆ అమ్మాయే అని దేవా అంటాడు.
మధు షాక్ అయిపోతుంది. తప్పు ఎవరిదైనా శిక్ష ఇద్దరూ అనుభవించాలి అని నీ నోటితో నువ్వే తీర్పు చెప్పావ్ గుర్తు లేదా.. ఒకసారి ఆ అమ్మాయిని చూడు గుర్తొస్తుందేమో అని అక్కడే పిచ్చిదానిలా ఉన్న అమ్మాయిని చూపిస్తాడు తిలక్.. ఐదేళ్ల క్రితం పెళ్లి ఫిక్స్ అయిందని సంతోషంలో ఉన్న ఆ అమ్మాయి గుడికి వస్తే ఓ వ్యక్తి కుట్ర చేసి ఆ అమ్మాయితో గుడిలో ఉండిపోయేలా కుట్ర చేశాడు.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి లేదంటే బ్రహ్మచారిలా ఉండాలని తీర్పు ఇచ్చావ్.. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఇలా అయిపోయింది. అమ్మాయి విషయంలో నీ తీర్పు నీ కొడుకు విషయంలో ఎందుకు లేదు అని అడుగుతాడు.
నాగవల్లి దేవాతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆరోజు ఎవడో కుట్ర చేస్తే ఈ రోజు మన మ్యాడీని పెళ్లి చేసుకోవడానికి మధు కుట్ర చేసిందని అంటుంది. నేను అలా చేయలేదు అని మధు అంటుంది. మధు అలా చేయదు అని మ్యాడీ అంటాడు. నాగవల్లి, దేవాలు కుట్ర చేసిన మధు శిక్ష అనుభవించాలి అంటారు. మ్యాడీతో మధుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు పొరపాటున కూడా ఆలోచించొద్దు.. బంగారం లాంటి నీ జీవితం నాశనం చేసుకోవద్దు అని నాగవల్లి అంటుంది.
దేవా, నాగవల్లి ఇద్దరూ మ్యాడీతో మధు గురించి ఆలోచించకుండా పద అని అంటే మ్యాడీ రాడు ఆగిపోతాడు. గుడిలో ఉన్న పిచ్చామెని చూసి మధు ఇలా అయిపోకూడదు అని మనసులో ఉండిపోతాడు. ఎందుకు ఆగిపోయావ్ అని మ్యాడీని నాగవల్లి అడిగితే మధు మీద ప్రేమతో ఆగిపోయా మమ్మీ.. నేను మధు ప్రేమించుకున్నాం.. మీరు శ్రేయతో నిశ్చితార్థం చేశారు.. మీరు మా పెళ్లికి ఒప్పుకోరు అని ఈ గుడి సంప్రదాయం అడ్డు పెట్టుకొని ఈ గుడిలో ఉండేలా ప్లాన్ చేశాం అని అంటాడు. దేవా, నాగవల్లి, శ్రేయ అందరూ షాక్ అయిపోతారు.
తిలక్ పంతులుతో చెప్పి పెళ్లికి ఏర్పాటు చేయమని అంటాడు. పంతులు తాళి తీసుకొచ్చి మ్యాడీకి ఇస్తాడు. నాగవల్లి వద్దు అంటున్నా సరే మ్యాడీ మధు మెడలో తాళి కట్టేస్తాడు. అది చూసిన శ్రేయ ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోతుంది. శ్రేయ వెనక ఫ్యామిలీ మొత్తం పరుగులు తీస్తారు. శ్రేయ గదిలోకి వెళ్లి డోర్ వేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ఫ్యాన్‌కి చీర కట్టేస్తుంది. అందరూ ఎంత డోర్ కొట్టినా తీయదు. చివరకు శ్రేయ గురి వేసుకునే టైంకి దేవా డోర్ తన్ని శ్రేయని కాపాడుతాడు. నీకు పిచ్చా ఎవరి కోసం చస్తావ్ అని దేవా అంటే శ్రేయ ఏడుస్తూ బావ కోసం చస్తా.. నేను పుట్టిందే బావ కోసం అని ఏడుస్తుంది. చావాల్సింది నువ్వు కాదు.. ఆ మధు.. సంప్రదాయాలు పెట్టి తాళి కట్టించుకుంటే సరిపోదు.. చావాల్సింది.. నీ బావ మెడలో తాళి కట్టించుకున్నందుకే అది నా చేతిలో చస్తుంది. పెళ్లి చావు ఒకే రోజు ఆ మధు జీవితంలో రాసుంది అని అంటాడు.
స్వప్న మధు పుట్టింటికి వెళ్లి మధు గురించి ఒక వీడియో వైరల్ అవుతుందని మధు తల్లిదండ్రులకు మధు, మ్యాడీల పెళ్లి వీడియో చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. మధుని తీసుకొని మ్యాడీ ఇంటికి వస్తాడు. దేవా వాళ్లని గుమ్మం బయటే ఆపేస్తాడు. కుట్ర చేసి నా కొడుకుతో తాళి కట్టించుకున్న నువ్వు ఈ ఇంటి కోడలివి కాలేవు. ఈ ఇంట్లో అడుగుపెట్టలేవు. కూరగాయలు అమ్ముకునే వాడు నాకు వియ్యంకుడు కాదు అని మధుని చంపేయడానికి గన్ తీసుకొస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















