అన్వేషించండి

Nindu Manasulu Serial Today may 8th: నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల ఫస్ట్‌నైట్! సిద్ధూ రొమాన్స్‌కి షాక్‌లో ప్రేరణ!

Nindu Manasulu Serial Today may 8th సిద్ధూ ప్రేరణలతో బామ్మ ఫస్ట్‌నైట్ ఆటలు ఆడించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూల ఫస్ట్‌నైట్ కోసం సుధాకర్ పూలు, పళ్లు అన్నీ తీసుకొచ్చి తన  తల్లిని కూడా తీసుకొస్తాడు. ఇందిర పిన్నిని చూసి చాలా సంతోషపడుతుంది. బామ్మ ప్రేరణ దగ్గరకు వెళ్లి ఏంటే మనవరాలా ఏం ఆలోచిస్తున్నావ్.. ముహూర్తానికి ఇంకా టైం ఉందిలే.. కాస్త సిగ్గు పడటం నేర్చుకో అని సెటైర్లు వేస్తుంది. ఏంటి ఇందిర దీనికి తిండి పెట్టడం లేదా.. ఇంత పీలగా ఉంది.. అని అంటుంది. ఏయ్ ముసలి నేను ఇప్పుడే రెండు కేజీలు పెరిగాను అని బాధ పడుతుంటే నువ్వు మళ్లీ పీలగా ఉన్నావ్ అంటావేంటే అని ప్రేరణ బామ్మని అంటుంది. 

సుధాకర్, ఐశ్వర్య ఫస్ట్‌నైట్ గది రెడీ చేస్తుంటే ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయ్ అని రంజిత్ అక్కడికి వస్తాడు. కరెక్ట్ టైంకి వచ్చారు సార్ నాకు అవతల వేరే పనులు ఉన్నాయని సుధాకర్ రంజిత్‌కి అప్పగించి వెళ్లిపోతాడు. ఐశ్వర్య, రంజిత్‌ ఇద్దరూ గది అలంకరిస్తారు. గులాబి పువ్వు పెట్టు అని రంజిత్ ఐశ్వర్యకు అందించబోయి ఐశ్వర్య మీద విసిరేస్తాడు. తర్వాత ఫస్ట్‌ నైట్ రోజు ఎందుకు ఇలా పూలతో అలంకరిస్తారు అని అడుగుతాడు. దానికి ఐశ్వర్య.. మంచి వాసన.. పరిమళం కోసం.. ఆ మధురమైన పరిమళాలు కొత్త జంటలో ఆకర్షణ రేపుతుంది. అందుకే ఇలా డెకరేట్ చేస్తారు.. పాల గ్లాస్‌తో ఎందుకు వస్తారు అని అడిగితే పాలు నీళ్లలా ఆ జంట కలిసిపోవాలని ఇలా చేస్తారు అంటుంది. బలం కోసం బాదం, కుంకుమ పువ్వు కలుపుతారు.. స్వీట్స్, పళ్లు పెడతారు అని స్వీట్ తీసుకొని తను తిని రంజిత్‌కి తినిపిస్తుంది. తర్వాత ఐశ్వర్య వెళ్తూ గులాబి ముళ్లు మీద కాలు వేసి పడిపోబోతే రంజిత్ పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు. ఇంతలో సుధాకర్ పిలవడంతో వచ్చేస్తున్నా మామయ్యా అని వెళ్లిపోతుంది. 

విజయానంద్, మంజుల, సాహితి హాల్‌లో ఉంటారు. సిద్ధూ ఎక్కడ అని విజయానంద్ అంటే ప్రేరణ వాళ్ల ఇంటికి వెళ్లుంటాడు అని సాహితి అంటుంది. మరోవైపు ప్రేరణ సిద్ధూ రాడు అని బెట్ కడితే ఐశ్వర్య వస్తాడు అని బెట్ కడుతుంది. ఇంతలో సిద్ధూ ఎంట్రీ ఇస్తాడు. ప్రేరణ నోరెళ్ల బెడుతుంది. మీ కోసమే వెయిట్ చేస్తున్నాం బాబు అని ఇందిర అంటే రావాల్సి వచ్చింది అని అంటాడు. ప్రేరణ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. సిద్ధూ మనసులో ఇప్పటి వరకు నాతో ఆడుకున్నావ్ కదా.. ఇప్పుడు నీకు నేను చుక్కలు చూపిస్తా.. సిద్ధూ 2.0 చూపిస్తా అనుకుంటాడు. ఇక ఐశ్వర్య సిద్ధూతో మీరు వచ్చిన విషయం  ఒకరికి చెప్పాలి బావగారు ఇప్పుడే చెప్పేసి వస్తా అని వెళ్తుంది. వెంటనే సాహితికి కాల్ చేస్తుంది. విజయానంద్ స్పీకర్ పెట్టమనిఅంటాడు. మీ అన్నయ్య అదే మా బావగారు ఇక్కడికి వచ్చారు అని ఐశ్వర్య అనడంతో విజయానంద్ నోరెళ్లబెడతాడు. 

బామ్మ ఫస్ట్‌నైట్ రోజు ఆడే ఆటలు కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. సిద్ధూని పంచె కట్టులో చూసి ప్రేరణ ఫిదా అయిపోతుంది. ఇక సిద్ధూ పంచె సరిగా కట్టుకోలేదని బామ్మ వెళ్లి పంచె కట్టేస్తుంది. సిద్ధూ చాలా సిగ్గు పడతాడు. తర్వాత సిద్ధూ ప్రేరణలు కింద ఏర్పాటు చేసిన చాప మీద కూర్చొని బామ్మ ఫస్ట్‌నైట్ ఇక్కడేనా అని అడుగుతాడు. అందరూ నవ్వుతారు. ఇది ప్రపరేషన్‌ మనవడా అని బామ్మ అంటుంది. తర్వాత ప్రేరణ, సిద్ధూలతో బంతి ఆట ఆడిస్తుంది. ఇద్దరూ  ఒకరిని ఒకరు కొట్టుకున్నట్లు ఆడుతారు. ఓరేయ్ మీ దుంప తెగ సిగ్గు పడుతూ ఆడండి అని బామ్మ అంటుంది. తర్వాత నేను గెలవాలి అంటే నేను గెలవాలి అని ఇద్దరూ ఆడుతూ అందర్ని నవ్విస్తారు. తర్వాత బామ్మ సిద్ధూకి తాంబూలం తినిపించమని ప్రేరణకు చెప్తుంది. ప్రేరణ చేతి వేళ్లకి తాంబూలాలు పెట్టుకొని సిద్ధూ తినడానికి వస్తే వేళ్లు మార్చుతూ ఆటపట్టిస్తుంది. చివరకు సిద్ధూ ప్రేరణ చేయి పట్టుకొని తినేస్తాడు. తర్వాత ప్రేరణ సిద్ధూలను ఫస్ట్‌నైట్ గదికి పంపిస్తారు.

సిద్ధూ గదిలో అటు తిరిగి ఉంటే ప్రేరణ పాల గ్లాస్‌తో లోపలికి వెళ్తుంది. తన వాళ్లని గుర్తు చేసుకొని పాపం వీళ్లు చాలా ఊహించుకొని ఇంత చేశారు. కానీ గదిలో ఇద్దరం చెరో వైపు తిరిగి చెరో పుస్తకం చదువుకోవడమే కదా. ఈ పాలు తాగుతాడా.. నేను ఇస్తే తాగడులే అని పాల గ్లాస్‌ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతుంది. ఏంటి పాల గ్లాస్ అక్కడ పెడుతున్నావ్ అని సిద్ధూ ప్రేరణ దగ్గరకు వెళ్తాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. తెచ్చింది తాగడానికే కదా పక్కన పెడుతున్నావేంటి అని సిద్ధూ తీసుకొని సగం తాగి ప్రేరణకు ఇస్తాడు. నేను బయటకు వెళ్లి తాగుతా అని ప్రేరణ అంటే అదేంటి ప్రేరణ భర్తలో సగం భార్య మరి తాగను అంటే ఎలా అని ప్రేరణతో తాగించేస్తాడు.

ప్రేరణ మూతికి పాలు అతుక్కుంటే నీకు పాల మీసాలు వచ్చాయ్ అని అంటాడు. ప్రేరణ తుడుచుకుంటే ఏయ్ నేను ఉన్నా కదా నీకు ఎందుకు శ్రమ అని సిద్ధూ తన చేతితో తుడుస్తాడు. ప్రేరణ పడిపోతుంటే పట్టుకొని దగ్గరకు తీసుకొని  మూతి తుడుస్తాడు. ఇక ప్రేరణతో ఫస్ట్‌నైట్ రోజు మీ ఆయనకి స్వీట్ ఇవ్వవా అని అడుగుతాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget