Naga Panchami November 27th Episode - 'నాగపంచమి' సీరియల్: మోక్ష పంచమిల ఫస్ట్‌నైట్ - వెక్కివెక్కి ఏడుస్తున్న ఫ్యామిలీ!
Naga Panchami Today Episode: తన ప్రాణాలను పణంగా పెట్టి పంచమితో కలవాలి అని మోక్ష సిద్ధమవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Naga Panchami Serial Today Episode
మోక్షతండ్రి: మోక్ష ఈ ఇంట్లో నువ్వు అందరికన్నా చాలా తెలివైనవాడివి. అందరికీ నువ్వు ఎంత ఇష్టమో మేము మాటల్లో చెప్పలేము. మమల్ని బాధ పెట్టే పనిమాత్రం ఎప్పటికీ చేయకు మోక్ష
మోక్ష: నాకు తెలిసి నేను ఎవర్ని బాధ పెట్టే పని ఎప్పటికీ చేయను నాన్న. నా చేతుల్లో లేని దాని కోసం నేను ఎవరికీ మాట ఇవ్వలేను. కానీ మీరంతా నాకు ఒక ప్రామిస్ చేయాలి. నా జాతకం నా గండం గురించి మీ అందరకీ తెలుసు. కానీ అదేమీ తెలీకుండా నాతో వచ్చేసింది పంచమి. ఏం జరిగినా.. జరగకపోయినా నేను ఉన్నా లేకపోయినా మీరంతా పంచమిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. నన్ను నమ్మి వచ్చింది. అల్పాయుష్కుడిని అని తెలిసి నాకు ఏం కాకూడదు అని ఆశతో బతుకుతుంది. పంచమియే మోక్ష, మోక్షనే పంచమి అనుకోండి. పంచమి సంతోషమే నా సంతోషంగా భావించండి. పంచమిని మీ బిడ్డగా చూసుకోండి. తనకి నేనే సర్వస్వం. నేను లేని లోటు తనకి తెలీకూడదు. మమ్మీడాడి ఇన్ని రోజులు ఏం జరగలేదు కదా అందరం హ్యాపీగా ఉన్నాం కదా. ఇప్పుడు అలాగే ఉందాం. రండి అందరం కలిసి భోజనం చేద్దాం. పదండి..
మోక్ష, మోక్ష అంటూ అతడి తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. మరోవైపు కరాళి క్షుద్రపూజలు చేస్తుంటుంది. ఆమెకు మహామాయావి ప్రత్యక్షమవుతుంది. మంచి పనులు చేయడానికి తనకి అండగా ఉంటానని మహామాయావి హామీ ఇస్తుంది. ఇక మహామాయావి జ్వాల శరీరంలోకి ప్రవేశిస్తుంది. పంచమి ఇంట్లో జరిగే సీన్‌ను కరాళి మంత్ర శక్తితో చూస్తుంటుంది. మరోవైపు సుబ్బూ కూడా తన దివ్యదృష్టితో గమనిస్తుంటాడు. మోక్షకు పాము గండం ఉందని.. పంచమి, మోక్ష కాపురం చేస్తే మోక్ష చనిపోతాడని జ్వాలా శరీరంలోని మహామాయావి చెప్తుంటుంది. దీంతో ఫ్యామిలీలో అందరూ షాక్ అవుతారు. ఇక సుబ్బు తన శక్తిని ప్రయోగించగానే జ్వాలాలోని మహామాయావి తాను తప్పు చేయనని మరెప్పుడు రాను అని దండం పెట్టి అక్కడి జ్వాల శరీరం నుంచి వెళ్లిపోతుంది. ఇది చూసిన కరాళి కంగుతింటుంది.
మోక్షతల్లి: నాన్న మోక్ష నాకు చాలా భయంగా ఉందిరా. పొద్దున్న ఆ నల్లచొక్కా వ్యక్తి ఇప్పుడు అమ్మవారు వద్దురా
మోక్ష: అమ్మా ప్లీజ్ మీరెవ్వరూ నా గురించి భయపడకుండి. నెనొక నిర్ణయానికి వచ్చేశాను. నేను పంచమి సంతోషంగా ఉండబోతున్నాం. అది ఎన్నాళ్లు అనేది ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు భయపడుతూ కూర్చొవడం సరికాదు. పంచమి మనకు ఏం కాదు. అందరి లాగే మనమూ ఆనందంగా ఉండాలి.. ఉంటాం.. రా అని పంచమిని గదిలోకి తీసుకెళ్తాడు. మరోవైపు వైదేహి ఏడుస్తుంటుంది.
కరాళి: అయిపోయింది అంతా అయిపోయింది. నా కల నాశనం అయిపోయింది.
మోక్ష: పంచమి ఇప్పుడు మనం మొట్టమొదట చేయాల్సిన పని ఒకటి ఉంది. అది ఏంటో చెప్పుకో. మనం కలిసిన ఈ సంవత్సరకాలంలో మన మధ్య జరిగిన అన్ని మరిచిపోవాలి. పాములు గండాలు మన మనసులోంచి తుడిచేద్దాం. ఇప్పుడు నీ మనసు నిండా నేను నా మనసు నిండా నువ్వు మన ఇద్దరమే మిగిలాం. నాకు నువ్వు నీకు నేను తప్పా ఇంకేం కనిపించకూడదు. రా పంచమి
పంచమి: మనసులో.. భగవంతుడా నేను గెలవలేను అని తెలిసి నా ముందు పెద్ద అగ్ని పరీక్ష పెట్టావు. నేను ఆ మంటల్లో కాలి బూడిద అవ్వడం తప్ప మోక్ష బాబు కోరిక నెరవేర్చి తన మరణాన్ని నా కళ్లతో చూడలేను.
మోక్ష: (మనసులో.. నిన్ను చూస్తూ ఇలాగే జీవితాంతం గడిపేయాలి అని ఉంది పంచమి. కానీ నాకు అంత ఆయుష్షు లేదు. నేను లేక పోయినా నా ప్రతి రూపం ఉండాలి పంచమి. అందుకే నా ప్రాణం ఆరాట పడిపోతుంది. )ఇది కన్నీరు కార్చే సమయం కాదు పంచమి మన శరీరాలే కాదు ప్రాణాలు కూడా కలగలిపే మధుర క్షణాలు. మన బంధానికి దాంపత్యానికి తీపి గుర్తులు.
పంచమి: మనసులో.. ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరు మోక్ష బాబుని ఎలా కాపాడుకోవాలో అర్ధం కావడం లేదు. ఈ గండం నుంచి ఎలా అయినా గట్టెక్కించు స్వామి.
మోక్ష: పంచమి నువ్వు బంగారం లాంటి బిడ్డకు జన్మనివ్వాలి. ఆ బిడ్డలో నువ్వు నన్ను చూసుకోవాలి. నేను లేని లోటు నీకు తెలియాలి అంటే ఇదొక్కటే మార్గం పంచమి
ఇవాళ్టి ఎసిసోడ్ పూర్తవుతుంది.