Trinayani August 15th: నెలవంకలో సుమన, నయనిలకు కనిపించిన భవిష్యత్తు.. విశాలాక్షితో పందెం కాసిన సుమన?
నెలవంకలో సుమనకు, నయనికి భవిష్యత్తు కనిపించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.
Trinayani August 15th: దుర్మార్గుల దృష్టి మళ్లించడానికి విశాలాక్షి చెప్పినట్లు ఎద్దులయ్య ఫేక్ చందమామని పెడతాడు. ఇక తిలోత్తమా వాళ్ళు విశాలాక్షి మాటలపై వెటకారం చేస్తూ ఉంటారు. ఇక అందరూ ఆకాశం వైపు చూస్తుండగా విశాలాక్షి నయనిని పక్కకు తీసుకెళ్లి అక్కడినుండి చూడమని చెబుతుంది. ఇక విశాలాక్షి చెప్పడంతో డమ్మక్క నయనిని అర్థ చంద్రకారం వైపు చూడమని చెబుతుంది.
ఇక అందరికీ ఫేక్ చందమామ కనిపించడంతో అదే నిజం అనుకొని కళ్ళు మూసుకుంటారు. అంతేకాకుండా మంత్రం చదివి కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి అందరూ చందమామ వైపు సుమనకు అందులో నాగుపాము కనిపిస్తుంది. ఇక నయని నిజమైన అర్థ చంద్రకారపు చందమామను చూసి మంత్రం చదివి కళ్ళు తెరిచి చూస్తుంది. అందులో తనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు.
ఇంట్లో వాళ్ళందరు మీకేమైనా కనిపించిందా అని ఒకరికొకరు అడుగుకుంటారు. తనకు పాము కనిపించిన విషయం సుమన ఎవరికి చెప్పకుండా భయపడుతుంది. వెంటనే డమ్మక్క నయనికి కనిపించింది అనటంతో ఇక్కడున్న చందమామ అక్కడ ఎలా కనిపించింది అని తిలోత్తమా అడుగుతుంది. ఇక అది బొమ్మ అని విశాలాక్షి చెబుతుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోగా వెంటనే ఎద్దులయ్య ఆ చందమామను తీసుకొచ్చి వాళ్లకు చూపిస్తాడు.
ఇదంతా కావాలనే చేశారు అని తిలోత్తమా అంటుంది. వెంటనే విశాల్ ఏం చూసావు అని అడగటంతో తనకు అస్పష్టంగా కనిపించింది అని అయోమయంగా ఉంటుంది. ఇక విశాలాక్షి వెంటనే.. వారు అడిగినవారు.. అడిగేసినవారు.. అడగాల్సిన వారు.. అడుగు తీసి అడుగు వేసేవారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. ఆ మాటలకు అందరూ ఏం అర్థం కాలేదు అన్నట్లుగా ముఖం పెడతారు.
తర్వాత సుమన చంద్ర దర్శనంలో భవిష్యత్తు గురించి ఒకరికే కనిపిస్తుంది కానీ ఇద్దరికీ ఎలా కనిపించింది అని బాగా ఆలోచనలో పడుతుంది. అప్పుడే అక్కడకు విక్రాంత్ రావడంతో తనకు నెలవంకలో భవిష్యత్తు కనిపించింది అని అనటంతో అదంతా అమ్మ, అన్నయ్య కోసం ఫేక్ చందమామను విశాలాక్షి ఏర్పాటు చేయించింది అని చెబుతాడు. అది నయని వదినకు మాత్రమే కనిపించింది అని అంటాడు. కానీ తనకు కనిపించింది అనటంతో ఏం కనిపించింది అని అడుగుతాడు విక్రాంత్.
పడగ విప్పిన పాము కనిపించింది అనడంతో షాక్ అవుతాడు. ఇక తను నీ డెలివరీ తర్వాత ఏం జరుగుతుందో అని అంటాడు. ఇక సుమన మా అక్కకు ఏమీ కనిపించలేదని ఇప్పటికైనా అర్థమైంది కదా అని అనడంతో విక్రాంత్ కాస్త చిరాకు పడి అక్కడ నుంచి వెళ్తాడు. ఆ తర్వాత విశాలాక్షి, డమ్మక్క సరదాగా ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూస్తుంటారు.
ఇక విశాలాక్షి.. అంతేనా డమ్మక్క పరుగు అందుకోవా అనటంతో వెంటనే తను.. మిమ్మల్ని దాటి వెళ్లాలంటే 14 లోకాలు దాటటమే కదా తల్లి అనడంతో వెంటనే అక్కడున్న సుమన తను ఇంకా చిన్న పిల్లనే ఇప్పుడే ఆకాశంలోకి ఎత్తేస్తే గర్వం వస్తుంది అని అంటుంది. వెంటనే డమ్మక్క కూడా అమ్మ ఎత్తు ముందు ఆకాశం చిన్నదే కదా సుమన అని అంటుంది. ఇక అదే సమయంలో అక్కడికి తిలోత్తమా, వల్లభ రావటంతో హాసిని రన్నింగ్ కామెంట్ చేస్తుంది.
అప్పుడే అక్కడికి నయని దంపతులు కూడా వస్తారు. విశాల్ వాళ్ళ ఆటను చూసి పందెం వేసుకోమని అంటాడు. ఇక వల్లభ ఆ పిల్ల గారడి చేస్తుందని.. దాంతో నీ ఆస్తులు కూడా అడుగుతుంది అనటంతో వెంటనే సుమన అలా ఎలా అడుగుతుంది వచ్చేవారం నాకు కాన్పు ఉంది అని అంటుంది. దాంతో అందరూ చిరాకు పడతారు. ఇక విక్రాంత్ మీరేమనుకుంటున్నారు అని నయనిని అడుగుతాడు.
దాంతో నయని నేను గెలిస్తే విశాలాక్షి నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి అని అంటుంది. దానితో విశాలాక్షి మనసులో చంద్రోదయ దర్శనంలో జరిగిన విషయం గురించి అడగాలని అనుకుంటుందని నాకు తెలుసు అని అనుకుంటుంది. నయని పందానికి ఒప్పుకుంటుంది విశాలాక్షి. వెంటనే తిలోత్తమా నేను ఆడుతాను అని నేను గెలిచి.. రాత్రి ఫేక్ చందమామతో చంద్రోదయం దర్శనం చేసినందుకు ఎటువంటి దాపరికం లేకుండా విశాలాక్షి జరిగిందేంటో జరగబోయేదేంటో తనతో చెప్పాలి అని అంటుంది.
విశాలాక్షి సరిపోయింది అందరి లక్ష్యం ఒకేలా ఉంది అంటుంది. ఇక సుమన కూడా నా గురి భిన్నంగా ఉంది నేను గెలుస్తే ఏం చేస్తావ్ అని అడుగుతుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ సుమనను ఆటలు ఆడటం అవసరమా అని వెటకారం చేస్తాడు విక్రాంత్. ఇక విశాల్ మరి విశాలాక్షి గెలిస్తే ఏం చేయాలో చెప్పలేదే అని అనటంతో.. అంటే మేము ఓడిపోతామా అంటూ తిలోత్తమా వెటకారంగా అంటుంది.
ఈ ఆటల్లో తన తల్లి ఆరీతేరింది అని వల్లభ తన తల్లిని పొగుడుతుంటాడు. వెంటనే హాసిని తన భర్తతో వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. సుమన కూడా చాలా సార్లు ఈ ఆట ఆడాము అని.. డమ్మక్క ను తప్పుకోమని చెప్పి ఈ ఆటలో నేనే గెలుస్తాను అని విశాలాక్షి ముందు కూర్చుంటుంది. ఇక సుమన ఆడబోతుండగా వెంటనే విక్రాంత్ ఆపి.. విశాలాక్షి గెలిస్తే ఏంటి అన్నది చెప్పలేదు కదా అనటంతో.. వెంటనే సుమన అడుక్కోమను.. తనకు అలవాటే కదా అని వెటకారంగా అంటుంది. దాంతో తిలోత్తమా, వల్లభ వెటకారంగా నవ్వుతూ ఉంటారు. వెంటనే హాసిని వారిపై చిరాకు పడుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial