Nindu Manasulu Serial Today August 9th: నిండు మనసులు సీరియల్: గణ పొగరు అణిచేసిన విజయానంద్.. కాళ్లు పట్టేసిన పోలీసోడు.. తండ్రికి ఏం చెప్తాడు?
Nindu Manasulu Serial Today Episode August 9th గణ తన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకోవడానికి విజయానంద్ దగ్గరకు వెళ్లడం కాళ్లబేరం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode మంజుల తన ఫ్రెండ్‌తో మాట్లాడటానికి ఇంటికి వెళ్తుంది. ఇక సిద్ధార్థ్ మంజుల ఫ్రెండ్ అర్డర్ చేసిన కూరగాయలు డెలివరీ చేస్తారు. మంజుల అవమానంగా ఫీలవుతుంది. మంజుల ఫ్రెండ్‌కి సిద్ధూ కోట్ల ఆస్తి వదిలేసి ఇండిపెండెంట్‌గా ఉంటున్నాడని తెలిసి చాలా గ్రెట్ అని ఇలాంటి కొడుకు ఉండటం నీ అదృష్టం అని అంటుంది. అది మీకు అర్థమైంది కానీ వాళ్లకి కాదు అని సిద్ధూ వెళ్లిపోతాడు.
గణ విజయానంద్ ఇంటికి వస్తాడు. బ్యాడ్ టైం అంటే నాదే కింగ్‌లా ఉండేవాడిని ఇలా వీడి దగ్గర లొంగాల్సిందే అని అనుకుంటాడు. పీఏ గణ వచ్చిన సంగతి విజయానంద్‌కి చెప్తాడు. గణ పొగరు అణిగిందో లేదో తెలుసుకుందామని చెప్పి గణని కూర్చోపెట్టి కాఫీ కావాలా అని అడుగు కానీ ఇవ్వకు అని చెప్తాడు. గణ కూర్చొని చాలా సేపు వెయిట్ చేస్తాడు. విజయానంద్ కిందకి రాడు. కాఫీ కూడా రాదు.. మళ్లీ పీఏ వచ్చి టీ కూల్ డ్రింగ్ అని అంటాడు. ఇందాక అడిగిన కాఫీనే ఇంకా రాలేదు అని కోపంగా చెప్తాడు. వసుదేవుడు గాడిద కాళ్ల పట్టినట్లు ఉంది నా పరిస్థితి అని అనుకుంటాడు. ఇంతలో పీఏ చాలా సేపు వెయిట్ చేశాడు అని చెప్తే ఇప్పుడు వెళ్దామని అంటాడు.
విజయానంద్ కిందకి వెళ్లే సరికి గణ దగ్గరకు పనివాడు వస్తాడు. గణ కోపంగా కాఫీ కావాలా అని అడుగుతావ్ తీసుకురా అంటాడు. దాంతో పనోడు లేదు సార్ కాఫీ లేదు టీ కావాలా అని అడుగుతాడు. నాకు విషయం అర్థమైంది కాఫీ వద్దు టీ వద్ద అని తరిమేస్తాడు. విజయానంద్ విశ్వాసంతో కొన్నిసార్లు లేటుగా అర్థమవుతుందని గణ మీద సెటైర్ వేస్తాడు. గణ క్షమాపణ చెప్పి మీరు చెప్తే కానీ నాకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వను అన్నారు.. అంతా మీ చేతిల్లో ఉంది నా జాబ్ నాకు ఇవ్వండి అని అంటాడు. విజయానంద్ గణతో నిజమే కానీ నీ పోస్ట్ వేరే వాళ్లతో భర్తీ అయిపోయింది కదా అని విజయానంద్ అంటాడు. గణకి ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ ప్రేరణ మీద గెలవాలి అంటే పవర్ ఉండాలి అని తన అహన్ని చంపుకొని విజయానంద్ ముందు చేతులు కట్టుకొని నిలబడతాడు. విజయానంద్ ఇగో చల్లారకపోవడంతో రుమాలు తన కాళ్ల కింద పడేసి గణ తీయాలని విశ్వం తీస్తుంటే నీకు నడుం నొప్పి కదా అంటాడు. విషయం అర్థమైన గణ తన అహం పక్కన పెట్టేసి పోస్ట్ కోసం విజయానంద్ కాళ్ల దగ్గరున్న రుమాలు తీసి ఇచ్చి దండం పెట్టి బయటకు వెళ్లిపోతాడు.
విశ్వం విజయానంద్‌తో ఒక్క రాత్రిలో ఆకాశాన్ని నేలకి దించేశారు కదా సార్ అంటే పగడ విప్పిన పాముతో పవర్లో ఉన్న నాతో ఆటలు ఆడకూడదు విశ్వం అని విజయానంద్ అంటాడు. గణ బుసలు కొట్టిన పాములా పరువు పోయిందని రగిలిపోతూ ఉంటాడు. గణ తండ్రి రాజశేఖరం గణ యూనిఫాం చూస్తూ ఉంటాడు. ఇంతలో గణ తండ్రి దగ్గరకు వస్తాడు. తండ్రి యూనిఫాం చూడటం చూసి చూస్తున్నావా నాన్న బాగా చూడు నువ్వు చూడాలనే అది అక్కడ పెట్టా.. నిజానికి అది నా ఒంటి మీద ఉండాలి.. కానీ అది అక్కడ వేలాడుతుంది. ఆ యూనిఫాం గురించి తెలుసా నాన్న ఎవరు అంచనా వేయలేని అంత గొప్పది.. ఎవరీ తట్టుకోలేని అంత పవర్ ఉంది. దాని కోసం నేను ఎంత కష్టపడి ఉంటాను నాన్న.. ఎంత మందికి సలాం కొట్టుంటాను నాన్న కానీ అది నాకు దూరం అయింది దానికి కారణం ప్రేరణ. అడ్రస్ లేనిది నీ పేరు చెప్పుకుంటే నేను బాధపడుతున్నా.. అది అబద్ధం కదా నాన్నా నాకు తెలుసు అమ్మకి తెలుసు అది అబద్ధం అని నీకు తెలుసా అది అబద్ధం అని నీకు తెలీదు అని నీకు తెలుసు కదా.. నాన్న నువ్వు వారానికి రెండు రోజులు వైజాగ్ వెళ్తుంటే నీకు ప్రమోషన్ వస్తుంది అనుకున్నాం.. ప్రపంచంలో ఇంత మంది మగాలు ఉంటే వాళ్లమ్మ నిన్నే ఆపిల్లల నాన్న అంటుంది ఏంటి కొంప తీసి అదే నిజం అయితే చంపేస్తా నాన్న నిన్ను కాదు వాళ్లని. పంతం రాజశేఖరానికి ఒక్కడే కొడుకు పంతం గణేశ్ అది నేనే. ఆ గాలికి పుట్టిన దాని మీద నాకు నమ్మకం లేదు కానీ అది ఐఏఎస్ అయి నాతో సెల్యూట్ కొట్టించుకుంటుందంటా దాన్ని వదిలి పెట్టను దానివల్ల నా ఉద్యోగం పోయింది. దాని వల్ల నా పవర్ ముఖ్యంగా ప్రశాంతత పోయింది. దాన్ని వదలను అంటాడు.
ఈశ్వరి అక్కడికి వచ్చి నీ పవర్ నీకు ఎలా అయినా రావాలి అంటుంది. ఇంతలో సుధాకర్ ఇంటికి వస్తాడు. మీ సస్పెండ్ కోసం తెలిసి బాధగా ఉందని అంటాడు. ఇక సుధా నోరు జారి వాళ్లని వెతికి మరీ ఇళ్లు ఖాళీ చేయించారు అంట అంటాడు. నీకు ఎలా తెలిసింది అని గణ అడిగితే మీ గొప్పలు అందరూ చెప్పుకుంటున్నారు మీరు దేవుడు సార్ అని గణసార్ దేవుడు అనుకుంటూ తప్పించుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















