Podharillu Serial Today January 2nd: మహా ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో భూషణ్ ఏం చేశాడు..? మహాను వాళ్ల నాన్న ఎందుకు కొట్టాల్సి వచ్చింది.
Podharillu Serial Today Episode January 2nd: భూషణ్ ఫోన్ మహా కట్ చేయడంతో రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉంటాడు. తెల్లారి నేరుగా ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ప్రతాప్ మహాను కొడతాడు.

Podharillu Serial Today Episode: పెళ్లి నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో నుంచి పారిపోవడమే మార్గమని మహాకు చక్రి సలహా ఇస్తాడు. దీనికి మహా ఒప్పుకోదు. ఇంట్లో నుంచి పారిపోయి మా నాన్న పరువు తీయలేనని అంంటుంది. ఇంతలో మహాకు భూషణ్ ఫోన్ చేయగా...ఆమె లిప్ట్ చేయకుండా కట్ చేస్తుంది. దీంతో భూషణ్‌కు కోపం వచ్చి నిహారికకు ఫోన్ చేసి తనకు ఇవ్వమని చెబుతాడు. దీంతో ఆమె మహా రూమ్‌కు వచ్చి ఫోన్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో భూషణ్ మహాతో గొడవ పెట్టుకుంటాడు. నేను ఫోన్ చేస్తే కనీసం లిప్ట్ చేయడం లేదని అరుస్తాడు. తాను నిద్రపోతున్నానని అందుకే చూసుకోలేదని మహా రిప్లై ఇస్తుంది. నేను మాట్లాడేప్పుడు నువ్వు నిద్రపోకూడదని అనగా....కోపంతో మహా ఫోన్ కట్ చేయబోతుంది.ఇంతలో భూషణ్ మళ్లీ ఆమెను హెచ్చరిస్తాడు.
నేను కాల్ చేశానని తెలిసి కూడా కట్ చేస్తున్నావంటే నాకు నువ్వు అసలు గౌరవం ఇవ్వడం లేదనిమండిపడతాడు. పైగా అబద్ధాలు చెబుతున్నావని...ఆమెపై కోపంతో అరుస్తాడు. దీంతో మహా కూడా గట్టిగానే రిఫ్లై ఇస్తుంది.నాకు నిద్ర వస్తోందని...ఈ సమయంలో డిస్టర్బ్ చేయవద్దని హెచ్చరిస్తుంది. మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుంటే...మహాకు కోపం వచ్చి ఫోన్ సైలెంట్‌లో పెట్టేస్తుంది. దీంతో భూషణ్‌కు కోపం మరింత ఎక్కువ అవుతుంది. అదే పనిగా ఫోన్ చేస్తూనే ఉంటాడు.
తెల్లారి మహా ఫోన్ చూసుకుంటే 200కు పైగా మిస్‌కాల్స్ ఉంటాయి. దీంతో వీడింత సైకోగాడిలా ఉన్నాడేంటని మహా మండిపడుతుంది. ఇంతలో నిహారిక అక్కడికి వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా అంటూ తన ఫోన్ తీసుకుని చూస్తుంది.అందులోనూ దాదాపు 150మిస్‌కాల్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. చూశావు కదా వాడి సైకోఇజం....నేను ఫోన్ కట్ చేశానన్న కోపంతో రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్నాడని మహా అంటుంది. ఇప్పుడు చెప్పు వదిన ఇలాంటి వాడితో జీవితాంతం ఎలా ఉండాలో అని అంటుంది. కేవలం వాడి ఇగో హర్ట్ అయ్యిందన్న కోపంతో రాత్రంతా ఫోన్లు చేస్తూనే ఉన్నాడని చెబుతుంది. ఇంతలో భూషణ్ కోపంగా ప్రతాప్ వాళ్ల ఇంటికి వస్తాడు. ఈ విషయం వచ్చి మహా వాళ్ల అమ్మ గొప్పగా మహాతో చెబుతుంది.నువ్వు ఫోన్ లిప్ట్ చేయకపోతేనే అల్లుడుగారు ఏకంగా ఇంటికి వచ్చేశాడంటే అతనికి నీపైన ఎంత ప్రేమేనని అంటుంది. వాడి సైకోఇజం వీళ్లకు ఇలా అర్థమవుతోందా అని మహా బాధపడుతుంది. ఇంతలో భూషణ్ కింద కోపంతో రగిలిపోతుంటాడు. ఎంతసేప్ ఎదురుచూసినా తను కిందకు రావడం లేదని...తానే మహా రూమ్‌కి వెళ్లి మాట్లాడతానని అంటాడు. కోపంగా మహా ఉన్న రూమ్‌లోకి వెళ్లిపోతాడు.
మహారూమ్‌లోకి వెళ్లిపోయి ఆమెపై భూషణ్ గట్టిగా అరుస్తాడు. నేను వచ్చానని చెప్పినా నీకు ఎందుకు అంత నిర్లక్ష్యమని మండిపడతాడు. ఫోన్ ఎందుకు లిప్ట్ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తనపై పెత్తనం చేయాలని చూడగా...మహాకు కోపం కట్టలు తెంచుకుని తిరగబడుతుంది.భూషణ్‌ను నోటికి వచ్చినట్లు తిడుతుంది. ముందు నా గదిలో నుంచి బయటకు వెళ్లిపొమ్మని తోసివేస్తుంది. ఈ గొడవ చూసి ప్రతాప్ పైకి వస్తాడు. ఏం జరిగిందని భూషణ్‌ను అడుగుతాడు. మీ అమ్మయి నన్ను గెటవుట్ అంటుందని చెబుతాడు. దీంతో ప్రతాప్ వాళ్ల అమ్మాయిని తిడతాడు.అల్లుడిగారితో మాట్లాడే పద్దతి ఇదేనా అని కోప్పడతాడు.
ఈసైకోగాడు రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్నాడని చెప్పడంతో ప్రతాప్ కోపంతో మహాను చెంపపై కొడతాడు. కాబోయే భర్త గురించి ఇలాగేనా మాట్లాడేదని అంటాడు. నీపై ఇంత ప్రేమ చూపిస్తుంటే...నువ్వు కేర్‌లెస్‌గా మాట్లాడుతున్నావేంటని ప్రతాప్ మండిపడతాడు. అల్లుడిగారి మర్యాదగా సారీ చెప్పమని అంటారు. దీంతో ఆమె సారీ చెబుతుంది. వాళ్లంతా తిరిగివెళ్లిపోగా...మహా బెడ్‌రూంలో కూర్చుని ఏడుస్తుంది. తన తప్పులేకపోయినా సారీ చెప్పించడమేగాక...పైగా నా మాటలను నమ్మనని నాన్న అన్నారని నిహారికతో అంటుంది.





















