Nindu Noorella Saavasam Serial Today August 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: యాడ్ ఫిల్మ్‌లో యాక్ట్ చేసిన చిత్ర – ఇరిటేషన్ ఫీలయిన డైరెక్టర్
Nindu Noorella Saavasam serial Today Episode August 9th: చిత్ర యాక్టింగ్ చూసి డైరెక్టర్ ఇరిటేషన్ ఫీలవుతాడు. భాగీని యాక్ట్ చేయమని అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ భోజనం చేయడానికి రెడీ అవుతుంటే.. అప్పుడే వినోద్ వస్తాడు. బిజినెస్ పనులు ఎంత వరకు వచ్చాయని అమర్ అడుగుతాడు. స్పీడుగా జరుగుతున్నాయని వినోద్ చెప్పగానే.. త్వరగా ఫ్రెష్ అయి రా భోజనం చేద్దాం అంటాడు అమర్. సరే అంటూ రూంలోకి వెళ్లిన వినోద్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకు అందరూ వస్తారు. అమర్ లోపలికి వెళ్లి చూసి సైలెంట్‌గా బయటకు వస్తాడు. మనోహరి లోపలికి వెళ్లి చూసి ఫేస్ ఫ్యాక్ వేసుకున్న చిత్రను బయటకు తీసుకొస్తుంది.
భాగీ: ఏవండి నాకు భయం అవుతుందండి.. అయ్యో..
మనోహరి: హలో హలో భాగీ ఎక్స్‌ట్రాలు చేయకండి ఇది చిత్ర
వినోద్: చిత్రనా…?
భాగీ: ఏవండి నాకు భయం వేస్తుందండి..
రాథోడ్: చిత్ర మేడం అసలు ఏంటండి మీరు ఇలా దెయ్యంలా తయారయ్యారు.
చిత్ర: నేనేం దెయ్యంలా తయారవ్వలేదు
వినోద్: దెయ్యంలా తయారవకా..? దేవతలా తయారు అయ్యావా..? ఒక్క క్షణం నిన్ను అలా చూడగానే నా గుండె ఆగినంత పని అయింది
అమర్: అయినా చిత్ర ఏంటిది అవతారం
చిత్ర: అంటే బావగారు రేపు ఫోటో షూట్ ఉంది కదా..? ఈ ఫ్యాక్ కొత్తగా వచ్చిందట.. ఇది వేసుకుంటే.. ఫేస్ అంతా బ్రైట్‌గా అవుతుందట.. అందుకే వేసుకున్నాను
అమర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
భాగీ: హలో చిత్ర ఈ ఫేస్ ఫ్యాక్‌లు పొదున పూట ట్రై చేయాలి కానీ మరీ అందరూ పడుకునే టైంలో కాదు..
మనోహరి: హలో భాగీ నువ్వు మరీ అతిగా చేస్తున్నావు.. అయినా ఆ ఫేస్ ఫ్యాక్ ఇప్పుడు అప్లై చేస్తే ఏంటి..? పొద్దున్న అప్లయ్ చేస్తే ఏంటి..?
చిత్ర: చెప్పు భాగీ నేను ఎప్పుడు రాసుకుంటే నీకేంటి..? నాకు ఫేస్ బ్రైట్ అవ్వడం ముఖ్యం.
వినోద్: నల్లటి క్రీమ్ రాసుకుంటే ఫేస్ తెల్లగా అవుతుందని ఎవరు చెప్పారు చిత్ర నీకు. అయినా ముందు చెప్పాలి కదా..?
చిత్ర: వినోద్ నిన్ను పిలుస్తూనే ఉన్నాను.. అయినా నువ్వు భయపడుతూనే వెళ్లిపోయావు..
రాథోడ్: ఇంకా నయం మేడం పిల్లలు చూడలేదు చూసుంటే నలుగురికి ఒకేసారి జ్వరం వచ్చేది
చిత్ర: వినోద్ నీ వల్ల నేను అందరి ముందు ఫూల్ అయ్యాను.. చూడు వాళ్లు కూడా వదిలేసి వెళ్లిపోతున్నారు
వినోద్: ఇవాళ నేను శవం అయ్యేవాణ్ని.. త్వరగా వెళ్లి ముఖం కడుకో లేదంటే రాత్రంతా పీడకలలే వస్తాయి.
మనోహరి: చిత్ర ఇలాంటి ఫేస్ ఫ్యాక్‌లు ఏమైనా ఉంటే పార్లర్‌కు వెల్లొచ్చు కదే
చిత్ర: అమ్మో పార్లర్‌కు వెళితే డబ్బులు ఖర్చు పెట్టాలి.. నా వల్ల కాదు అసలే ఇప్పుడిప్పుడే నాకు డబ్బులు వస్తున్నాయి.
అని చెప్తుంది చిత్ర. తర్వాతి రోజు యాడ్ ఫిల్మ్ షూటింగ్ అమర్ వాళ్ల ఇంట్లో చేస్తుంటారు. పిల్లుల కూడా స్కూల్‌కు వెళ్లకుండా సూటింగ్ చూస్తుంటారు. చిత్ర మేకప్ వేసుకుని యాక్టింగ్ చేస్తుంది.
డైరెక్టర్: యాక్షన్.. ( చిత్ర నడుచుకుంటూ వస్తుంది) అబ్బా మీ వాకింగ్ స్టైల్ బాగా లేదు మార్చాలి…
అంటూ డైరెక్టర్ ఎన్ని టేక్‌లు తీసుకున్నా చిత్ర సరిగ్గా చేయదు. దీంతో డైరెక్టర్ విసుగ్గా చూస్తుంటాడు..
కెమెరామెన్: సార్ ఆవిడను చూడండి ఆవిడ ఫేస్ కెమెరాకు బాగా సరిపోతుంది. ఆమెతో ఈ యాడ్ చేయిద్దాం సార్..
డైరెక్టర్: అవును చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మేనేజర్.. ఒకసారి ఆవిడ దగ్గరకు వెళ్లి ఈ యాడ్‌లో యాక్ట్ చేస్తుందేమో అడుగు
అని చెప్పగానే.. మేనేజర్ రాథోడ్‌కు విషయం చెప్పి భాగీకి చెప్పమంటాడు రాథోడ్ వెళ్లి భాగీకి చెప్పగానే భాగీ సిగ్గు పడుతుంది. విషయం తెలిసిన చిత్ర కోపంగా చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















