అన్వేషించండి

chinni serial today may 8th: చిన్ని సీరియల్: శ్రేయ మెడలో తాళి కట్టిందెవరు? కావేరి ఆత్మ మళ్లీ ఎంట్రీ ఇచ్చిందా!

chinni serial today episode may 8th మ్యాడీ, చందులు కలిసి లాయర్ హరిని వెతకడం చివరకు ఆయన్ను కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode వసంత మ్యాడీతో చావు బతుకుల మధ్య ఉన్న శ్రేయ మెడలో తాళి కట్టమని చెప్తుంది. ఒకసారి పెళ్లి అయిన నేను మళ్లీ ఎలా పెళ్లి చేసుకోవాలి అని మ్యాడీ అడుగుతాడు. దేవా మ్యాడీతో చిన్నప్పుడు శ్రేయకి మాటిచ్చింది నేను ఇప్పుడు తాళి కట్టమని చెప్పింది కూడా నేనే అని అంటాడు. దానికి చందు ఒకసారి చిన్నిని పెళ్లి చేసుకున్న మ్యాడీ శ్రేయని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అంటాడు. అసలు నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు., బయటకు వెళ్లు అని వసంత చందుని గెంటేస్తుంది. 

నాగవల్లి మ్యాడీతో నాన్న ఎవరు ఏం చెప్పినా వినొద్దు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు శ్రేయకి తాళి కట్టడమే మంచిది.. నువ్వు తాళి కట్టకపోతే నా మీద ఒట్టే అని నాగవల్లి అంటుంది. తాళి తీసుకురమ్మని దేవా చెప్తాడు. నాగవల్లి బయటకు వెళ్లి చిన్నితో మరి కాసేపట్లో మ్యాడీ శ్రేయ మెడలో తాళి కట్టబోతున్నాడు అని అంటుంది. చిన్ని షాక్ అయిపోతుంది. నాగవల్లి సైగ చేయడంతో లోహిత చిన్నిని ఓ గదిలో బంధించేస్తుంది. డోర్ తీయమని చిన్ని చాలా ఏడుస్తుంది. నాగవల్లి తాళి తీసుకొచ్చి మ్యాడీకి ఇస్తుంది. అందరూ తాళి కట్టమని మ్యాడీకి ఫోర్స్ చేస్తారు. మ్యాడీ శ్రేయ మెడలో తాళి కట్టడానికి రెడీ అయిపోతాడు. మ్యాడీ శ్రేయ మెడలో తాళి కట్టడానికి వెళ్తున్నప్పుడు.. కావేరి ఆత్మని బంధించిన సీసా గాలికి తెగి కింద పడి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. దాంతో హాస్పిటల్‌లో కరెంట్ పోతుంది. చిన్నిని బంధించిన గది డోర్ ఓపెన్ అవుతుంది. 

చిన్ని మ్యాడీ వాళ్ల దగ్గరకకు పరుగులు పెడుతుంది. చిన్ని వచ్చేసరికి శ్రేయ మెడలో తాళి ఉంటుంది. అది చూసి చిన్ని షాక్ అయిపోతుంది. శ్రేయ కళ్ల తెరుస్తుంది. బావ నా మెడలో తాళి కట్టావా,.. నన్ను బతికించడం కోసం నా మెడలో తాళి కట్టావా అని తాళికి దండం పెట్టుకుంటుంది. నీ మెడలో తాళి కట్టింది నేను కాదు అని మ్యాడీ శ్రేయతో పాటు అక్కడున్న అందరికీ షాక్ ఇస్తాడు. నువ్వు కాదా మరి ఎవరు మనల్ని ఇంత మోసం చేసింది అని దేవా అంటాడు. దాంతో చందు వచ్చి నేనే శ్రేయ మెడలో తాళి కట్టాను.. చిన్నిని పెళ్లి చేసుకున్న మ్యాడీ శ్రేయని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది అని అంటాడు.

శ్రేయ లేచి ఏంటి అత్తయ్యా ఇది బావ చేత తాళి కట్టంచుకోవడానికి నేను ఇంత చేస్తే మధ్యలో ఈయన వచ్చి ఇంత చేశాడేంటి అని అంటుంది. అంతే నా చేత తాళి కట్టించుకోవడానికి నాటకం ఆడావా అని మ్యాడీ అంటే అవును అని శ్రేయ అంటుంది. అందుకే నీ నాటకాన్ని దేవుడు ఇలా తిప్పికొట్టాడు.. ఎవరు అవును అన్నా కాదు అన్నా చిన్ని నా భార్య. మన ఇంటి కోడలు.. కాస్త ఓపిక పట్టండి చిన్ని వాళ్ల అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తా అని చెప్పి చిన్నిని తీసుకెళ్లిపోతాడు.  

శ్రేయ చందుని కొడుతుంది. చందు శ్రేయతో కొడితే కొట్టు శ్రేయ కానీ ఆ తాళిని ఎగతాళి చేయకు అని అంటాడు. దేవా కోపంగా నీ బతుకుకి నా  మేనకోడలు కావాల్సి వచ్చిందా అని చందుని కొడతాడు. చందుని దేవా కొడుతుంటే నాగవల్లి ఆపుతుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరైనా వైరల్ చేస్తారేమో అని ఆపుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత శ్రేయ చందు ఇంటికి వెళ్లి తాళి ముఖాన విసిరి కొడతా అని అంటుంది. అలా చేయడం తప్పు అని శ్రేయకి చిన్ని, మ్యాడీ చెప్తారు. ఎవరో దారిన పోయిన దానయ్యతో నేను జీవితాంతం ఉండాలా అని శ్రేయ అంటే చందు దారిన పోయిన వాడు కాదు.. చాలా మంచోడు.. అలాంటి వాడు నీకు దొరకడం నీ అదృష్టం.. ఇక నుంచి నా గురించి ఆలోచించడం మానేసి చందుతో ఉండమని  చెప్పండి అని మ్యాడీ అంటాడు. నేను ఏం చెప్పే పరిస్థితుల్లో లేను అని నాగవల్లి వెళ్లిపోతుంది. దేవా కూడా వెళ్లిపోతాడు. వసంత శ్రేయని వెళ్లమని అంటే శ్రేయ వెళ్తుంటే కావేరి మాటలు వినిపిస్తాయి. నీ మెడలో తాళి తీసేస్తే మెడ మీద తలకాయ నేను తీసేస్తా అని కావేరి మాటలు వినిపిస్తాయి. దాంతో శ్రేయ ఇంట్లోకి వెళ్లిపోతుంది.

చిన్ని మ్యాడీతో శ్రేయ ఇప్పుడు ఆగిపోయింది అంటే తన మనసు మారుతుంది. అలా మారాలి అంటే మనమే ఏదో ఒకటి చేయాలి అని చిన్ని, మ్యాడీ అనుకుంటారు. లోహి చెప్తే వింటుంది కదా అని మ్యాడీ అంటాడు. లోహి శ్రేయ దగ్గరకు వెళ్లి ఆ చందుకి అంత సీన్ లేదు వాడిని నువ్వు భర్తగా అంగీకరించొద్దు.. వాడు మన కాలి గోటికి కూడా సరిపోడు వాడిని వదిలేయ్ అని అంటుంది. మెడలో తాళి తీసేయ్ అని లోహిత చెప్తుంది. శ్రేయ తీసే టైంకి లోహిత మీదకు కావేరి ఆత్మ వచ్చి మెడతో తాళి తీయొద్దు అని అంటుంది. తీసేస్తా అని శ్రేయ అంటే లోహి గొంతు పట్టుకుంటుంది. శ్రీమతి శ్రేయాచంద్రశేఖర్.. రెండు రోజుల్లో నువ్వు అత్తారింటికి వెళ్లకపోయినా.. తాళి తీసేసినా ఈ తలకాయ గుమ్మడి కాయలా వేలాడుతుందని అంటుంది. తర్వాత లోహిత మీద ఉన్న ఆత్మ వెళ్లిపోయిన తర్వాత లోహి మళ్లీ తాళి తీసేయమని అంటుంది. 

చిన్ని మ్యాడీతో హరి అంకుల్‌ని అంతా వెతికాం కానీ ఆయన ఇంట్లో వెతకలేదు కదా.. మనల్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఇంట్లోనే ఉంచొచ్చు కదా అక్కడికి వెళ్లి చూస్తే బెటర్ కదా అంటే నేను చందు వెళ్లి వెతుకుతాం అని మ్యాడీ వెళ్తాడు. చందుని కలుస్తాడు. మ్యాడీ చందు వెళ్లి లాయర్ ఇంట్లో వెతుకుతారు. అక్కడే లాయర్‌ని రౌడీలు కొట్టడం చూసి వాళ్ల నుంచి హరిని కాపాడతారు. ఎవరు బాబు మీరు అని అంటే నేను చందు, మహి అని పరిచయం చేసుకుంటారు. హరి చాలా సంతోషపడతాడు. మహిని చూసి దేవేంద్ర వర్మ గారి అబ్బాయి కదా అని కంగారు పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget