అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today may 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: శ్రీవల్లి కోసం ఎంట్రీ ఇచ్చిన సుకన్య ఎవరు? నగలు కోసం మళ్లీ భద్రావతి గొడవ! ప్రేమ చెప్పిన నిజమేంటి?

Illu Illalu Pillalu Serial Today Episode may 8th ప్రేమ నగలు అమ్మేయాలని ధీరజ్ చూస్తున్నాడని భద్రావతి గొడవ చేయడం ప్రేమ అత్తకి ఎదురు తిరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode  వల్లీకి తాను ప్రెగ్నెంట్ కాదని తెలియడంతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ ఒక్క సారికి తనని కాపాడమని వల్లీ డాక్టర్‌ని వేడుకోవడంతో వేరే వాళ్ల స్కానింగ్ రిపోర్ట్స్ డాక్టర్ వల్లీకి ఇవ్వడం.. అవి తనవే అని వల్లీ నర్మద, ప్రేమలకు చూపించడంతో ఇద్దరూ వల్లీ నిజంగానే ప్రెగ్నెంట్ అని నమ్మేస్తారు. నర్మద తెచ్చిన వల్లీ స్కానింగ్ రిపోర్ట్స్‌ని రామరాజు, వేదవతి ఒకరి తర్వాత ఒకరు చూసి తెగ సంబర పడిపోతుంటారు. కచ్చితంగా కొడుకే అని వేదవతి అంటే లేదు కచ్చితంగా కూతురే అని రామరాజు అనుకుంటారు. ఇంతలో వల్లీ బాధగా ఇంటికి వస్తుంది. 

నర్మద వల్లీని చూసి అమ్మాయి.. అబ్బాయి అని మీరు గొడవ పడటం ఎందుకు ఏ బిడ్డని కంటుందో అక్కనే అడగండి అని నర్మద అంటుంది. వేదవతి వల్లీతో ఆడపిల్లని కంటావు అని మీ మామయ్య మగపిల్లాడిని కంటావు అని నేను అనుకుంటున్నాం.. నువ్వు చెప్పమ్మా ఏ బిడ్డని కంటావ్ అని అడుగుతుంది. వల్లీ ఏదో ఆలోచిస్తూ అసలు నా కడుపులో ఏం ఉంటే కదా అని అంటుంది. ఆ మాటతో అందరూ షాక్ అయిపోతారు. ఏంటి వల్లీ అలా అన్నావ్ అని వేదవతి అడిగితే నా చేతుల్లో ఏం లేదు కదా ఆ దేవుడు ఏది ఇస్తే అదే అని వల్లీ కవర్ చేస్తుంది. అందరూ రిలాక్స్ అయిపోతారు. వల్లీ మనసులో దేవుడా నాకు కడుపు అని చెప్పి మా అమ్మ ఈ టెన్షన్ పెట్టింది నువ్వే నన్ను ఈ గండం నుంచి బయట పెట్టాలి అని అనుకుంటుంది. ఇంతలో ఇంటికి ఖడ్గం సినిమాలో రవితేజకు జోడీగా నటించిన హీరోయిన్ ఎంట్రీలా సుకన్య ఏంట్రీ ఇస్తుంది. తిరుపతి తనతో మాట్లాడి ప్రేమించడం మొదలు పెట్టేస్తాడు. సుకన్య మాత్రం తిరుపతిని అంకుల్ అంకుల్ అంటుంది. 

సుకన్యని చూసి రామరాజు, వేదవతి వాళ్లు ఎవరు అని అడుగుతారు. సుకన్య వచ్చి వల్లీని హగ్ చేసుకుంటుంది. నువ్వేంటే సడెన్ ఎంట్రీ ఏంటి అని వల్లీ అడిగితే అత్త నిన్ను దగ్గరుండి చూసుకోమని నాకు చెప్పింది అని సుకన్య అంటుంది. నాకు కడుపే లేదు ఇంకేం చూసుకుంటావ్ అంటే అందుకే అదే ఎవరికీ తెలీకుండా మ్యానేజ్ చేయమని పంపిందని అంటుంది. వల్లీ ఇంట్లో అందరికీ సుకన్య తన మామయ్య కూతురు అని చెప్తుంది. మా కోడలిని మేం చూసుకోమా ఏంటి అని వేదవతి అంటే ఒకరికి నలుగురు చూసుకుంటే మంచిది అని మా అత్తయ్య పంపిందని సుకన్య అంటుంది. నర్మద ధీరజ్‌తో ఈవిడ కొంచెం తేడాగా ఉంది కాస్త కనిపెడుతూ ఉండాలి అని అంటుంది. నాకు అదే అనుమానంగా ఉందని ధీరజ్ అంటాడు. ఇంతలో ప్రేమ ని తీసుకొని భద్రావతి, సేనాపతి వచ్చి రేయ్ రామరాజు బయటకు రారా అని గోల చేస్తాడు.

ప్రేమ ఎంత బతిమాలినా భద్రావతి ఊరుకోదు.. రామరాజు బయటకు వచ్చి ఏమైంది ఎందుకు గొడవ చేస్తున్నావ్ అని అడుగుతాడు. నీ చిన్న కొడుకు నగలు తాకట్టు పెట్టమని ప్రేమని బ్యాంక్‌కి పంపాడు.. మరి తూ అన్ని ఉమ్మేయకుండా ఏం చేయాలి అంటుంది. చిన్నోడా ఏంట్రా ఇది అని అడిగితే నాకు ఏం తెలీదు నాన్న అని ధీరజ్ అంటాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఎంత బాగా నటిస్తున్నారురా.. నా మేనకోడలు బ్యాంక్‌కి వెళ్లిన విషయం నీకు తెలీదా అని నిలదీస్తుంది. తెలీదు అని చెప్తే అర్థం కాదా..  బుర్రకి ఎక్కదా.. ఎందుకు ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా అరుస్తున్నావ్‌ అని వేదవతి అడుగుతుంది. ఏయ్ ఆపు దీని వల్లే తెలుస్తుంది మీ దరిద్రపు దిక్కుమాలిన పెంపకం అని భద్రావతి అంటుంది. భద్రావతి నోరు అదుపులో పెట్టుకో.. మా పిల్లల్ని ఎలా పెంచుకున్నాం నీకేం తెలుసు అని వేదవతి అంటుంది. అంత సంస్కారంతో పెంచబట్టేనా పెళ్లాం నగలు తాకట్టు పెట్టి బతుకుతుంది.. అని సాగర్‌ని ఉద్దేశించి సేనాపతి అంటాడు. ఇన్నాళ్లు నీ బతుకే చెండాలం అనుకున్నాం.. ఇప్పుడు నీ కొడుకుల పరిస్థితి అలాగే ఉందని అంటాడు. మా నాన్నని ఇంకొక్క మాట అంటే ఊరుకోను అని ధీరజ్ అంటాడు. నాన్న ఆ నగలు గురించి ధీరజ్‌కి తెలీదు.. ఒక భార్యగా నా భర్తకి అండగా ఉండటానికి నేనే ఆ నగలు తాకట్టు పెట్టడానికి వెళ్లాను.. ధీరజ్ కష్టం చూడలేక నగలు తీసుకోమని చాలా సార్లు చెప్పా కానీ వాడు వద్దు అన్నాడు.. అసలు ఆ నగలు నా దగ్గర ఉండటమే వాడికి ఇష్టం లేదు.. మీకు ఇచ్చేయమని చాలా సార్లు చెప్పాడు.. అలాంటి వాడు నాకు నగలు తాకట్టు పెట్టమని అంటాడా అని ప్రేమ అంటుంది. 

భద్రావతి ఇంకా గొడవ చేస్తుంటే భద్రావతి తల్లి ఆపి.. ఆ నగలు నా మనవరాలి కోసం చేసింది.. వాటి మీద తన భర్తకి పూర్తి హక్కు ఉంది.. వాళ్లు తాకట్టు పెట్టుకుంటారో.. అమ్మేస్తారో వాళ్ల ఇష్టం మీకు ఎందుకు అని అంటుంది. ప్రేమని అంతబాగా చూసుకునే భర్త, కుటుంబం ఉంటే ఇంకా వాళ్లు గురించి మనకు ఎందుకు అని రేవతి అంటుంది. వాడు ఆ నగలు కోసమే మన ప్రేమని పెళ్లి చేసుకున్నాడు.. రేపటి రోజున ఆస్తిలో వాటా తెమ్మని ప్రేమని గెంటేస్తాడు..నగలు కోసమే ప్రేమని ట్రాప్ చేశాడు.. నగలు కోసమే ప్రేమని పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది. అత్త ధీరజ్ గురించి తెలీకుండా మాట్లాడకు అని ప్రేమ అరుస్తుంది. ధీరజ్ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే మేనత్త అని చూడను.. ఆస్తి కోసం నగలు కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటున్నావ్ కదా.. అసలు మా పెళ్లి ఎలా జరిగిందో నీకు తెలుసా.. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే వీడు నాకు తాళి కట్టాడో తెలుసా.. ఆ రోజు నేను చావాలో బతకాలో తెలీని పరిస్థితుల్లో ఉంటే ఏం జరిగిందో తెలుసా అని ప్రేమ అంటే.. ధీరజ్ ఆపుతాడు.. ఎందుకు ఆపుతావ్ ధీరజ్ నీ మంచితనం వీళ్లకి తెలియాలి,, నీ కాళ్లు కడిగి వీళ్లు నీళ్లు నెత్తిన వేసుకోవాలి అంతే కానీ ఇన్ని మాటలు అంటే భరించే ఓపిక నాకు లేదు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 29th: నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
నువ్వులేక నేను లేను: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
Podarillu Serial Today July 29th: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
పొదరిల్లు: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget