అన్వేషించండి

Brahmamudi Serial Today May 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పెళ్లి చేసుకుని రేఖకు షాక్‌ ఇచ్చిన ఇందు – రాజును చూసిన ఆనందంలో అపర్ణ  

Brahmamudi serial today episode May 8th: ఇందు రాజు పెళ్లి చేసుకుని ఇంటికి రావడం చూసిన రేఖ షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:  బ్రహ్మముడి సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో చాలా ఆసక్తికరంగా జరిగింది. ఇందును కిడ్నాప్‌ చేసేందుకు రాజు ప్రయత్నిస్తే.. భ్రమరాంబ అడ్డుకుంటుంది. దీంతో కత్తితో చంపేస్తానని రాజు బెదిరించి ఇందును తీసుకుని వెళ్లిపోతాడు. కట్‌ చేస్తే.. ఇంట్లో మదన్‌ను పెళ్లి కొడుకును చేస్తుంటారు రేఖ, భూషణ్‌.

రేఖ: నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటి నాన్న ఇలా మూడీగా ఉన్నావు ఈ రోజు నీ పెళ్లి కొంచెం సంతోషంగా ఉండు..

భూషణ్‌:  వాడికి ఇష్టం లేని పెళ్లి కదా ఇంకేం సంతోషంగా ఉంటాడు

రేఖ: నువ్వేం బాధపడకు నాన్న నేను చెప్పడం వల్లే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు.. దీనివల్ల నీ లైఫ్‌ బాగుంటుంది. అంతే కానీ నీకు ఏ ప్రాబ్లమ్‌ రాదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పని వల్ల మీ అమ్మమ్మ ఎన్నో ఏళ్ల కింద కల నిజం కాబోతుంది. మేమంతా ఇన్నాళ్లుగా చేయలేనిది నువ్వు చేయబోతున్నావు.. నీ వల్ల దుగ్గిరాల ఆస్థి మొత్తం మన చేతుల్లోకి రాబోతుంది.

భూషణ్‌: అవునురా నువ్వు ఈ ఇంటికే యువరాజు అవబోతున్నావు.. నీతో పాటు మేము కూడా కోటీశ్వరులం అవబోతున్నాం. ఇక మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇన్నాళ్లు మేము డబ్బుకోసం పది మంది చుట్టు తిరిగాం.. ఇక మీదట ఆ డబ్బు కోసం ఆ పది మందే మన చుట్టూ తిరుగుతారు..

రేఖ: అవును నాన్న నువ్వు కేవలం ఇందు మెడలో తాళి కట్టు మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను.. ఇక నుంచి నీ లైఫ్‌ చాలా అద్బుతంగా ఉంటుంది.

స్వాతి అక్కడకు వస్తుంది.

మదన్‌: ఏయ్‌ స్వాతి పెళికొడుకు గెటప్‌లో ఎలా ఉన్నాను.. ఈ డ్రెస్‌ నాకు సూట్‌ అయిందా..?

స్వాతి: చాలా బాగున్నావు బావ. డ్రెస్‌ కూడా చాలా బాగుంది.

మదన్‌: థాంక్యూ స్వాతి.. కానీ ఏం చేస్తాం.. పోయి పోయి ఒక చదువు రాని దద్దమ్మను పెళ్లి చేసుకుంటున్నాను

స్వాతి: మరి అంత ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం ఎందుకు..?

మదన్‌: మా మమ్మీ కోసం చేసుకుంటున్నాను.

స్వాతి: మీ మమ్మీ కోసం ఏమైనా చేస్తావా..? బావ

మదన్‌: అవును ఏమైనా చేస్తాను

రేఖ: ఏయ్‌ ఏంటే నేను సైలెంట్‌గా ఉన్నానని ఏదేదో అడిగేస్తున్నావు.. ఇంతకీ మీ మమ్మీ గుడి నుంచి వచ్చిందా..? చెప్పు మీ అక్క గుడి నుంచి వచ్చిందా..?

స్వాతి: ఇంకా  రాలేదు ఆంటీ..

రేఖ: ఇంకా రాలేదా..? పద వెళ్దాం..

అంటూ రేఖ మదన్‌ను తీసుకుని హాల్లోకి వెళ్లి అపర్ణను పిలుస్తుంది. రూంలోంచి అపర్ణ, సుభాష్‌ రాగానే.. ఇందు గురించి అడుగుతుంది. నన్ను అడుగుతావేంటి..? వెంట వెళ్లిన భ్రమరాంబకు ఫోన్‌ చేయోచ్చు కదా అంటుంది అపర్ణ. అప్పుడే భ్రమరాంబ పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి ఇందును కిడ్నాప్‌ చేశారని చెప్తుంది. అందరూ షాక్‌ అవుతారు. రేఖ కోపంగా అపర్ణను తిడుతూ మరో కొత్త నాటకం ఆడుతున్నావా..? ఎక్కడ నీ మనవరాలు అంటూ గన్‌ తీసుకుని కాల్చేస్తానని బెదిరిస్తుంది. అపర్ణ తనకు తెలియదని.. కాల్చేస్తే కాల్చేయమని ధైర్యంగా చెప్పగానే.. రేఖ కోపంగా కాల్చబోతుంటే..గుమ్మం వైపు నుంచి రాజు ఆగండి అంటూ అరుస్తాడు. అందరూ తిరిగి చూస్తే అక్కడ రాజు, ఇందు పెళ్లి చేసుకుని పూలదండలతో వచ్చి ఉంటారు. రాజును చూసిన అపర్ణ ఆశ్చర్యంతో ఆనందపడుతుంది.

అపర్ణ: ఏవండి నా కొడుకు.. నాన్న రాజ్‌..

రేఖ: ఆంటీ తను నీ కొడుకు కాదు.. తనకు ఈ ఇంటికి అసలు సంబంధం లేదు.. ఒసేయ్‌ ఇందు ఏం చేశావే నువ్వు

అంటూ కొట్టబోతుంటే.. రాజు అడ్డుపడతాడు. తను నా భార్య నా ముందే నా భార్యను కొట్టే హక్కు మీకు లేదు అంటూ రేఖకు ఎదురు సమాధానం చెప్తాడు. ఇందు, మదన్‌ పెళ్లి ఆగిపోయినందుకు భ్రమరాంబ, శేషు మనసులో సంతోషపడతారు. రేఖకు రాజు వార్నింగ్‌ ఇస్తాడు. ఇందును కిడ్నాప్‌ చేసింది తానేనని అప్పుడే ఇందులో ప్రేమలో పడ్డానని చెప్పడంతో రేఖ మరింత షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget