Podharillu Serial Today May 8th:చక్రి అన్నదమ్ములతో గొడవపడిన ఆది...బాధపడిన మహాలక్ష్మీ
Podharillu Serial Today Episode May 8th: తమ తండ్రి నారాయణ, మహ తండ్రి ప్రతాప్‌తో కలిసి మందు తాగుతున్న ఫోటోలను చూసి షాక్‌కు గురైన మహ, వెంటనే తన భర్తలను వారిని తీసుకురావాలని పంపిస్తుంది.

Podharillu Serial Today Episode: కూతురు కనిపించడంతో బాధతో బార్‌లో కూర్చుని ప్రతాప్ మందు తాగుతుండగా....అక్కడికి వచ్చిన నారాయణను పిలిచి మందు ఆఫర్ చేస్తాడు.ఎందుకు అలా విచారంగా ఉన్నారని అడగ్గా....నా కూతురు కనిపించిందని, మళ్లీ తనను బాధపెట్టిందని అంటాడు. మీరు అనవసరంగా అన్ని విషయాలు గురించి ఆలోచించకుండా క్షమించి వదిలేయండని నారాయణ అంటాడు. నా కూతురు గురించి వదిలేయమని...మీ కొడుకులు ఏం చేస్తుంటారని అడుగుతాడు ప్రతాప్. బతకడానికే ఏవో పనులు చేసుకుంటారని..కానీ ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయరని చెబుతాడు. అయితే మీరు అదృష్టవంతులేనని ప్రతాప్ అంటాడు.
ఇంతలో ఫొటో దిగుదామా అని అడగ్గా....ప్రతాప్ బాయ్‌కు ఫోన్ ఇచ్చి మాఇద్దరినీ ఫొటో తీయమని చెబుతాడు. నా ఫోన్ మామూలు ఫోన్ అని....మా కోడలు నెంబర్ ఇస్తాను దానికి ఫొటోలు పంపమని నారాయణ చెబుతాడు.దీంతో ప్రతాప్ మహా ఫోన్‌కు ఫొటోలు పంపుతాడు. డిన్నర్ టైం అవుతున్నా నారాయణ రాకపోవడంతో మహా చక్రిని అడుగుతుంది. ఎక్కడో తాగి పడుకుని ఉంటాడులేండని అంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా మనం మీనాన్నతో కలిసి భోజనం చేయలేదని....వెళ్లి పిలుచుకుని రండని చెబుతుంది.అప్పుడే ఆమె ఫోన్‌కు ఫొటోలు వస్తాయి.వాటిని చూసిన మహా షాక్‌కు గురవుతుంది. మీనాన్న, మానాన్న కలిసి మందు తాగుతున్నారని చెబుతుంది. వెళ్లి వెంటనే తీసుకుని వద్దామని మాధవ్, కన్నా, కేశవ్ బయలుదేరతారు.
ఆది వాళ్ల ఫ్రెండ్‌ను పిలిచి మర్యాదగా ఆ అలగా జనాన్ని ఇక్కడి నుంచి బయటకు పంపించమని కోరతాడు. మహా ఆ కారు డ్రైవర్‌గాడితో లేచిపోయిన తర్వాత మానాన్న ఎంత బాధపడ్డారో నీకు తెలుసుకదా అని అంటాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చినా మనశ్శాంతి లేకుండా ఉంటున్నారనే కదా ఇక్కడికి తీసుకొచ్చానని అంటాడు. వాళ్లు ఇక్కడికి కూడా దాపురించారని మండిపడతాడు.వెంటనే వాళ్లను ఇక్కడి నుంచి పంపించేయమని కోరతాడు. ఇది నా ఒక్కడి రీసార్ట్‌కాదురా అని చెబుతాడు. వాళ్లు లీగల్‌గా అన్ని పేపర్లపై సంతకాలు పెట్టి డబ్బులు కట్టి రీసార్ట్‌కు వచ్చారని...ఇప్పుడు నేను వెళ్లమంటే వాళ్లు కోర్టుకు వెళ్తారని అంటాడు. ఈ రీసార్ట్‌కు ఉన్న మంచి పేరు కూడా పోతుందని అంటాడు. దీంతో నాకు,నా పార్టనర్‌కు మధ్య రిలేషన్ దెబ్బతింటుందని చెబుతుండగా....మాధవ్, కన్నా, కేశవ్ వాళ్ల నాన్నను తీసుకుని వెళ్లేందుకు అటు వస్తారు. ఆది వాళ్లను చూసి బూతులు తిడతాడు.మహాను కూడా తిట్టడంతో కేశవ్‌కు కోపం వచ్చి ఆది చెంపపగులగొడతాడు.
ఆది, కేశవ్ గొడవపడుతుంటే...మాధవ్,కన్నావాళ్లని విడదీస్తుంటారు. ఇంతలో గొడవ పెద్దదైపోతుంది. చక్రి,మహా వీళ్లు ఇంకా రాలేదేంటని ఎదురువస్తారు.అక్కడ,ఆది కేశవ్ గొడవపడటం చూసి వచ్చి విడదీస్తారు. ఇంతలో నారాయణ,ప్రతాప్ కూడా అక్కడికి వస్తారు. దీంతో ఎవరెవరో తెలుసుకుంటారు. ప్రతాప్ ఆదినారాయణను తిట్టి..నువ్వు నాకు వియ్యంకుడు ఏంటిరా అంటూ వెళ్లిపోతాడు. ఒకరినొకరు బాగా తిట్టుకుంటూ గొడవపడుతుండటాన్ని అక్కడికి వచ్చిన వారంతా చూసి నవ్వుకుంటారు. దీంతో రిసార్ట్ యజమాని...ఆదికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. మాధవ్ వాళ్లు కూడా వెళ్లిపోతారు.
ఈగొడవతో మహాలక్ష్మీ బాధపడుతుండటం చూసి అందరూ డ్యాన్స్ పోటీలు పెడతారు. నారాయణ,కేశవ్,చక్రితోపాటు అందరూ డ్యాన్స్‌లు వేయడం చూసి మహా మళ్లీ నవ్వుతుంది. వాళ్లతోపాటు ఆమె కూడా డ్యాన్స్‌లు వేస్తుంది.అది చూసిన ప్రతాప్,ఆది ఆ అలగా జనంతో కలిసి ఎలా చిందులు వేస్తుందో చూడని లలితకు చూపించి బాధపడతారు.
Before You Go
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















