అన్వేషించండి

Jagadhatri Serial Today May 7th:అవినాష్‌ కాళ్లు పట్టుకుని సారీ చెప్పిన కేదార్‌....నిషిక గర్భవతి కాదని జగధాత్రికి అనుమానం.

Jagadhatri Serial Today Episode May7th:అవినాష్‌ కాళ్లు పట్టుకుని సారీ చెప్పిన కేదార్‌....నిషిక గర్భవతి కాదని జగధాత్రికి అనుమానం.

Jagadhatri Serial Today Episode: అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ధాత్రి,కేదార్‌కు వాడు బంపర్‌ ట్విస్ట్ ఇస్తాడు. నేను భయంతో పారిపోతానని ఎలా అనుకున్నావ్‌ జేడీ  అని అంటాడు. నేను మీ ఇంటికి వచ్చి అంత గొడవ చేసిన తర్వాత నువ్వు నన్ను వదిలిపెడతావని ఎలా అనుకుంటాను.ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసని అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నానని అంటాడు. మీ ఇంట్లో మాటలురాని ఓపాప ఉండాలి కదా ఇప్పుడు ఉందో లేదో కనుక్కోండని అంటాడు.నువ్వు అబద్ధం చెబుతున్నావని అనగా....ఒకసారి మీ వదినకు ఫోన్ చేసి కనుక్కోమని అంటాడు.వెంటనే జేడీ కౌషికికి ఫోన్ చేసి పాపకు ఏమైందని అడుగుతుంది. ఇప్పుడే ఐస్‌క్రీమ్ కోసం రోడ్డుమీదకు వస్తే...ఎవరో పాపను కిడ్నాప్ చేశారని చెబుతుంది. మీరు ఏం భయపడొద్దని....పాపను కిడ్నాప్ చేయడంతో ఎవరో చూసి మాకు ఫోన్ చేశారని జేడీ చెబుతుంది. మేం పాపను తీసుకుని వస్తామని అంటుంది. పాపను ఏం చేయవద్దని కేదార్‌, జేడీ బ్రతిమలాడతారు. నువ్వు వచ్చి నా కాళ్లు పట్టుకుని సారీ చెబితే పాపను వదిలేస్తానని లేకపోతే చంపేయమని మామావాళ్లకు చెబుతానని అంటాడు. అలాగే రౌడీలకు ఫోన్ చేసి నిమిషంలో నేను ఫోనే చేయకపోతే పాపను చంపేయమని చెబుతాడు. దీంతో చేసిది లేక కేదార్ అవినాష్‌ కాళ్లు పట్టుకుని సారీ చెబుతాడు. దీంతో పాప బయట కారులోనే ఉందని వెళ్లి తీసుకోండని అవినాష్ చెబుతాడు. ఇప్పుడు కూడా నువ్వు గెలిచావని అనుకోవద్దని....నీ భయమే నిన్ను ఆడవాళ్లను, చిన్నపిల్లలపై ప్రతాపం చూపేలా చేస్తుందని జేడీ హెచ్చరిస్తుంది. అసలు భయం అంటే ఏంటో త్వరలోనే నీకు చూపిస్తానని చెప్పి వెళ్లిపోతుంది.
                           పాపను తీసుకుని జగధాత్రి, కేదార్ ఇంటికి వస్తారు. అసలు వీళ్లవల్లే పాప ఇవాళ కిడ్నాప్‌కు గురైందని  నిషిక, వైజయంతి మండిపడతారు.ఆరోజే వీళ్లను బయటకు గెంటివేయమని చెప్పాం కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిజంగా వాళ్లే అయితే ఇప్పుడే గన్‌ తీసుకెళ్లి కాల్చిపడేస్తానని కౌషికి అనడంతో వాళ్లు కాదని జగధాత్రి అబద్ధం చెబుతుంది.అయినా పాపను పోలీసులు కాపాడాలి కదా మీరు ఎందుకు తీసుకొచ్చారని నిషిక నిలదీస్తుంది. మీరు చెప్పినట్లే ఆ రౌడీ వెధవలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాడనికి స్టేషన్‌కు వెళ్లామని...అప్పుడే జేడీ టీం పాపను తీసుకుని వచ్చారని మేం ఇంటికే వెళ్తున్నామని చెబితే ఇచ్చారని చెబుతుంది. అందరూ లోపలకి వెళ్లగా...రాగిణి వచ్చి ధాత్రితో మాట్లాడుతుండగా చెంపమీద ఉన్న వాతలు చూసి ఏమైందని అడుగుతుంది. నిషిక కొట్టిందా అని అంటే కాదని వైజయంతి కొట్టిందని చెబుతుంది. ప్రతిరోజూ ఇంట్లో బొబ్బాయి, ఫైనాపిల్ మాయమవుతుండటంతో నాకు అనుమానం వచ్చిందని....నేను నిషికక జ్యూస్ తీసుకెళ్లగా అక్కడ బొబ్బాయి ముక్కలు కనిపించాయని చెబుతుంది. కడుపుతో ఉన్న అమ్మాయి ఇలాంటివి తినకూడదని చెప్పినందుకు వైజయంతి నన్ను కొట్టిందని ఆవి తిన్నది నిషికకాదని...నేనే అంటూ చెప్పిందని అంటుంది. అయితే నిషిక కడుపు నిజం కాదా అని ధాత్రికి అనుమానం వస్తుంది.ఈ విషయం మనమధ్యే ఉంచుకుని నిషికను ఓ కంట కనిపెడదామని ధాత్రి అంటుంది.
                              అందరూ డిన్నర్‌ చేస్తుండగా...జగధాత్రి నిషికనుఅడుగుతుంది.ఇంకాఎందుకు స్కానింగ్‌కు వెళ్లడం లేదని ప్రశ్నిస్తుంది. ఇప్పుడే కాదులే అని చెప్పినా....కడుపులో ఉన్న బేబీ ఎలా ఉందో చూసుకోవాలని కదా అని అంటుంది.ఇంతలో కేదార్ యువరాజు వైపు చూస్తూ ఇలాంటివి నువ్వే చూసుకోవాలని కదాఅని అడుగుతాడు.దీంతో యువరాజుకు కోపం వస్తుంది.ప్రతి అడ్డమైన వాడు సలహాలు ఇచ్చేలా చేస్తున్నావని రేపే మనం స్కానింగ్‌కు వెళ్తున్నామని చెబుతాడు. ఆ మాటలకు నిషికకు,వైజయంతికి చెమటలు పడుతాయి. వెంటనే కౌషికి కలుగజేసుకుని  ఇప్పుడే డాక్టర్ అపాయింట్‌మెంట్‌ తీసుకుంటానని...రేపు వెళ్లి స్కానింగ్ తీయించుకోమని చెబుతుంది. ఆ మాటలకు నిషిక భయపడిపోగా....నేను చూసుకుంటానులే అని వైజయంతి అంటుంది.
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget